• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  Box Office >  రామాయణంపై ఈ తరం వింత...

రామాయణంపై ఈ తరం వింత ప్రశ్న..!

| రణబీర్ కపూర్ నటిస్తున్న ‘రామాయణ పార్ట్ 1’లో రాముడి పాత్రపై ఓ యువతి అడిగిన ప్రశ్న సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 14 ఏళ్ల వనవాసంలో రాముడు గడ్డంతో కనిపించకపోవడాన్ని ప్రస్తావిస్తూ, అప్పట్లో ప్రజలు గడ్డం ఎలా గీసుకునేవారని గ్రోక్‌ను ప్రశ్నించింది. ఈ పోస్టుపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

By - Priya Chowdhary Nuthalapti
Update: 2026-11-09 04:58 GMT

ప్రస్తుత తరం ఆలోచనలు చాలా భిన్నంగా ఉంటున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో కొందరు అడిగే ప్రశ్నలు ఒక్కోసారి అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. తాజాగా రణబీర్ కపూర్ హీరోగా నటించిన రామాయణ పార్ట్ 1 సినిమాకు సంబంధించి ఒక అమ్మాయి అడిగిన ప్రశ్న ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతూ అందరిని ఆశ్చర్యపరుస్తుంది.

రామాయణం కథ గురించి, సినిమాలోని పాత్రల గురించి ఇప్పటికే సోషల్ మీడియాలో ఎన్నో రకాలుగా చర్చలు జరుగుతున్నా. కొందరు సినిమా విజువల్స్‌పై ప్రశంసలు కురిపిస్తుంటే, మరికొందరు కొన్ని సన్నివేశాలు, పాత్రల రూపకల్పనపై విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో రాముడి పాత్రలో కనిపిస్తున్న రణబీర్ కపూర్ ఫొటోలను షేర్ చేసిన ఒక అమ్మాయి మాత్రం ఊహించని ప్రశ్న వేసింది.

ఆమె తన పోస్టులో, "త్రేతాయుగంలో రాముడు 14 ఏళ్ల వనవాసం చేసినప్పటికీ ఆయన ఎప్పుడూ గడ్డంతో కనిపించలేదు. మరి అప్పట్లో ప్రజలు గడ్డం ఎలా గీసుకునేవారు? ఇది ఎలా సాధ్యమైంది?" అంటూ గ్రోక్‌ను ప్రశ్నించింది.

ఈ ప్రశ్న చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. కొందరు ఆమె ప్రశ్నను చూసి నవ్వుకుంటుంటే, మరికొందరు రామాయణం వంటి ఇతిహాసాన్ని అర్థం చేసుకునే విషయంలో ఇలాంటి సందేహాలు ఎందుకంటూ విమర్శిస్తున్నారు. ఇంకొందరు మాత్రం అప్పటి కాలంలో గడ్డం తీసుకోవడానికి ఎలాంటి పద్ధతులు.. ఉండేవో తెలుసుకోవాలనే ఆసక్తితో కామెంట్ చేస్తున్నారు.

నిజానికి రామాయణం అనేది కేవలం ఒక సినిమా కథ మాత్రమే కాదు. కోట్లాది మంది నమ్మకాలు, భావోద్వేగాలతో ముడిపడిన ఇతిహాసం. అందుకే ఈ కథ ఆధారంగా సినిమా వచ్చినప్పుడు ప్రతి చిన్న విషయం కూడా వైరల్ అవుతూ ఉంటుంది.

మరోవైపు రామాయణ పార్ట్ 1 సినిమా కలెక్షన్ల పరంగా మంచి వసూళ్లు సాధిస్తూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఒకవైపు సినిమా గురించి ప్రశంసలు, విమర్శలు వస్తుంటే.. మరోవైపు ఇలాంటి విచిత్రమైన ప్రశ్నలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Tags:    
  • ramayana 
  • ranbirkapoor 
  • ramayanapart1 
  • grok 
  • socialmedia 

Similar News

'ధురంధర్ 2' డే 14 కలెక్షన్లను దాటేసిన రామాయణం!

2026-11-19 05:08 GMT

సంక్రాంతి 'కాకా' పై రూ.150 కోట్ల పందెం..!

2026-11-18 22:30 GMT

'అవెంజర్స్' బుకింగ్స్ చూస్తే మన నిర్మాతలకు ఓ ప్రశ్న!

2026-11-17 10:02 GMT

డిసెంబర్ బరి నుంచి తప్పుకున్న సింహం!

2026-11-17 05:39 GMT

డబ్బింగ్ సినిమాల జోరు.. తెలుగు చిన్న సినిమాలకు థియేటర్లలో కష్టాలు!

2026-11-17 04:00 GMT

తండ్రీకొడుకుల బాక్స్ ఆఫీస్ క్లాష్!

2026-11-16 22:30 GMT

రామాయణ చైనీస్ వర్షన్ రెడీ అవుతుందట!

2026-11-16 19:05 GMT

ఈ వారం బాక్సాఫీస్ క్లాష్.. పరిస్థితి ఎలా ఉంది?

2026-11-16 10:25 GMT

నైజాం.. జాగ్రత్త పడకపోతే అంతే!

2026-11-16 04:30 GMT

రామాయ‌ణ‌: 10రోజుల్లో 1200 కోట్లు.. 2000 కోట్ల క్ల‌బ్ ఇంకెంత దూరం?

2026-11-15 09:42 GMT

కంటెంట్ యుద్ధం.. ఎవరిదో విజయం?

2026-11-15 00:30 GMT

తెలుగు రైట్స్‌లో టాప్ సినిమాలు.. 'వారణాసి' ఎంత తేవాలి?

2026-11-14 04:20 GMT

Copyright @2026

Powered by Blink CMS