ఫ్యామిలీ మ్యాన్ హీరో సినిమాను బ్యాన్ చేస్తామ‌ని నిర‌స‌న‌

టెక్నాల‌జీతో పాటూ జ‌నాలు, ఆడియ‌న్స్ కూడా మారిపోయారు. ఒక‌ప్పుడు సినిమాల్లోని ఏదైనా సీన్స్ అస‌భ్య‌కరంగా ఉన్నా మ‌న‌కెందుకులే గొడవ అని ఊరుకునేవారు.;

Update: 2026-02-04 11:38 GMT

టెక్నాల‌జీతో పాటూ జ‌నాలు, ఆడియ‌న్స్ కూడా మారిపోయారు. ఒక‌ప్పుడు సినిమాల్లోని ఏదైనా సీన్స్ అస‌భ్య‌కరంగా ఉన్నా మ‌న‌కెందుకులే గొడవ అని ఊరుకునేవారు. కానీ ఇప్పుడ‌లా కాదు, ఏ మాత్రం అభ్యంత‌ర‌కరంగా ఉన్నా వెంట‌నే దాన్ని సోష‌ల్ మీడియాకు లాగి ర‌చ్చ ర‌చ్చ చేసేస్తున్నారు. త‌మ‌కు న్యాయం జ‌ర‌గాలని అవ‌స‌రమైతే ఈ విష‌యంలో ఎంత‌వ‌ర‌కైనా వెళ్తామ‌ని మేక‌ర్స్ ను బెదిరించేస్తున్నారు కూడా.

ఫ్యామిలీ మ్యాన్ తో మ‌నోజ్ బాజ్‌పాయ్‌కు మంచి ఫేమ్

అలా ప‌లు అభ్యంత‌రాల‌తో ఇప్ప‌టికే ఎన్నో సినిమాలు రిలీజ్ టైమ్ లో ఇబ్బంది ప‌డిన సంద‌ర్భాలున్నాయ‌నే విష‌యం తెలిసిందే. ఇప్పుడు ప్ర‌ముఖ న‌టుడు మ‌నోజ్ బాజ్‌పాయ్ నుంచి రాబోతున్న ఘుస్కోర్ పండ‌త్ సినిమా కూడా అలాంటి ఇబ్బందుల్నే ఎదుర్కొంటుంది. ఫ్యామిలీ మ్యాన్ మూవీతో తిరుగులేని ఫేమ్ ను సంపాదించుకున్న మ‌నోజ్ బాజ్‌పాయ్ నుంచి త్వ‌ర‌లోనే ఘుస్కోర్ పండ‌త్ అనే సినిమా రాబోతుంది.

రీసెంట్ గా రిలీజైన ఘుస్కోర్ పండ‌త్ టీజ‌ర్

రీసెంట్ గా ఈ సినిమా నుంచి మేక‌ర్స్ టీజ‌ర్ రిలీజ్ చేశారు మేక‌ర్స్. దీంతో సినిమా గురించి ఎక్కువ మందికి తెలిసింది. ఎన్నో టైటిల్స్ ఉండ‌గా, త‌మ సామాజిక వ‌ర్గాన్ని కించ ప‌రిచేలా టైటిల్ పెట్ట‌కూడ‌ద‌ని ఓ వ‌ర్గానికి చెందిన ఆడియ‌న్స్ అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. ఈ మూవీ టైటిల్ బ్రాహ్మ‌ణ వ‌ర్గాన్ని టార్గెట్ చేసేలా ఉంద‌ని భావిస్తూ ప‌లువురు నెటిజ‌న్లు సోష‌ల్ మీడియాలో మేక‌ర్స్ పై మండిప‌డుతున్నారు.

టైటిల్ మార్చాల‌ని డిమాండ్

వీలైనంత త్వ‌ర‌గా టైటిల్ ను మార్చాల‌ని, లేని ప‌క్షంలో సినిమాను బ్యాన్ చేస్తామ‌ని నెటిజ‌న్లు పోస్టులు పెడుతున్నారు. ఒక సామాజిక వ‌ర్గాన్ని అవ‌మాన‌ప‌రిచేలా కావాల‌నే ఇలాంటి టైటిల్ పెట్టార‌ని, సినిమాల్లో మీకు న‌చ్చింది చూపించ‌డం త‌ప్పేమీ కాద‌ని, కానీ ఓ వ‌ర్గాన్ని కించ‌ప‌రిచేల టైటిల్ పెట్ట‌డం క‌రెక్ట్ కాద‌ని నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు.

ఇప్ప‌టివ‌ర‌కు స్పందించని నెట్‌ఫ్లిక్స్

అయితే ఈ సినిమా థియేట‌ర్ల‌లో కాకుండా డైరెక్ట్ ఓటీటీలోనే రిలీజ్ కానుంది. ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ లో త్వ‌ర‌లోనే ఘుస్కోర్ పండ‌త్ స్ట్రీమింగ్ కు రాబోతుంది. అయితే సోష‌ల్ మీడియాలో ఇంత వివాదం జ‌రుగుతున్నా నెట్‌ఫ్లిక్స్ ఇప్ప‌టివ‌ర‌కు దీనిపై స్పందించింది లేదు. టైటిల్ విష‌యంలో జ‌రిగే ర‌చ్చ చూస్తుంటే మేక‌ర్స్ టైటిల్ మార్చే వ‌ర‌కు సినిమాను రిలీజ్ చేయ‌నిచ్చేలా క‌నిపించ‌డం లేదు.

Tags:    

Similar News