• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సపోర్ట్ ఓకే.. కానీ ఆ ఒక్క...

సపోర్ట్ ఓకే.. కానీ ఆ ఒక్క విషయంలో జాగ్రత్త తీసుకుంటేనే..

| కొత్త హీరో అనీష్ రెడ్డి ‘ఇట్లు అర్జున’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. నాగార్జున సమర్పణలో, వెంకీ కుడుముల నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్ర ట్రైలర్‌ను ఎన్టీఆర్ విడుదల చేశారు. ఇందులో అనీష్ మూగ యువకుడిగా నటిస్తున్నారు. ప్రముఖుల మద్దతు, భారీ ప్రమోషన్లు ఉన్నప్పటికీ తొలి సినిమాతో ప్రేక్షకులను మెప్పించాలంటే కథ ఎంపిక, నటన కీలకమని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

By - M Prashanth
Update: 2026-11-07 05:52 GMT

ఇండస్ట్రీలోకి వచ్చే కొత్త హీరో.. తన మొదటి సినిమా విషయంలో తీసుకునే నిర్ణయాలే ఫ్యూచర్ ను డిసైడ్ చేయడంలో మెయిన్ రోల్ పోషిస్తాయనే చెప్పాలి. ఎంతమంది సెలబ్రిటీలు సపోర్ట్ గా నిలిచినా, ఎంత భారీగా ప్రమోట్ చేసినా.. చివరకు ప్రేక్షకులను మెప్పించేది కంటెంట్ మాత్రమే. అందుకే కొత్త హీరోలు డెబ్యూ విషయంలో అన్నింటికంటే ముఖ్యంగా ఒక విషయంలో జాగ్రత్త పడాలని ఇప్పుడు నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.

అదే స్క్రిప్ట్స్ సెలెక్షన్. సరైన స్టోరీని ఎంచుకుంటే మిగతా ఎలిమెంట్స్ కూడా కలిసొస్తాయి. ఇప్పుడు టాలీవుడ్‌ లో హాట్ టాపిక్ గా మారిన అనీష్ రెడ్డి తొలి సినిమా ఇట్లు అర్జున మూవీ విషయంలో కూడా ఇదే డిబేట్ కనిపిస్తోంది. ప్రముఖ వ్యాపారవేత్త, AMR గ్రూప్ అధినేత మహేష్ రెడ్డి చిన్న కుమారుడైన అనీష్ రెడ్డి.. ఇట్లు అర్జునతో హీరోగా పరిచయమవుతున్నారు. ఆ సినిమాకు నాగార్జున సమర్పకుడిగా వ్యవహరిస్తుండగా, దర్శకుడు వెంకీ కుడుముల నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్రైలర్ రిలీజ్ చేయడంతో సినిమాపై మరింత హైప్ పెరిగింది. ఇంతమంది సెలబ్రిటీలు ఒక కొత్త హీరో తొలి సినిమాకు సపోర్ట్ చేయడం స్పెషలే. కానీ ఆ సపోర్ట్ ఓకే అయినా.. అనీష్ జర్నీ ఈజీ అని అనుకోలేం. ఎందుకంటే ఇండస్ట్రీలో పరిచయాలు తొలి అవకాశాన్ని తీసుకురావచ్చు. కానీ తర్వాతి ఛాన్సులు రావాలంటే మాత్రం మొదటి సినిమాతోనే తన స్టామినా నిరూపించుకోవాలి. అందుకు కథ ఎంపికలోనే అత్యంత జాగ్రత్త అవసరం. కొత్త హీరోగా ప్రేక్షకులకు పరిచయమయ్యే సమయంలో తనకు సరిపోయే రోల్ ఎంచుకోవాలి.

మరీ ప్రయోగం చేసినా, ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అంశాలు లేకపోయినా ఇబ్బందే. అదే సమయంలో అందరూ చేసే మూస కథలతో వస్తే గుర్తింపు రావడం కూడా కష్టమే. ఇట్లు అర్జునలో అనీష్ మూగ యువకుడిగా నటిస్తున్నారు. మాటలు రాని యువకుడి పాత్రను తొలి సినిమాకే ఎంచుకోవడం ఒక సాహసమే. ఇలాంటి రోల్ లో ఎక్స్ప్రెషన్స్, ఎమోషన్స్, యాక్టింగ్ ఎక్కువగా మాట్లాడాలి. ఆ విషయంలో అనీష్ ఎంతవరకు మెప్పిస్తారన్నది చూడాలి.

ట్రైలర్‌ లో లవ్, కామెడీ, యాక్షన్, సస్పెన్స్ ఎలిమెంట్స్ చూపించారు. ఓ మిస్టరీ పెన్డ్రైవ్, వెయ్యి కోట్ల డీల్ చుట్టూ స్టోరీ నడుస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడ మరో జాగ్రత్త కూడా అవసరం. తొలి సినిమా కాబట్టి హీరోను ఎలివేట్ చేయాలనే ఉద్దేశంతో కథలో అనవసరమైన హంగులు పెంచకూడదు. భారీ బడ్జెట్, సపోర్ట్, ప్రమోషన్స్.. ఇవన్నీ అంచనాలను పెంచుతాయి. కానీ ఆ అంచనాలకు తగ్గట్టుగా కంటెంట్ లేకపోతే మొదటికే మోసం వస్తుంది.

ముఖ్యంగా కొత్త హీరో విషయంలో ప్రేక్షకులు పెట్టుకునే ఫస్ట్ ఇంప్రెషన్ చాలా ముఖ్యం. అందుకే అనీష్‌ కు ఇప్పుడు మంచి ఛాన్స్ అని చెప్పాలి. ఇండస్ట్రీలో పెద్దల సపోర్ట్ ఉంది. మంచి టీమ్ తోడుగా ఉంది. ఇవన్నీ ఆయనకు కలిసొచ్చే అంశాలే. కానీ వాటిని మించి స్క్రిప్ట్ సెలెక్షన్ లో తీసుకున్న జాగ్రత్తే మెయిన్. తొలి సినిమాతో ప్రేక్షకులకు దగ్గరైతే తర్వాత మంచి స్టోరీలు, మరిన్ని ఛాన్సులు వెతుక్కుంటూ వస్తాయి. మరేం జరుగుతుందో వేచి చూడాలి.

Tags:    
  • anishreddy 
  • ittuarjun 
  • jrntr 
  • nagarjuna 
  • tollywood 

Similar News

నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!

2026-11-11 09:38 GMT

బాలయ్యా మజాకా.. తమన్ సంగీతానికి బాలయ్య గాత్రం!

2026-11-11 09:34 GMT

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

ఆ పని చేయకపోతే నానమ్మ పెళ్లికి ఒప్పుకునేది కాదు!

2026-11-11 06:43 GMT

మాతృభూమి ట్రైల‌ర్: గాల్వాన్ లోయ‌లో భాయ్ ఎమోష‌న‌ల్ ఘ‌ట్టాలు!

2026-11-11 06:42 GMT

మన దర్శకులు అక్కడే తప్పు చేస్తున్నారా?

2026-11-11 06:42 GMT

టైగ‌ర్ పై ఎటాక్..కొత్త ప‌ల్ల‌వి తెర‌పైకి తెచ్చిన ఫ్యామిలీ స్టార్!

2026-11-11 06:23 GMT

టాలీవుడ్ లో అవ‌కాశాలకు స‌క్సెస్ ఒక్క‌టే ప్రామాణికం కాదు!

2026-11-11 05:59 GMT

500 కోట్ల క్లబ్.. సౌత్ హీరోల్లో టాప్ ఎవరంటే!

2026-11-11 05:58 GMT

Copyright @2026

Powered by Blink CMS