పిక్‌టాక్ : మెగా ఫ్యాన్స్‌కి బెస్ట్ దీపావళి గిఫ్ట్
| దీపావళి సందర్భంగా రామ్ చరణ్ భార్య ఉపాసన, అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో మెగా అభిమానులు ఈ ఫోటోను విస్తృతంగా షేర్ చేస్తున్నారు. కుటుంబ బాధ్యతలతో పాటు సొంత వ్యాపారాలను నిర్వహిస్తున్న వీరిద్దరిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
దీపావళి పండుగ సందర్భంగా చాలా సినిమాలకు సంబంధించిన పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్స్, గ్లిమ్స్ అంటూ చాలా వచ్చాయి. కేవలం తెలుగు మాత్రమే కాకుండా ఇతర భాషల సినిమాలకు సంబంధించిన గ్లిమ్స్, పోస్టర్స్ సైతం వచ్చిన సంగతి తెల్సిందే. దీపావళి ఫుల్ కలర్ ఫుల్‌గా సినీ ప్రియులకు నిలిచింది. ఎన్ని ఫోస్టర్స్, ఫోటోలు, టీజర్స్ వచ్చినా కొన్ని చాలా స్పెషల్‌గా నిలుస్తాయి. ఈ ఏడాది దీపావళికి ఫుల్ కలర్ ఫుల్ లైటింగ్ ఇచ్చినట్లుగా ఒక ఫోటో సోషల్ మీడియాలో వెలిగి పోతుంది. దీపావళి కాంతి మొత్తం ఈ ఫోటోలో ఉందా అనిపించేంత అందంగా ఉన్న ఈ ఫోటోను మెగా ఫ్యాన్స్ తో పాటు అంతా తెగ షేర్ చేస్తున్నారు. ఈ రేర్ కలయిక గురించి సోషల్ మీడియాలో చాలా మంది చర్చించుకుంటున్నారు. ఎక్కువ మంది పాజిటివ్‌గా మాట్లాడుకుంటూ ఉంటే, కొందరు మాత్రం నెగిటివ్ కామెంట్స్ సైతం చేస్తూ ఉన్నారు. మొత్తానికి ఈ ఫోటో ట్రెండ్ అవుతోంది.
మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో...
ఈ ఫోటో విషయానికి వస్తే దీపావళి సెలబ్రేషన్ సందర్భంగా మెగా ఫ్యాన్స్ కోసం అన్నట్లుగా ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన, స్టైలిష్ ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి లు కలిసి ఉన్న ఈ ఫోటోను చూసేందుకు రెండు కళ్లు చాలడం లేదు అంటూ మెగా ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. సాధారణంగా రామ్ చరణ్, అల్లు అర్జున్ కలిసి ఉన్న ఫోటోలకే ఫ్యాన్స్ తెగ హైప్ ఫీల్ అవుతారు. అలాంటిది ఈ ఫోటో వారి దృష్టిని మరింతగా ఆకర్షిస్తోంది. ఇద్దరు మెగా ఫ్యామిలీ ఇంటి కోడలు అయినప్పటికీ, మెగా ఫ్యాన్స్ వీరిని ఎంతగా అభిమానిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే మెగా ఇంటి వారు అయిన వీరిని మెగా ఫ్యాన్స్ వారి భర్తల స్థాయిలో అభిమానిస్తూ ఉంటారు. అందుకే ఈ ఫోటో అంతగా వైరల్ అవుతుంది అనడంలో సందేహం లేదు.
ఉపాసన, స్నేహారెడ్డి ఫోటో వైరల్...
స్నేహా రెడ్డి, ఉపాసన ఇద్దరూ ఒక వైపు ఫ్యామిలీని చూసుకుంటూ వ్యాపార సామ్రాజ్యం ను నడిపిస్తూ ఎంతో మంది మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. తమ భర్తలు స్టార్స్, వారు సంపాదిస్తారు, హాయిగా కూర్చుని తినవచ్చు అని కాకుండా, తాము కష్టపడుతామని వీరిద్దరూ సొంత వ్యాపారాలు చేస్తూ బిజీ బిజీగా ఉంటారు. ఒక వైపు ఫ్యామిలీ బాధ్యతలు, మరో వైపు వ్యాపారం, మరో వైపు భర్తకు సంబంధించిన విషయాలు చూసుకోవడం అంటే మామూలు విషయం కాదు. వీరిద్దరి నుంచి చాలా విషయాలు నేర్చుకోవాలని, ఇద్దరూ ఎవరికి వారు గొప్ప అనడంలో కచ్చితంగా సందేహం లేదంటూ మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియా ద్వారా చర్చించుకుంటున్నారు. ఉపాసన సుదీర్ఘ కాలంగా వ్యాపారంలో కొనసాగుతున్న విషయం తెల్సిందే. స్నేహా రెడ్డి సైతం సొంతంగా వ్యాపారం ప్రారంభించిందనే విషయం తెలిసిందే.
రామ్ చరణ్, అల్లు అర్జున్‌ల సినిమాలు...
ఇక రామ్ చరణ్ సినిమా విషయానికి వస్తే ఇటీవలే సుకుమార్ దర్శకత్వంలో ప్రారంభం అయిన విషయం తెల్సిందే. రంగస్థలం సినిమా తర్వాత వీరి కాంబో మూవీ అనగానే అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుందని ఇటీవలే సుకుమార్ తన సన్నిహితుల వద్ద అన్నాడని సమాచారం. ఇక అల్లు అర్జున్ ఫ్యాన్స్ గత ఏడాది కాలంగా రాకా సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న రాకా సినిమా పాన్ ఇండియాను మించి ఉంటుందని, పాన్ వరల్డ్ అన్నట్లుగా సినిమా ఉంటుంది అంటూ యూనిట్ సభ్యులు చెబుతున్నారు. వీరిద్దరి కాంబో మూవీ కోసం మెగా ఫ్యాన్స్ దశాబ్ద కాలంగా ఎదురు చూస్తున్నారు. గతంలో వీరిద్దరూ కలిసి ఒక సినిమాలో నటించినా, అది పూర్తి స్థాయి మెగా మల్టీస్టారర్ మూవీ అనిపించుకోలేదు. కనుక వీరిద్దరి కాంబో ఒక పక్కా కమర్షియల్ మల్టీస్టారర్ మూవీ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.