• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ట్రెండింగ్: అల్లు...

ట్రెండింగ్: అల్లు స్నేహారెడ్డి ఈ కొత్త రోల్ షాకిస్తోందే!

| అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహారెడ్డికి అరుదైన గుర్తింపు లభించింది. భారతదేశపు తొలి స్టెప్‌వెల్ ఆర్ట్ బినాలే ‘బావోలి ఆర్ట్ సంగం’కు ఫౌండింగ్ చైర్‌పర్సన్‌గా (కల్చర్ అండ్ హెరిటేజ్) నియమితులయ్యారు. భారతీయ చారిత్రక మెట్ల బావులు, కళా వారసత్వంపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం లక్ష్యం. ఈ ఉత్సవం డిసెంబర్ 1, 2026 నుంచి జనవరి 10, 2027 వరకు జరగనుంది.

By - Sivaji Kontham
Update: 2026-11-12 17:45 GMT

భార‌త‌దేశ సంస్కృతి- సాంప్ర‌దాయాల గురించే కాదు.. భార‌తీయ సంస్కృతిలో భాగ‌మైన చారిత్ర‌క నిర్మాణాల గురించి ప్ర‌చారం చేయ‌డం కూడా ఒక గొప్ప విష‌యం. అలాంటి ఒక గొప్ప ప‌నికి పూనుకున్నారు అల్లు స్నేహా రెడ్డి.

 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణిగా కంటే త‌న‌దైన ఇండివిడ్యువాలిటీతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించే స్నేహా తన కెరీర్‌లో ఒక కొత్తద‌నం నిండిన‌ ప్రతిష్ఠాత్మకమైన అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. భారతదేశపు మొట్టమొదటి స్టెప్‌వెల్ ఆర్ట్ బినాలే (మెట్ల బావుల కళా ఉత్సవం) అయిన `బావోలి ఆర్ట్ సంగం` సంస్థకు ఫౌండింగ్ ఛైర్‌పర్సన్ (కల్చర్ & హెరిటేజ్)గా నియమితులయ్యారు. ఇప్పటివరకు తన వ్యాపార వ్యవహారాలు.. ప్రత్యేకమైన ఫ్యాషన్ సెన్స్‌తో గుర్తింపు పొందిన స్నేహారెడ్డి ఇప్పుడు దేశ కళా, సాంస్కృతిక రంగాల్లో కీలక బాధ్యతలు చేపట్టారు.

భారతదేశంలోని ప్రాచీనమైన‌ చారిత్రక మెట్ల బావుల (స్టెప్ వెల్స్) అద్భుత నిర్మాణ కౌశలాన్ని.. వాటి సాంస్కృతిక ప్రాముఖ్యతను తిరిగి వెలుగులోకి తీసుకురావడమే ఈ `బావోలి ఆర్ట్ సంగం` ప్రధాన లక్ష్యం. నీరు.. కళ .. భారతీయ నాగరికతల మధ్య ఉన్న విడదీయరాని.. శాశ్వత సంబంధాన్ని నేటి తరానికి పరిచయం చేయడానికి ఈ వేదిక ద్వారా కృషి చేయ‌నున్నారు. భార‌త‌దేశ‌పు ఘనమైన వారసత్వ సంపదను భావి తరాలకు అందించే దిశగా ఇది ఒక అర్థవంతమైన ముందడుగు.

