• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  21 ఏళ్ల‌కే వంద సినిమాల‌తో...

21 ఏళ్ల‌కే వంద సినిమాల‌తో సంచ‌ల‌నం!

| బాలీవుడ్ నటి నీతూ కపూర్ తన చిన్ననాటి కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 15 ఏళ్ల వయసులోనే సొంతంగా మెర్సిడెస్ కారు కొనడంతో పాటు నాలుగైదు ఆస్తులు సంపాదించానని తెలిపారు. 21 ఏళ్లకే 100 సినిమాల్లో నటించిన ఆమె, వివాహం తర్వాత కొంతకాలం సినిమాలకు దూరమై సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ప్రస్తుతం లెటర్స్ టు మిస్టర్ కన్నా చిత్రంలో నటిస్తున్నారు.

By - Srikanth Kontham
Update: 2026-11-09 12:30 GMT

బాలీవుడ్ సీనియర్ నటి నీతూ కపూర్ కెరీర్ జ‌ర్నీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండ‌స్ట్రీలో ఎదిగిన న‌టి. బాల్యం లో ప‌డిన క‌ష్టాలే నీతూని అగ్ర స్థాయికి తీసుకెళ్లాయన్న‌ది కాద‌న లేని నిజం ఒక్కో అవ‌కాశాన్ని అందుకుని త‌న‌ని తానే స్టార్ గా తీర్చి దిద్దుకున్నారు. ప్ర‌యాణంలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదురైనా? ధైర్యంగా వాటిని ఎదుర్కుని ప్ర‌యాణాన్ని ముందుకు సాగించారు. అదే స్పూర్తితో ఆరు ప‌దుల వ‌య‌సులోనూ అంతే శ్ర‌మిస్తున్నారు. వ‌చ్చిన అవ‌కాశాల‌ను స‌ద్వినియోగం చేసుకుంటూ కెరీర్ ను ముందుకు తీసుకెళ్తున్నారు.

ఈ నేప‌థ్యంలో తాజాగా నీతూకపూర్ ఒక్క‌సారిగా పాత జ్ఞాపకాల్లోకి వెళ్లారు. ఆవేంటో ఆమె మాట‌ల్లోనే.. చిన్న వ‌య‌సులోనే కెరీర్ ప్రారంభించా. ఆ వయసులోనే ఊహించని విధంగా ఆర్థికంగా ఎదిగాను. 15 ఏళ్ల వయసులోనే సొంతంగా మెర్సిడెస్ కారు కొన్నాను. నాలుగు నుంచి ఐదు ఆస్తులను కూడా సమకూ ర్చుకున్నానని` వెల్లడించారు. నీతూ క‌పూర్ బాలనటిగా ఎన్నో చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. ఎనిమిదో తరగతి చదువుతున్న సమయంలోనే సినిమా అవకాశాలు రావడంతో చదువును మధ్యలోనే ఆపేసారు.

ఎలాంటి యాక్టింగ్ స్కూల్‌కు వెళ్లకుండానే కెమెరా ముందుకొచ్చారు. భ‌యం లేకుండా న‌టించారు. డాన్సు నేర్చుకోవడంలోనూ ఎక్కువ స‌మ‌యం తీసుకోలేదు. 21 ఏళ్లు నిండేసరికి 100 సినిమాల్లో నటించారు. ఇన్ని సిని మాలతో అప్ప‌ట్లో ఓ సంచ‌ల‌నంగా నిలిచారు. 14 ఏళ్ల‌కే బాల న‌టిగా బిజీ అయ్యారు. ఏడేళ్ల వ‌య‌సులోనేడెబ్బైకి పైగా చిత్రాల్లో నటించారు. అటుపై నీతూకపూర్ కెరీర్ లో వెన‌క్కి తిరిగి చూడ‌లేదు. కొంత కాలానికిరిషి కపూర్‌ను వివాహం చేసుకున్నారు. అనంతరం కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరమయ్యారు.

కుటుంబ బాధ్యతలతో పాటు పిల్లల పెంపకంపై పూర్తి సమయం కేటాయించారు. అటుపై మ‌ళ్లీ కొంత కాలానికి సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. చిన్న‌ప్పుడే క‌ష్ట‌ప‌డే త‌త్వం అల‌వ‌ర్చుకున్న నీతూక‌పూర్ సెకెండ్ ఇన్నింగ్స్ లోనూ ఛాన్సులు అందుకుంటున్నారు. ఇటీవ‌లే నీతూ క‌పూర్ న‌టించిన `డాడీకి షాద్` అనే చిత్రంలో న‌టించారు. భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయిన సినిమా వాటిని అందుకోవ‌డంలో విఫ‌ల‌మైంది. ప్ర‌స్తుతం `లెట‌ర్స్ టూ మిస్ట‌ర్ క‌న్నా` అనే చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ సీనియ‌ర్ న‌టి టాలీవుడ్ లో కూడా న‌టించాల‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఆ దిశ‌గా తెలుగు మేక‌ర్స్ నీతూ క‌పూర్కి అవ‌కాశాలు క‌ల్పించాల‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా కోరుతున్నారు.

Tags:    
  • neetukapoor 
  • bollywood 
  • childartist 
  • bollywoodactress 
  • filmcareer 

Similar News

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

Copyright @2026

Powered by Blink CMS