'దండోరా' ట్రైలర్.. క్లిక్ అయ్యేలా ఉందే!

తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో ఇప్పుడు రూపొందుతున్న లేటెస్ట్ మూవీ దండోరా. శివాజీ, నందు, నవదీప్, బిందు మాధవి లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఆ సినిమాను మురళీకాంత్‌ తెరకెక్కిస్తున్నారు.;

Update: 2025-12-20 04:44 GMT

తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో ఇప్పుడు రూపొందుతున్న లేటెస్ట్ మూవీ దండోరా. శివాజీ, నందు, నవదీప్, బిందు మాధవి లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఆ సినిమాను మురళీకాంత్‌ తెరకెక్కిస్తున్నారు. లౌక్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌ పై రవీంద్ర బెనర్జీ ముప్పనేని రూపొందిస్తున్నారు. ఇప్పుడు క్రిస్మస్‌ సందర్భంగా ఈ నెల 25న రిలీజ్ చేయనున్నారు.



 


మంచి అంచనాలతో థియేటర్స్ లో రిలీజ్ కు సిద్ధమవుతున్న దండోరా ట్రైలర్ ను మేకర్స్ తాజాగా రివీల్ చేశారు.. కులం వంటి సెన్సిటివ్ విష‌యాన్ని క‌మ‌ర్షియ‌ల్ పంథాలో మూవీ రూపొందుతున్నట్లు ట్రైలర్ ద్వారా ఇప్పుడు ఫుల్ క్లారిటీ వచ్చింది. ఊరి బ‌య‌ట‌ కొంత మంది శ‌వాన్ని మోసుకెళ్తున్న సన్నివేశంతో దండోరా ట్రైలర్ మొదలైంది.



 


ఇంత దూరం శ‌వాన్ని ఎందుకు మోసుకురావాల‌ని వారితో పాటు వచ్చే చిన్న పిల్లాడు అప్పుడు అడుగుతాడు. దానికి వాళ్ళు.. మ‌న చావు పుట్ట‌కుల‌ు అన్నీ ఆ ఊరి బ‌య‌ట రాసిండ్రా ఆ దేవుడు అంటూ చెబుతారు. ఆ తర్వాత సినిమాలో పాత్రలను అన్నింటినీ మరోసారి పరిచయం చేశారు మేకర్స్. కీలక సన్నివేశాలు కూడా చూపించారు.



 


ఊరిలో అట్ట‌డుగు వ‌ర్గాల నుంచి వ‌చ్చిన నటుడు న‌వ‌దీప్ ప్రెసిడెంట్‌ గా ఎన్నిక‌వుతాడు. అక్క‌డి నుంచి ఊర్లో వ‌చ్చే స‌మ‌స్య‌లు, కుల పెద్ద‌ల‌కు, ఆయనకు మధ్య వ‌చ్చే ఘ‌ర్ష‌ణ‌లు ఎలా ఉంటాయ‌నే విష‌యాల‌ను కూడా చూపించారు. ట్రైలర్ చివరలో నవదీప్ కొట్రా డప్పు.. అంటూ మాస్ బీట్ కు స్టెప్స్ వేయటం అందరినీ ఆకట్టుకుంటోంది.



 


అయితే ట్రైలర్ లో శివాజీ, బిందు మాధ‌వి పాత్రల మ‌ధ్య లవ్ తోపాటు ఎమోష‌న‌ల్ స‌న్నివేశాల‌ను మేకర్స్ హృద్యంగా చూపించారు. శివాజీ రోల్‌ లోని సీరియ‌స్ కోణాన్ని చక్కగా ఆవిష్క‌రించారు. ర‌వికృష్ణ‌, మ‌ణిక పాత్ర‌ల మ‌ధ్య ప్రేమ స‌న్నివేశాలు ఆసక్తి రేపుతున్నాయి. ముఖ్యంగా ట్రైలర్ లోని డైలాగ్స్.. ఆలోచింపచేస్తున్నాయని చెప్పడంలో నో డౌట్.

'ఒకటి పెళ్లి దగ్గర లేకపోతే చావు దగ్గర .. ఈ రెండింటిలోనే కదా వీళ్ల ఆటలు సాగేవి', 'మన బతుకులు మారాలంటే మనకు కావాల్సిందొక్కటి..', 'కల్లు మత్తు కాదు కదా సార్. రాత్రి తాగింది పొద్దుగాల దిగనీకి కులం మత్తు సార్..', 'ఓటుకి గుద్దినావో.. క్వార్ట‌ర్ గుద్ది ఇంట్లో,,' అంటూ వచ్చిన డైలాగ్స్.. ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

ఏదేమైనా ట్రైలర్.. ఇంట్రెస్టింగ్ గా సాగి.. సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తోంది. సినిమా స్టోరీలోని డెప్త్ ను ఇప్పుడు స్పష్టంగా తెలియజేస్తుంది. ట్రైలర్ లోని ప్రతి అంశం కూడా ఆకట్టుకుంటుంది. అయితే డిసెంబర్ 25వ తేదీన సినిమా రిలీజ్ కానుండగా.. ముందు ప్రీమియర్స్ ఉండనున్నాయి. మరి భారీ అంచనాల మధ్య విడుదల అవుతున్న దండోరా మూవీ ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.


Full View


Tags:    

Similar News