• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పిక్‌టాక్‌ : స్టైలిష్...

పిక్‌టాక్‌ : స్టైలిష్ అందాల పలక్‌

| నటి పలక్ తివారీ సోషల్ మీడియాలో తన గ్లామరస్ ఫోటోషూట్లతో అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 5 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఈ ఏడాది ‘లుఖే’ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆమెకు కొత్త సినిమా ఆఫర్లు వస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం రెండు, మూడు ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయని తెలుస్తోంది.

By - Ramesh Palla
Update: 2026-11-09 19:01 GMT

ఇండస్ట్రీలో అడుగు పెట్టి మూడు ఏళ్లు అవుతున్నా నటిగా ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కించుకోలేక పోయిన ముద్దుగుమ్మ పలక్‌ తివారీ సోషల్‌ మీడియాలో మాత్రం ఆకట్టుకుంటూ దూసుకు పోతుంది. రెగ్యులర్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో అందమైన ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా ఈ అమ్మడు అందరి దృష్టిని ఆకర్షిస్తూ వస్తుంది. ఇప్పటికే ఈమె గతంలో షేర్‌ చేసిన ఫోటోలు, వీడియోలు నెట్టింట ఎంతో మంది అభిమానులను తెచ్చి పెట్టింది. ఇప్పుడు అంతకు మించి అన్నట్లుగా ముద్దుగుమ్మ పలక్‌ తన అందమైన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా షేర్‌ చేసింది. ఈమె ఎప్పుడు ఫోటోలు షేర్‌ చేసినా బాలీవుడ్‌లో ఎంతో మంది ముద్దుగుమ్మలతో పోల్చితే ఈమె చాలా అందంగా ఉంది. ఎందుకు ఇండస్ట్రీ వారు ఈమెను గుర్తించడం లేదు అంటూ కామెంట్‌ చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా అదే విధంగా సోషల్‌ మీడియా ద్వారా ఈ అమ్మడి ఫ్యాన్స్ కామెంట్‌ చేస్తున్నారు.





 


అందాల ఫోటో షూట్‌తో ఆకట్టుకుంది...

స్టైలిష్ అందాలను సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేస్తూ ఎప్పటికప్పుడు తన అభిమానులను పెంచుకుంటూ, తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ ను సొంతం చేసుకుంటున్న పలక్‌ తివారీ తాజాగా షేర్‌ చేసిన ఈ ఫోటోలు చూపు తిప్పనివ్వడం లేదు. క్లీవేజ్ షో చేస్తూ స్టైలిష్ ఔట్‌ ఫిట్‌ లో మత్తు ఎక్కించే విధంగా హొయలు పోతూ, అందం అంటే ఇలా ఉండాలి, అందంకు అర్థం ఈమె రూపం అన్నట్లుగా ఫోటోలకు ఫోజ్ ఇచ్చింది. అందంగా కనిపించడం ఒక ఎత్తు అయితే, ఫోటోలకు ఫోజ్‌ ఇవ్వడంలో కొందరు చాలా ప్రతిభ కలిగి ఉంటారు. పలక్‌ కచ్చితంగా మంచి ఎక్స్‌ప్రెషన్స్‌ ఇవ్వడంలో దిట్ట అని మరోసారి ఈ ఫోటోలతో నిరూపితం అయిందని, సినిమాల్లోనూ ఇలాంటి మంచి ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చేందుకు పలక్‌ రెడీగా ఉన్నా ఆమెకు ఆఫర్లు రావడం లేదు అంటూ ఆమె సన్నిహితులు సైతం సోషల్‌ మీడియాలో చర్చించుకోవడం మనం చూస్తూ ఉన్నాం.




 


సోషల్‌ మీడియా ద్వారా గుర్తింపు...

ఈ మధ్య కాలంలో సోషల్‌ మీడియా ద్వారా గుర్తింపు దక్కించుకుని హీరోయిన్‌గా అవకాశాలు దక్కించుకున్న వారు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు పలక్ తివారీ సైతం మెల్ల మెల్లగా సోషల్‌ మీడియా నుంచి వెండి తెరపైకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక మంచి ఛాన్స్ పడితే చాలు ఈమె అందానికి కచ్చితంగా బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్స్ సరసన నిలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటూ సోషల్‌ మీడియాలో చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇండస్ట్రీ వారు ఈమెను గుర్తించే రోజు కోసం వారు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈమె బాలీవుడ్‌ లో ఎంట్రీ ఇచ్చింది, కానీ సినిమాల పరంగా ఈమెకు ఆశించిన స్థాయిలో పాజిటివ్‌ ఫలితాన్ని ఇవ్వలేదు. అయినా కూడా ఇండస్ట్రీలో ఈ అమ్మడు కొనసాగుతూ వస్తోంది. ముందు ముందు ఈ అమ్మడు మరిన్ని మంచి ఆఫర్లు దక్కించుకుంటుందనే విశ్వాసం వ్యక్తం అవుతోంది.




 


వెబ్‌ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు...

ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా అయిదు మిలియన్‌ల ఫాలోవర్స్ ను కలిగి ఉన్న ఈ అమ్మడు ఈ ఏడాది లుఖే అనే వెబ్‌ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ వెబ్‌ సిరీస్‌ లో మెయిన్‌ లీడ్‌ చేయడంతో పాటు, అందం, అభినయంతో మెప్పించింది. సినిమాలు, సిరీస్‌లు, మ్యూజిక్ వీడియోలు... ఇలా ఏదో ఒకదాంతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేసేందుకు ఈ అమ్మడు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. వెబ్‌ సిరీస్‌ తో ఆకట్టుకోవడంతో ఇటీవలే ఈమెకు ఒక సినిమా ఆఫర్‌ వచ్చిందనే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం రెండు మూడు సినిమాలు చర్చల దశలో ఉన్నాయని, వచ్చే ఏడాదిలో ఈమె నటించిన రెండు సినిమాలు అయినా ప్రేక్షకుల ముందుకు వస్తాయని సన్నిహితులు చెబుతున్నారు. పలక్‌ తివారీ ఆకట్టుకునే రూపంతో పాటు, యాక్టింగ్‌ లో మంచి స్కిల్స్ ఉన్నాయి కనుక ఇప్పుడు కాకున్నా వచ్చే ఏడాది, ఆ తర్వాత ఏడాది అయినా కచ్చితంగా విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

Tags:    
  • palaktiwari 
  • palaktiwariphotos 
  • palaktiwariphotoshoot 
  • palaktiwariglamour 
  • lukhewebseries 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS