• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  Box Office >  డమ్మీ థియేటర్లు.. బల్క్...

డమ్మీ థియేటర్లు.. బల్క్ బుకింగ్స్

| కొన్ని సినిమాలకు బుక్ మై షోలో భారీ బుకింగ్స్ కనిపించడం వెనుక ఏజెన్సీల ట్రిక్స్ ఉన్నాయని నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని వెల్లడించారు. పాత థియేటర్లలో షోలు ఓపెన్ చేసి, రూ.50 టికెట్లను వేర్వేరు అకౌంట్లతో బల్క్‌గా కొనుగోలు చేస్తారని తెలిపారు. రేటింగ్స్‌ను కూడా మానిప్యులేట్ చేస్తున్నారని, ఇలాంటి ట్రిక్స్‌తో సినిమా హిట్ కాదని స్పష్టం చేశారు.

By - M Prashanth
Update: 2026-11-09 12:56 GMT

సినిమా రిలీజ్ రోజు బుక్ మై షోలో గంటకు 20 వేలు, 30 వేల టికెట్లు తెగుతున్నట్టు చూసి చాలామంది సినిమాకు మంచి డిమాండ్ ఉందని అనుకుంటారు. కానీ థియేటర్ దగ్గరకు వెళ్లేసరికి సీట్లు ఖాళీగా కనిపించడం వెనుక అసలు ఏం జరుగుతుందనే విషయాన్ని నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని బయటపెట్టారు. ప్రతి సినిమా ఇలాంటి పనులు చేయదని, అసలైన క్రేజ్ ఉన్న పెద్ద ప్రాజెక్టులకు ఆర్గానిక్ బుకింగ్స్ వేరుగా ఉంటాయని ఆయన స్పష్టం చేస్తూనే, కొన్ని సినిమాల విషయంలో తెరవెనుక జరిగే ట్రిక్స్ వివరించారు.

ధీరజ్ చెప్పిన వివరాల ప్రకారం, ఈ బుకింగ్ వ్యవహారమంతా కొన్ని ఏజెన్సీలు లూప్‌హోల్స్ వాడుకుని నడిపిస్తున్న ఒక గేమ్. జనాలు ఆన్‌లైన్ ట్రెండింగ్స్ చూసి థియేటర్లకు వెళ్లాలని నిర్ణయించుకుంటున్నారని తెలిశాక, దాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే పద్ధతులు మొదలయ్యాయని ఆయన పేర్కొన్నారు. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సినిమాలకు సహజంగానే జనం వస్తారని, అయితే సరైన బజ్ లేని కొన్ని సినిమాలు మాత్రమే ఇలాంటి హడావుడితో ప్రేక్షకులను నమ్మించే ప్రయత్నం చేస్తున్నాయని ఆయన తెలిపారు.

ఈ ట్రెండింగ్ వెనుక ఉన్న అసలు ప్రాసెస్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. సరిగ్గా నడవనివి క్లోజ్ అయిన పాత థియేటర్లను బుక్ మై షోలో ఎంచుకుని, వాటిలో రోజుకు నార్మల్ గా ఉండే నాలుగు షోలకు బదులు పది షోలు ఓపెన్ చేస్తారట. టికెట్ రేటును కూడా నార్మల్ ధరల కంటే చాలా తక్కువగా అంటే 50 రూపాయలు మాత్రమే పెట్టి, వేర్వేరు అకౌంట్లతో బల్క్ గా కొనేస్తారని ధీరజ్ చెప్పారు. యాప్ లో టికెట్ల నెంబర్ మాత్రమే కౌంట్ అవుతుంది కాబట్టి, తక్కువ ఖర్చుతో గంటల వ్యవధిలో సినిమా ట్రెండింగ్‌లోకి వచ్చేలా మేనేజ్ చేస్తున్నారని ఆయన వివరించారు.

