• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  Box Office >  బాహుబలి 2ను వెనక్కి...

బాహుబలి 2ను వెనక్కి నెట్టిన రామాయణం.. పుష్ప 2కు కూడా షాక్!

| రణబీర్ కపూర్ నటించిన ‘రామాయణం పార్ట్ 1’ విడుదలైన ఏడు రోజుల్లోనే ఇండియాలో రూ.511.10 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. దీంతో వేగంగా రూ.500 కోట్ల మార్కును అందుకున్న చిత్రాల్లో రెండో స్థానంలో నిలిచింది. ఆరు రోజుల్లోనే ఈ ఘనత సాధించిన ‘ధురంధర్ 2’ మొదటి స్థానంలో ఉండగా, ‘పుష్ప 2’ 11 రోజులు తీసుకుంది.

By - Priya Chowdhary Nuthalapti
Update: 2026-11-12 14:30 GMT

పాన్ ఇండియా సినిమాల బాక్సాఫీస్ లెక్కలు రోజురోజుకూ పూర్తిగా మారిపోతున్నాయి. ఒకప్పుడు రూ.100 కోట్లు సాధిస్తే పెద్ద విజయంగా చూసేవారు. ఇప్పుడు రూ.500 కోట్లు, రూ.1000 కోట్ల కలెక్షన్ల సాధిస్తేనే ఆ సినిమా గొప్ప అని ఫీల్ అవుతున్నారు. అది కాకుండా ఎంత త్వరగా సాధిస్తుంది అనే దాని పైన కూడా.. సినిమా సక్సెస్ బేస్ అవుతుంది.

ఈ విషయంలో తాజాగా రణబీర్ కపూర్ నటించిన రామాయణం పార్ట్ 1 అందరి దృష్టిని తెగ ఆకర్షిస్తుంది. నవంబర్ 5, 2026న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా కేవలం ఏడు రోజుల్లోనే ఇండియాలో రూ.500 కోట్ల నెట్ కలెక్షన్ల మార్కును దాటింది. అయితే ఈ జాబితాలో రణబీర్ కపూర్ రామాయణం కంటే ముందు రణ్‌వీర్ సింగ్ నటించిన ధురంధర్ 2: ది రివెంజ్ ఉంది. ఈ సినిమా కేవలం ఆరు రోజుల్లోనే రూ.500 కోట్ల ఇండియా నెట్ కలెక్షన్లను సాధించింది. ఇక రామాయణం పార్ట్ 1 ఏడు రోజుల్లో రూ.511.10 కోట్ల ఇండియా నెట్ వసూళ్లతో రెండో స్థానంలో నిలిచింది. మొదటి స్థానాన్ని అందుకోవడానికి ఒక్క రోజు దూరంలో నిలిచింది.

మరోవైపు అల్లు అర్జున్ నటించిన పుష్ప 2: ది రూల్ హిందీ వెర్షన్ రూ.500 కోట్ల మార్కును చేరుకోవడానికి 11 రోజులు తీసుకుంది. ఆ సమయానికి హిందీలో రూ.552.10 కోట్ల నెట్ కలెక్షన్లను సాధించింది. ఇక ఒరిజినల్ ధురంధర్ సినిమా ఈ మైలురాయిని అందుకోవడానికి 16 రోజులు పట్టింది. షారుఖ్ ఖాన్ జవాన్ 18 రోజుల్లో రూ.500 కోట్ల క్లబ్‌లోకి ప్రవేశించింది. ప్రభాస్ కెరీర్‌లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న బాహుబలి 2 34 రోజులు తీసుకుంది. రణబీర్ కపూర్ యానిమల్ మాత్రం 39 రోజుల్లో ఈ మార్కును అందుకుంది. ప్రస్తుతం హిందీ బాక్స్ ఆఫీస్ పరంగా ఈ సినిమా.. బాహుబలి, పుష్ప రికార్డు దాటేసి అందరినీ ఆశ్చర్యపరిస్తోంది.

Tags:    
  • ramayana 
  • ranbirkapoor 
  • dhurandhar2 
  • pushpa2 
  • baahubali2 

Similar News

2024-26 మధ్య తెలుగులో వచ్చిన బెస్ట్ కంటెంట్ బేస్డ్ మూవీస్ ఇవేనా...

2026-11-12 06:06 GMT

టికెట్ రేట్లు పెరిగినా ప్రేక్షకులను రప్పించిన సినిమాలు.. పుష్ప 2 రికార్డు ప్రత్యేకం!

2026-11-12 05:55 GMT

6 రోజుల్లో 100 కోట్ల క్ల‌బ్.. సౌత్‌లో ఈ ఒక్క‌డికే

2026-11-11 16:37 GMT

500 కోట్ల క్లబ్.. సౌత్ హీరోల్లో టాప్ ఎవరంటే!

2026-11-11 05:58 GMT

ఈ హీరోనే ఇప్పుడు బాలీవుడ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియ‌న్ సూప‌ర్‌స్టార్?

2026-11-11 03:58 GMT

మండే రోజు రామాయణం మంటలు

2026-11-10 14:11 GMT

'రామాయణం' బుకింగ్స్.. ఒక్క రోజులో 16 లక్షల టికెట్లు!

2026-11-10 06:39 GMT

దర్శకుడి నుంచి నిర్మాతగా.. వెంకీ కుడుముల సినీ ప్రయాణంలో ఆసక్తికర విషయాలు!

2026-11-10 06:13 GMT

సూర్య@650+కోట్లు... అరుదైన రికార్డ్

2026-11-10 04:36 GMT

పదేళ్ల రికార్డ్ బ్రేక్ అయ్యే టైం వచ్చిందా?

2026-11-10 04:35 GMT

డమ్మీ థియేటర్లు.. బల్క్ బుకింగ్స్

2026-11-09 12:56 GMT

Copyright @2026

Powered by Blink CMS