'రామాయణం' బుకింగ్స్.. ఒక్క రోజులో 16 లక్షల టికెట్లు!
| రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ నటించిన ‘రామాయణం’ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. బుక్‌మైషోలో 24 గంటల్లో 16.6 లక్షల టికెట్లు అమ్ముడై కొత్త రికార్డు సృష్టించినట్లు సమాచారం. పుష్ప 2, ధురంధర్ 2 రికార్డులను కూడా అధిగమించినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమాకు నితీష్ తివారీ దర్శకత్వం వహించారు.
రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ నటించిన 'రామాయణం' బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తోంది. విడుదలకు ముందే ఈ సినిమాపై ఉన్న అంచనాలు ఓపెనింగ్స్‌లో కనిపించాయి. అయితే మొదటి రోజు వసూళ్లతోనే సరిపెట్టకుండా బుకింగ్స్‌లోనూ సినిమా కొత్త రికార్డులు అందుకుంటోంది. లేటెస్ట్ గా బుక్‌మైషోలో 'రామాయణం' సాధించిన ఓ రికార్డు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
బుక్‌మైషో ప్లాట్ఫామ్లో 24 గంటల వ్యవధిలో ఏకంగా 16.6 లక్షల టికెట్లు అమ్ముడైనట్లు సమాచారం. ఇప్పటివరకు ఈ ప్లాట్ఫామ్లో ఒక సినిమాకు రోజులో అమ్ముడైన అత్యధిక టికెట్ల నెంబర్ ఇదేనని చెబుతున్నారు. గతంలో భారీ ఓపెనింగ్స్ సాధించిన సినిమాల రికార్డులను కూడా 'రామాయణం' దాటేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా విడుదలైన తర్వాత కూడా ఈ స్థాయిలో బుకింగ్స్ రావడం విశేషం.
నార్మల్ గా భారీ సినిమాలకు అడ్వాన్స్ బుకింగ్స్‌లో మంచి జోరు కనిపిస్తుంది. మొదటి రోజు, వీకెండ్ షోలకు ఎక్కువగా టికెట్లు అమ్ముడవుతుంటాయి. కానీ 'రామాయణం' విషయంలో విడుదల తర్వాత కూడా ప్రేక్షకులు థియేటర్లకు వెళ్తున్నారు. అందుకే ఒక్కరోజులో ఇంత భారీ సంఖ్యలో టికెట్లు అమ్ముడయ్యాయి. సినిమాకు ఉన్న క్రేజ్‌తో పాటు బుకింగ్స్ జోరు కూడా వసూళ్లకు కలిసొస్తోంది.
నితీష్ తివారీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటించారు. రావణుడి పాత్రలో యష్ కనిపించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి విజువల్ ఎఫెక్ట్స్ హైలెట్ గా నిలిచాయి. ముఖ్యంగా యుద్ధ సన్నివేశాలు, భారీ సెట్స్ కోసం చిత్రబృందం పెద్ద ఎత్తున ఖర్చు చేసింది. అంతర్జాతీయ స్థాయి సాంకేతిక నిపుణులు కూడా ఈ ప్రాజెక్ట్ కోసం వర్క్ చేశారు.
మరోవైపు 'రామాయణం' ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే భారీ స్థాయికి చేరుకున్న ఈ సినిమా బుకింగ్స్‌లోనూ రికార్డు సృష్టించడం నిర్మాతలకు కలిసొచ్చే విషయమే. ముఖ్యంగా హిందీతో పాటు ఇతర భాషల్లోనూ విడుదల కావడంతో దేశవ్యాప్తంగా ఎక్కువ థియేటర్లలో ప్రేక్షకులకు అందుబాటులో ఉంది.
ఇప్పటికే ‘రామాయణం’ బుకింగ్స్‌లో పుష్ప 2, ధురంధర్ 2 వంటి భారీ సినిమాల రికార్డులను దాటినట్లు తెలుస్తోంది. ఇప్పుడు 24 గంటల టికెట్ అమ్మకాల్లోనూ కొత్త రికార్డు నమోదు కావడం విశేషం. అయితే ఈ సినిమాకు మరో పార్ట్ కూడా ఉండటంతో నిర్మాత నమిత్ మల్హోత్రాకు బాక్సాఫీస్ పరంగా ఇంకా పెద్ద టార్గెట్ ఉంది. మొదటి భాగం కోసం పెట్టిన భారీ బడ్జెట్‌తో పాటు రెండో భాగం నిర్మాణం కూడా ఈ ప్రాజెక్ట్‌లో కీలకం. అందుకే మొదటి భాగానికి వస్తున్న వసూళ్లు రెండో భాగం బిజినెస్‌కు కూడా ఉపయోగపడనున్నాయి..