6 రోజుల్లో 100 కోట్ల క్లబ్.. సౌత్‌లో ఈ ఒక్కడికే
| రణబీర్ కపూర్ నటించిన ‘రామాయణం పార్ట్-1’ సౌత్‌లో ఆరు రోజుల్లో రూ.104.45 కోట్ల నెట్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. కర్ణాటకలో రూ.41.20 కోట్లు, తెలుగులో రూ.33 కోట్లు, తమిళంలో రూ.17.35 కోట్లు, మలయాళంలో రూ.12.90 కోట్లు వచ్చాయి. సౌత్‌లో యష్ క్రేజ్ కూడా ఈ వసూళ్లకు కారణమని విశ్లేషిస్తున్నారు.
బాలీవుడ్ నుంచి చాలా మంది స్టార్ హీరోలు సౌత్ మార్కెట్ ని కొల్లగొట్టాలని, ఇక్కడ వందల కోట్లు ఎగరేసుకుపోవాలని ప్రయత్నించారు. నార్త్‌లో రెబల్ స్టార్ ప్రభాస్ సాధించిన చందంగా, ఓపెనింగుల్లోనే సౌత్ నుంచి 100 కోట్లు కొల్లగొట్టాలని చాలా మంది బాలీవుడ్ అగ్ర హీరోలు ప్రయత్నించారు. కానీ ఇప్పటివరకూ ఏ హిందీ హీరోకి పప్పులు ఉడకలేదు. సౌత్ లో బాలీవుడ్ హీరోల హవా మరీ ఆ స్థాయిలో లేదు. ముఖ్యంగా మొదటి వారంతంలోనే 100 కోట్లు కొల్లగొట్టిన చరిత్ర లేదు.
అందుకే ఇప్పుడు రణబీర్ కపూర్ గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. అతడు నటించిన రామాయణం పార్ట్ -1 కేవలం 6 రోజుల్లో సౌత్ నుంచి 100 కోట్ల నెట్ వసూళ్లను సాధంచడం అరుదైన రికార్డ్. మరీ ముఖ్యంగా తెలుగు వెర్షన్ కంటే కన్నడం నుంచి అత్యధిక వసూళ్లు దక్కాయి. ఈ వివరాలను పరిశీలిస్తే....
తొలి 6 రోజుల్లో రామాయణం వసూళ్లను చూస్తే.. కర్నాటక నుంచి రూ. 41.20 కోట్లు వసూలవ్వగా, తెలుగులో రూ. 33.00 కోట్లు వసూలైంది. తమిళంలో రూ. 17.35 కోట్లు, అలాగే మలయాళంలో రూ. 12.90 కోట్లు వసూలయ్యాయి. గతంలో వచ్చిన జవాన్, వార్ 2, యానిమల్ వంటి భారీ చిత్రాల లైఫ్‌టైమ్ సౌత్ డబ్బింగ్ కలెక్షన్లను కేవలం ఆరు రోజుల్లోనే రామాయణం అధిగమించి.. పాన్-ఇండియా స్థాయిలో ఈ చిత్రానికి ఉన్న క్రేజ్‌ను స్పష్టం చేస్తోంది.
ఇప్పటివరకూ రామాయణం -1 చిత్రం భారతదేశంలో మొత్తం రూ. 440.45 కోట్ల నెట్(గ్రాస్ 750కోట్లు దాటింది)ని అధిగమించగా.. ఇందులో ఒక్క సౌత్ డబ్బింగ్ వెర్షన్ల వాటాయే దాదాపు 23.7 శాతం ఉందని ట్రేడ్ పేర్కొంది. కన్నడంలో అత్యధిక వసూళ్లు దక్కడానికి కారణం రాకింగ్ స్టార్ యష్ క్రేజ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో యష్ క్రేజ్ అమాంతం పదింతలు పెరిగింది. రామాయణం పార్ట్ 1 వసూళ్ల దూకుడు చూస్తుంటే ఇది సునాయాసంగా 1000 కోట్ల క్లబ్ ని అధిగమిస్తుంది. కానీ నమిత్ మల్హోత్రా చెప్పిన బడ్జెట్ ప్రకారం.. పార్ట్ 1 ఇంకా ఎక్కువ నెట్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది. రామాయణం పార్ట్ 2 ఇంతకుమించి వసూలు చేయాల్సి ఉంటుంది.
`రామాయణం పార్ట్ -1`తో రణబీర్ కపూర్ తొలిసారి 1000 కోట్ల క్లబ్ అందుకునేందుకు అవకాశం ఉంది. అలాగే సౌత్ లో అతడి క్రేజ్ ఇప్పుడు పదింతలు పెరిగింది. అయితే పురాణేతిహాసాలతో కాకుండా అతడు సోషల్ డ్రామాలతోను సౌతిండియాలో తన ప్రభావం చూపాల్సి ఉంటుంది. రణబీర్ నటించే `యానిమల్ పార్క్` కూడా సౌత్ లో భారీ విజయం సాధించాల్సి ఉంటుంది. ఒకవేళ సోషల్ డ్రామాలతో 1000 కోట్ల క్లబ్ ఫీట్ సాధిస్తే అతడు ప్రభాస్, అల్లు అర్జున్ తర్వాత అంతటి ప్రభావవంతమైన హీరోగా ఎదిగినట్టు!