కళలు, సంస్కృతి అంటే స‌హ‌జంగానే స్నేహారెడ్డికి ఆస‌క్తితో పాటు అభిరుచి ఉంది. అందుకే ఈ ఉత్స‌వానికి ప్ర‌చార‌క‌ర్త‌గా చేర‌డం గొప్ప విప్ల‌వానికి నాంది ప‌ల‌క‌బోతోంది. అల్లు స్నేహారెడ్డి చేరికతో ఈ బినాలేకు ఒక సరికొత్త దృక్పథం, ప్రత్యేక ఆకర్షణ లభించనుంది. ఛైర్‌పర్సన్‌గా భారతీయ కళా వారసత్వాన్ని దేశవిదేశాలకు చాటిచెప్పడంతో పాటు..మన సాంస్కృతిక మూలాలపై యువతలో మరింత అవగాహన, ఆసక్తిని పెంపొందించే కార్యక్రమాల్లో భాగస్వామి కానున్నారు. ఈ నియామకంపై అల్లు అభిమానులు, సినీ - కళా రంగాల ప్రముఖులు త‌న‌ను అభినందిస్తున్నారు.

భారతీయ వారసత్వ సంపదను ఒకే వేదికపై ఆవిష్కరించే ఈ ప్రతిష్ఠాత్మక `బావోలి ఆర్ట్ సంగం` ఉత్సవం 1 డిసెంబర్ 2026 నుండి 10 జనవరి 2027 వరకు అత్యంత వైభవంగా జరగనుంది. కళాకారులు.. చరిత్రకారులు.. సంస్కృతి ప్రేమికులను ఒకే చోట చేర్చే ఈ అరుదైన వేడుకలో స్నేహారెడ్డి కీలక పాత్ర పోషించనుండటంతో ఈ ఈవెంట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక‌పై అల్లు వారి కోడ‌లు కేవ‌లం ఫ్యాష‌నిస్టా మాత్ర‌మే కాదు.. భార‌తీయ క‌ళ‌ల్ని, హెరిటేజ్ అండ్ క‌ల్చ‌ర్ ని ప్రచారం చేసే బ్రాండ్ అంబాసిడ‌ర్ గా స‌మాజం గుర్తించి గౌర‌వించ‌నుంది.

Tags:    
  • allusnehareddy 
  • alluarjun 
  • baoliartsangam 
  • indianheritage 
  • indianartandculture 

Similar News

యంగ్ హీరోలతో సుకుమార్.. లిస్టు పెరుగుతూనే ఉందిగా..

2026-11-19 22:30 GMT

'మనం' లాంటి కొత్త స్క్రిప్టు.. అంచ‌నాలు పెంచేసాడే!

2026-11-19 21:13 GMT

ర‌ష్మిక స్పీచ్ స‌రే.. ఆ మెడ‌లో కేజీ బంగారు క‌డియంపైనే క‌న్ను!

2026-11-19 21:12 GMT

ఆ హీరోని సొంత కొడుకులా చూసుకున్న సూర్య..!

2026-11-19 21:10 GMT

సాయి పల్లవి వేసుకునే రుద్రాక్ష మాల వెనుక ఇంత కథ ఉందా?

2026-11-19 21:10 GMT

కూతురి పెళ్లి జీవితంపై వివాదం.. మౌనం వీడిన అర్జున్ సర్జా.. సంచలన నిర్ణయం!

2026-11-19 21:10 GMT

ఇద్దరు కొడుకుల ముందు మనసులో మాట చెప్పిన ధనుష్..!

2026-11-19 21:09 GMT

రాజమౌళికి లేని రికార్డ్.. రామాయణ డైరెక్టర్ ఖాతాలో!

2026-11-19 21:08 GMT

నా చిన్న కూతుర్ని కూడా వదలరా? ట్రోలర్స్‌పై రేణు దేశాయ్ ఫైరింగ్!

2026-11-19 21:08 GMT

షారుక్ కుమారుడిలో నిగ‌ర్విని చూసిన స్టార్ డైరెక్ట‌ర్!

2026-11-19 21:07 GMT

చూడ‌ముచ్చ‌టైన జంట‌కు దిష్ఠి త‌గులుతుందేమో!

2026-11-19 21:07 GMT

ఈ కుర్రాడు విజయ్ సేతుపతి రూట్లో వెళతాడా..

2026-11-19 21:06 GMT

Copyright @2026

Powered by Blink CMS