• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  200 ఏళ్ల చరిత్ర కలిగిన...

200 ఏళ్ల చరిత్ర కలిగిన ఆభరణాలు.. కరీనాకపూర్ కు వారసత్వంగా ఇంకేం లభించాయంటే?

| దీపావళి సందర్భంగా కరీనా కపూర్ ధరించిన 30 క్యారెట్ల పచ్చ ఆభరణంపై వివాదం మొదలైంది. దానిపై ఖురాన్‌లోని ‘ఆయత్ అల్ కుర్సీ’ వచనం ఉండటంతో కాంగ్రెస్ నేత అబ్బాస్ హఫీజ్ ఆమెకు, స్టైలిస్ట్ రియా కపూర్‌కు నోటీసులు పంపారు. ఈ నేపథ్యంలో సైఫ్ కుటుంబ వారసత్వ ఆస్తులు చర్చకు వచ్చాయి. గురుగ్రామ్‌లోని రూ.800 కోట్ల ప్యాలెస్‌తో పాటు, వీరిద్దరి ఆస్తుల విలువ రూ.1,685 కోట్లుగా సమాచారం.

By - Madhu Reddy
Update: 2026-11-12 10:05 GMT

ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనాకపూర్ ఖాన్ ఇప్పుడు వివాదంలో చిక్కుకున్నారు.ఈమె ధరించిన 200 ఏళ్ల చరిత్ర కలిగిన ఒక రాజవంశ ఆభరణం వివాదానికి దారితీసింది. విషయంలోకి వెళ్తే దీపావళి సందర్భంగా ఈమె ధరించిన 30 క్యారెట్ల పచ్చ లాకెట్ పై పవిత్ర ఖురాన్ లోని 'ఆయత్ అల్ - కుర్సీ' వచనం చెక్కి ఉండడంతో ఇప్పుడు అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నేషనల్ మీడియా కోఆర్డినేటర్ అబ్బాస్ హఫీజ్.. కరీనాకపూర్ అలాగే ఆమె స్టైలిస్ట్ రియా కపూర్లకు నోటీసులు పంపించడంతో ఈ వివాదం కాస్త సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అయిపోయింది. ఈ ఒక్క ఘటనతో కరీనాకపూర్ కి తన భర్త కుటుంబం నుండి ఇంకెన్ని ఆస్తులు వారసత్వంగా లభించాయి అనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

పటౌడీ, భోపాల్ రాజవంశానికి చెందిన సైఫ్ అలీ ఖాన్.. రాజకుటుంబం ద్వారా పొందిన వారసత్వ ఆభరణాలు, రాజ భవనాల హక్కులు సైఫ్ అలీ ఖాన్ ద్వారా తన భార్య కరీనాకపూర్ ఖాన్ కి కూడా సంక్రమించాయి. నిజానికి వీరి స్థిరాస్తుల వారసత్వం చుట్టూ కొన్ని చట్టపరమైన, ఆర్థిక వివాదాలు చుట్టుముట్టిన విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో రాజ కుటుంబం నుండి వీరికి లభించిన ఆస్తుల వివరాలు అన్ని ఇప్పుడు వైరల్ గా మారాయి.

భోపాల్ చివరి నవాబ్ ఆయన హమీదుల్లా ఖాన్ కాలం నాటి అనగా 200 ఏళ్ల సంవత్సరాల క్రితం నాటి అరుదైన వజ్రాల ఆభరణం 'కల్గి' కరీనా కపూర్ కి వారసత్వంగా లభించింది. అయితే ఈ ఆభరణాన్ని 2012లో సైఫ్ అలీ ఖాన్ తన వివాహ సమయంలో ధరించగా.. 2026 దీపావళి వేడుకల్లో కరీనాకపూర్ ధరించి ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది. ఈ 30 క్యారెట్ల అరుదైన బంగారు ఆభరణం సైఫ్ అలీ ఖాన్ నానమ్మ సాజిదా సుల్తాన్ కరీనాకపూర్ కి వారసత్వంగా అందించారు.

దీంతోపాటు హర్యానాలోని గురుగ్రామ్ లో 10 ఎకరాల విస్తీర్ణంలో 150 గదులతో నిర్మించబడిన సుమారుగా రూ.800 కోట్ల విలువైన రాజభవనం కూడా ఉంది. నిజానికి ఈ ప్యాలెస్ సైఫ్ కి వారసత్వంగా నేరుగా లభించలేదు. సైఫ్ తండ్రి మన్సూర్ అలీ ఖాన్ మరణానికి ముందు దీనిని నీమ్రానా హోటల్స్ గ్రూప్ కి అద్దెకు ఇచ్చారు. ఆ తర్వాత సైఫ్ అలీ ఖాన్ తన సినిమాల ద్వారా వచ్చిన సంపాదనతో ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించి.. ఆ ప్యాలెస్ ను సొంతం చేసుకున్నారు. ఇకపోతే సైఫ్, కరీనా కపూర్ తో పాటు వారి పిల్లలకి కూడా ఈ ప్యాలెస్ ఉమ్మడి ఆస్తిగా నిలిచింది.

మరొకవైపు వారసత్వ ఆస్తులతో పాటు సైఫ్ అలీ ఖాన్, కరీనాకపూర్ ఇద్దరు కూడా సినిమాల ద్వారా, యాడ్స్ ద్వారా, వ్యాపార రంగాల ద్వారా సంపాదించుకున్న ఆస్తుల విలువ సుమారుగా రూ.1685 కోట్లు అని సమాచారం. ఇందులో సైఫ్ అలీఖాన్ నికర ఆస్తులు విలువ రూ.1200 కోట్లు అని , కరీనా నికర ఆస్తి విలువ రూ.485 కోట్లు అని తెలుస్తోంది. ఇక అలాగే వీరిద్దరూ కలిసి ముంబైలోని బాంద్రాలో ఉన్న రూ.103కోట్ల విలువైన సద్గురు శరన్ అనే అపార్ట్మెంట్ ను కొనుగోలు చేశారు. అలాగే స్విట్జర్ ల్యాండ్ లో 33 కోట్ల విలువైన చాలెట్ ని కూడా సొంతం చేసుకున్నారు. ఏది ఏమైనా కష్టార్జితంతో పాటు వారసత్వంగా వచ్చిన ఆస్తులు వీరిని అత్యంత ధనవంతులుగా మార్చేశాయని అభిమానులు సైతం కామెంట్ చేస్తున్నారు.

Tags:    
  • kareenakapoor 
  • saifalikhan 
  • kareenakapoornews 
  • royaljewellery 
  • patoudifamily 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS