మనోళ్ల గ్యాప్ తో దూసుకుపోతున్న పర హీరోలు!
పాన్ ఇండియా స్టార్లు అంతా రెండేళ్లకు ఒక్క సినిమా రిలీజ్ చేసే పరిస్థితుల్లోకి వచ్చేసారు. ఇంకా ఆ కాలం రెట్టింపు అవ్వడానికే అవకాశం ఉంది తప్ప తగ్గే ఛాన్స్ మాత్రం లేదు.;
పాన్ ఇండియా స్టార్లు అంతా రెండేళ్లకు ఒక్క సినిమా రిలీజ్ చేసే పరిస్థితుల్లోకి వచ్చేసారు. ఇంకా ఆ కాలం రెట్టింపు అవ్వడానికే అవకాశం ఉంది తప్ప తగ్గే ఛాన్స్ మాత్రం లేదు. రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్, బన్నీ లాంటి స్టార్లు ఇప్పటికే ఆ మార్గంలో ప్రయాణిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ కూడా `వారణాసి`తో ఆ జాబితాలో చేరిపోతారు. సీనియర్ హీరోలైన చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున లాంటి స్టార్లు తలుచుకుంటే ఏడాదికో సినిమా రిలీజ్ చేయోచ్చు. కానీ కథలు సెట్ అవ్వకపోవడం..క్వాలిటీ కంటెంట్ కోసం పడే తాపత్రయంలో కొంత సమయం వృద్ధా అవుతుంది.
కలెక్షన్ల బేసిస్ లో సినిమాలు చేయడంతో వారి మధ్య పోటీ కూడా కనిపిస్తోంది. దీంతో మరింత జాప్యం తప్పడం లేదు. ఇక టైర్-2, టైర్ -3 హీరోలు కూడా నత్తనడకనే సినిమాలు చేస్తున్నారు. నాణ్యత గల కథల కోసం ఎదురు చూసే క్రమంలో విపరీతమైన జాప్యం జరుగుతోంది. మెగా మేనల్లుడు సాయిదుర్గ తేజ్ `విరూపాక్ష`, బ్రో లాంటి విజయాల తర్వాత ఇంత వరకూ మరో సినిమా రిలీజ్ చేయలేదు. మూడేళ్ల గ్యాప్ అనంతరం `సంబరాల ఏటిగట్టు`తో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. మరో యంగ్ హీరో నిఖిల్ రెండేళ్ల తర్వాత `స్వయంభూ`తో ప్రేక్షకుల ముందు కొస్తున్నాడు.
షూటింగ్ పూర్తయినా ది బెస్ట్ విజువల్ ఎఫెక్స్ట్ అనుభూతి అందించాలని టీమ్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జాప్యం చేస్తోంది. అలాగే అడవి శేషు స్టోరీల విషయంలో ఎంత మాత్రం రాజీ పడకుండా పని చేస్తున్నారు. మంచి స్టోరీ దొరికే వరకూ ఖాళీగా ఉంటున్నాడు కానీ కంగారు పడటం లేదు. దాదాపు నాలుగేళ్ల తర్వాత అతడు నటించిన `డెకాయిట్` త్వరలో రిలీజ్ అవుతుంది. మరో యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి కూడా మూడేళ్ల తర్వాత ఇటీవలే `అనగనగా ఒక రాజు`తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అతడి ఆలస్యానికి తగ్గ విజయం ఈ చిత్రం అందించింది.
తదుపరి సినిమా కోసం సమయం పట్టినా పర్వాలేదు హిట్ కంటెంట్ తోనే రావాలని ఎదురు చూస్తున్నాడు. శర్వానంద్, నాని, అఖిల్, రామ్, విజయ్ దేవరకొండ, నితిన్ లాంటి టైర్ 2 హీరోలు కూడా జాప్యం విషయంలో ఎంత మాత్రం చింతించడం లేదు. ఇలా యంగ్ హీరోలు...ఫాంలో ఉన్న స్టార్స్ గ్యాప్ తీసుకోవడంతో? పర భాషల హీరోలకు లైన్ క్లియర్ గా ఉంటుంది. దుల్కర్ సల్మాన్ , ధనుష్, శివకార్తికేయన్, కార్తీ లాంటి స్టార్లు టాలీవుడ్ లో దూసుకు పోతు న్నారు.
దుల్కర్ సల్మాన్, ధనుష్ లాంటి వారు తెలుగులో వేగంగా స్టార్స్ గా ఎస్లాబ్లిష్ అయ్యారంటే? కారణం వారి కథల ఎంపికతో పాటు, టాలీవుడ్ హీరోల అలసత్వం కూడా ఓ కారణంగా వైరల్ అవుతోంది.తెలుగు హీరోల రిలీజ్ గ్యాప్ లో ఆయా హీరోల చిత్రాలు రిలీజ్ అవ్వడం, అవి సక్సెస్ అవ్వడంతో? బలమైన ప్యాన్ బేస్ ఏర్పడుతుంది.