టికెట్ బుకింగ్స్ మాత్రమే కాకుండా రేటింగ్స్ చుట్టూ కూడా ఏజెన్సీలు పెద్ద నెట్‌వర్క్ నడుపుతున్నాయని ధీరజ్ చెప్పారు. సినిమా విడుదలైన మొదటి రోజే కావాలని 1 స్టార్ రేటింగులు వేసి సినిమాపై బ్యాడ్ టాక్ తీసుకొస్తారని, ఆ తర్వాత స్కోర్ పెంచడానికి నిర్మాతల దగ్గర ప్యాకేజీలు డిమాండ్ చేస్తారని ఆయన వెల్లడించారు. ఈ సమస్య రాకుండా ఉండేందుకు కొందరు నిర్మాతలు కోర్టు ఆర్డర్ల కోసం లక్షలు ఖర్చు పెడుతుంటే, చిన్న సినిమాలు ఆ ఒత్తిడిని భరించలేక ఈ ఏజెన్సీల చక్రబంధంలో చిక్కుకుంటున్నాయని అన్నారు.

ఇలాంటి వ్యవహారాలు ఎక్కువ రోజులు దాగవని, ఆడియన్స్ కూడా క్రమంగా ఈ డిజిటల్ ట్రిక్స్ పసిగడుతున్నారని ధీరజ్ అభిప్రాయపడ్డారు. యాప్ లో టికెట్లు భారీగా తెగినట్లు చూపించినా, గ్రౌండ్ లెవెల్ లో జనం లేకపోవడంతో ఆ హడావుడి వెనుక వాస్తవం ఏంటో సినీ ప్రియులకు త్వరగానే అర్థమైపోతోందని ఆయన అన్నారు. ఇలాంటి పద్ధతుల వల్ల ఆన్‌లైన్ బుకింగ్స్ పై సాధారణ ప్రేక్షకులకు ఉండే నమ్మకం దెబ్బతినే అవకాశముందని ఆయన ప్రస్తావించారు. అంతిమంగా థియేటర్లో కంటెంట్ బాగుంటేనే సినిమా నిలబడుతుందని, ఇలాంటి గంటల ట్రెండింగులు ఫ్లాప్ ప్రాజెక్టులను హిట్ చేయలేవని ధీరజ్ తెలిపారు.

Tags:    
  • dheerajmogilineni 
  • bookmyshow 
  • fakebookings 
  • movieticketbookings 
  • tollywood 

Similar News

'ధురంధర్ 2' డే 14 కలెక్షన్లను దాటేసిన రామాయణం!

2026-11-19 05:08 GMT

సంక్రాంతి 'కాకా' పై రూ.150 కోట్ల పందెం..!

2026-11-18 22:30 GMT

'అవెంజర్స్' బుకింగ్స్ చూస్తే మన నిర్మాతలకు ఓ ప్రశ్న!

2026-11-17 10:02 GMT

డిసెంబర్ బరి నుంచి తప్పుకున్న సింహం!

2026-11-17 05:39 GMT

డబ్బింగ్ సినిమాల జోరు.. తెలుగు చిన్న సినిమాలకు థియేటర్లలో కష్టాలు!

2026-11-17 04:00 GMT

తండ్రీకొడుకుల బాక్స్ ఆఫీస్ క్లాష్!

2026-11-16 22:30 GMT

రామాయణ చైనీస్ వర్షన్ రెడీ అవుతుందట!

2026-11-16 19:05 GMT

ఈ వారం బాక్సాఫీస్ క్లాష్.. పరిస్థితి ఎలా ఉంది?

2026-11-16 10:25 GMT

నైజాం.. జాగ్రత్త పడకపోతే అంతే!

2026-11-16 04:30 GMT

రామాయ‌ణ‌: 10రోజుల్లో 1200 కోట్లు.. 2000 కోట్ల క్ల‌బ్ ఇంకెంత దూరం?

2026-11-15 09:42 GMT

కంటెంట్ యుద్ధం.. ఎవరిదో విజయం?

2026-11-15 00:30 GMT

తెలుగు రైట్స్‌లో టాప్ సినిమాలు.. 'వారణాసి' ఎంత తేవాలి?

2026-11-14 04:20 GMT

Copyright @2026

Powered by Blink CMS