ఒకప్పుడు ప్రభాస్ ఆ బాలీవుడ్ డైరెక్టర్ తో వర్క్ చేయాలని ఉందన్నాడు. ఇప్పుడు చేస్తాడా?
| ఓ ఇంటర్వ్యూలో తెలుగు దర్శకులు కాకుండా ఎవరితో సినిమా చేయాలనుకుంటున్నారని అడగ్గా.. రాజ్‌కుమార్ హిరానీ పేరు చెప్పారు ప్రభాస్. అయితే వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ప్రభాస్ వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉండగా, తెలుగు దర్శకులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
బాహుబలి మూవీతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ స్టార్ డైరెక్టర్లందరికీ బెస్ట్ ఛాయిస్ గా మారిపోయాడు. ప్రభాస్ మూవీ కోసం అభిమానులు వేయి కన్నులతో ఎదురుచూస్తుంటారు. కెరియర్ స్టార్టింగ్ లో వర్షం, ఛత్రపతి, డార్లింగ్, బిల్లా, మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి సక్సెస్ ఫుల్ సినిమాలను చేసిన ఆయన ఒక ఇంటర్వ్యూలో తెలుగు డైరెక్టర్లు కాకుండా వేరే ఏ దర్శకుడితో మీకు మూవీ చేయాలని ఉంది అని యాంకర్ అడిగిన ప్రశ్నకి ప్రభాస్ ఏమి ఆలోచించకుండా రాజ్ కుమార్ హిరానీ తో సినిమా చేయాలని ఉందని చెప్పాడు.
ప్రభాస్ రాజ్ కుమార్ హిరానీ కాంబో వర్కౌట్ అవుతుందా...
ఎడిటర్ గా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజ్ కుమార్ హిరానీ సంజయ్ దత్ తో చేసిన మున్నాభాయ్ ఎంబీబీఎస్, లగేరహో మున్నాభాయి మూవీస్ తో సక్సెస్ లను సాధించాడు. 'త్రి ఇడియట్స్' మూవీ ని ఇండియాలోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిపాడు. ఆ సమయంలో అతనితో సినిమా చేయడానికి చాలా మంది స్టార్ హీరోలు ఇంట్రెస్ట్ చూపించారు. ప్రస్తుతం ప్రభాస్ అంతర్జాతీయ హీరోగా మారిపోయాడు. రాజ్ కుమార్ హిరానీ మాత్రం 'డంకి' మూవీ తో ప్లాప్ ను మూటగట్టుకున్నాడు. ఈ క్రమంలో వీళ్ళిద్దరి కాంబోలో మూవీ రావడం కష్టమనే అంటున్నారు. దానికి తోడు ప్రభాస్ లైనప్ కూడా చాలా పెద్దగా ఉంది. ఒకవేళ వీళ్ళిద్దరి కాంబో వర్కౌట్ అయిన రాజ్ కుమార్ హిరానీ ప్రభాస్ రేంజ్ యాక్షన్ సన్నివేశాలను తీయలేడని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. అలాగే ప్రభాస్ ను ఒక క్లాస్ లుక్ లో చూపించిన బాగుంటుందనేవారు ఉన్నారు.
ప్రభాస్ చూపంతా తెలుగు డైరెక్టర్ల మీదేనా?
ఇంతకు ముందు ప్రభాస్ ఓం రావత్ డైరెక్షన్ లో చేసిన 'ఆది పురుష్' మూవీ ప్లాప్ అయింది. దాంతో ప్రభాస్ కి బాలీవుడ్ డైరెక్టర్ల మీద నమ్మకం పోయిందని తన ఇమేజ్ ను హ్యాండిల్ చేయడం వాళ్ల వల్ల కావడం లేదని తెలుగు డైరెక్టర్లు అయితేనే బెస్ట్ అని మన వాళ్ళకే అవకాశాలను ఇస్తున్నాడు. ఇదంతా చూస్తున్న తెలుగు ప్రేక్షకులు సైతం ప్రభాస్ మంచి నిర్ణయం తీసుకున్నాడంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు...