• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నాగ‌చైత‌న్య `వృషకర్మ`కు ఆ...

నాగ‌చైత‌న్య `వృషకర్మ`కు ఆ ఇద్ద‌రూ పోటీనా?

| నాగచైతన్య నటించిన పీరియాడిక్ థ్రిల్లర్ ‘వృషకర్మ’ డిసెంబర్ 4న విడుదల కానుంది. అదే రోజున సల్మాన్ ఖాన్ ‘మాతృభూమి’, శ్రద్ధా కపూర్ ‘ఈత’ చిత్రాలు కూడా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అయితే ‘విరూపాక్ష’ దర్శకుడు కార్తీక్ వర్మ దండు తెరకెక్కించిన ‘వృషకర్మ’పై తెలుగు రాష్ట్రాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. వినూత్న కథాంశం, మేకింగ్‌తో ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

By - Sivaji Kontham
Update: 2026-11-07 04:06 GMT

టాలీవుడ్ యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా తెరకెక్కిన‌ లేటెస్ట్ పీరియాడిక్ థ్రిల్లర్ `వృషకర్మ` డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ఇదే తేదీకి బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన `మాతృభూమి`తో పాటు, శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో రూపొందిన `ఈత` (హిందీ) చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద పోటీకి దిగుతుండటంతో సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. సల్మాన్ ఖాన్, శ్రద్ధా కపూర్ వంటి బిగ్ స్టార్ల చిత్రాలు రేసులో ఉన్నా కానీ.. వీటి ప్ర‌భావం మెట్రోల్లో మ‌ల్టీప్లెక్సుల వ‌ర‌కే.. తెలుగు రాష్ట్రాల్లో నాగచైతన్యకు ఉన్న బలమైన ఫ్యాన్ బేస్.. ఇటీవలి సక్సెస్ రేటు.. సినిమాపై ఉన్న విపరీతమైన క్యూరియాసిటీ కారణంగా `వృషకర్మ` అద్భుతమైన ఓపెనింగ్స్ సాధించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

కంటెంట్ పరంగా `వృషకర్మ` మిగిలిన రెండు చిత్రాల కంటే పూర్తిగా భిన్నమైన పీరియాడిక్ కాన్సెప్ట్‌తో తెర‌కెక్కింది. గతంలో `విరూపాక్ష` చిత్రంతో మిస్టరీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ను తెరపై ఆవిష్కరించి బాక్సాఫీస్ వద్ద రికార్డు విజయాన్ని అందుకున్న దర్శకుడు కార్తీక్ వర్మ దండు.. ఇప్పుడు మరింత వినూత్నమైన కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించడం అతిపెద్ద ప్లస్ పాయింట్‌గా విశ్లేషిస్తున్నారు. ప్రాచీన నమ్మకాలు..మిస్టరీ.. అడ్వెంచర్ నేపథ్యంతో కూడిన విజువల్స్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తాయని నిర్మాతలు అత్యంత నమ్మకంతో ఉన్నారు. స్క్రిప్ట్ డిజైన్ - మేకింగ్ స్థాయిలోను విరూపాక్షను మించిన హంగులతో ఈ సినిమాను రూపొందించడం బిజినెస్ వర్గాల్లో భారీ హైప్‌ను క్రియేట్ చేసింది.

ప్రస్తుత సినిమా వాతావరణంలో టాలీవుడ్, బాలీవుడ్ అనే ప్రాంతీయ భేదాలు పూర్తిగా చెరిగిపోయాయి. దక్షిణాది నుండి వస్తున్న వైవిధ్యమైన, నాణ్యమైన కంటెంట్‌ను ఉత్తరాది ప్రేక్షకులు విపరీతంగా ఆదరిస్తున్నారని గడిచిన కొన్నేళ్ల బాక్సాఫీస్‌ లెక్క‌లు స్పష్టం చేస్తున్నాయి. ఈ క్రమంలో నాగచైతన్య మార్కెట్ పరిధి కూడా పాన్-ఇండియా స్థాయిలో పెరుగుతోంది. సల్మాన్ ఖాన్ లేదా మరో స్టార్ హీరో సినిమా వచ్చిందంటే ఇతర సినిమాలను చూడకూడదనే పాత ఆలోచనా విధానం (మీమాంశ) ప్రేక్షకులలో ఇప్పుడు లేదు. మంచి కంటెంట్ ఉంటే అన్ని భాషల ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్న తరుణంలో.. మారిన ఈ పాన్-ఇండియా ట్రెండ్ `వృషకర్మ` చిత్రానికి అన్ని విధాలా కలిసివస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

మరోవైపు పోటీలో ఉన్న ఇతర చిత్రాల పరిస్థితిని పరిశీలిస్తే.. శ్రద్ధా కపూర్ నటించిన `ఈత` ఒక రియల్ లైఫ్ బయోపిక్ కేటగిరీలో తెరకెక్కడంతో ప్రేక్షకులలో కొంత ఆసక్తిని కలిగిస్తోంది. కానీ దక్షిణాది మార్కెట్‌లో ఈ సినిమాకు ఎలాంటి ఆదరణ లభిస్తుందో వేచి చూడాల్సి ఉంది. ఇక సల్మాన్ ఖాన్ `మాతృభూమి` చిత్రం విషయానికొస్తే.. దాని ఒరిజినల్ కాన్సెప్ట్ నుంచి స్క్రిప్ట్ పక్కదారి పట్టిందనే వార్తలపై ఇప్పటికే ప్రేక్షకులకు ఒక అవగాహన ఉండటంతో.. అది బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావం చూపుతుందోననే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

మొత్తానికి డిసెంబర్ 4న మూడు భారీ ప్రాజెక్ట్‌లు తలపడుతున్నా.. బాక్సాఫీస్ రేసులో `వృషకర్మ` చిత్రానికి ఎలాంటి కాంపిటీటర్లతోనూ భయం లేదని సినీ విశ్లేషకులు అంచ‌నా వేస్తున్నారు. వినూత్నమైన కాన్సెప్ట్.. దర్శకుడి ట్రాక్ రికార్డ్.. నిర్మాణ విలువలు తోడవడంతో నాగచైతన్య `వృషకర్మ` బాక్సాఫీస్ వద్ద తన ప్రత్యేక ముద్ర వేయడానికి పూర్తి సంసిద్ధంగా ఉంది. ముఖ్యంగా ఉత్త‌రాదినా ఈసారి మ‌రింత‌గా చైతూ త‌న జోరు చూపిస్తాడ‌ని కూడా అభిమానులు భావిస్తున్నారు.

Tags:    
  • nagachaitanya 
  • vrushakarma 
  • matrubhumi 
  • eetha 

Similar News

దీపావ‌ళి లుక్‌తో క‌ట్టి ప‌డేసిన న‌టి కం గాయ‌ని

2026-11-09 22:30 GMT

సీనియ‌ర్ న‌టుడు పోగొట్టుకున్న‌ది స‌రే వార‌స‌త్వ‌ ఆస్తుల విలువ‌?

2026-11-09 19:30 GMT

'DNK' ట్రైలర్ టాక్: బెట్టింగులు.. దొంగతనాలతో మౌళి కామెడీ గోల

2026-11-09 19:16 GMT

'పొలిమేర 3' గ్లింప్స్: ​కొమరయ్య తాంత్రికం.. అర్జున్ సర్జా పవర్ఫుల్ ఎంట్రీ

2026-11-09 19:10 GMT

ఏంటిది? బేబి బంప్‌తో స‌మంత ప్ర‌యోగాలు!

2026-11-09 19:04 GMT

సెల‌బ్రేష‌న్‌లో మ‌హేష్-చ‌ర‌ణ్‌ తో ఆ ప్ర‌ముఖుడు ఎవ‌రు?

2026-11-09 19:03 GMT

పిక్‌టాక్‌ : మెగా ఫ్యాన్స్‌కి బెస్ట్‌ దీపావళి గిఫ్ట్‌

2026-11-09 19:02 GMT

పిక్‌టాక్‌ : స్టైలిష్ అందాల పలక్‌

2026-11-09 19:01 GMT

అలీ భార్య జుబేదా బేగం సోషల్ మీడియా సంపాదన ఎంతో తెలుసా?

2026-11-09 13:30 GMT

డమ్మీ థియేటర్లు.. బల్క్ బుకింగ్స్

2026-11-09 12:56 GMT

కారాల కళ్ళ పిల్లకు ఆది సైట్.. 'ఈగో రాజా' రౌడీ రాకసి

2026-11-09 12:51 GMT

21 ఏళ్ల‌కే వంద సినిమాల‌తో సంచ‌ల‌నం!

2026-11-09 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS