బాలయ్యా మజాకా.. తమన్ సంగీతానికి బాలయ్య గాత్రం!
| గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న ‘దాదా’ సినిమాలో ఓ స్పెషల్ మాస్ సాంగ్ కోసం ఆయనే స్వయంగా కొన్ని పంక్తులు పాడారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ పాట నవంబర్ 13న విడుదల కానుంది. గతంలో ‘పైసా వసూల్’లో ‘మామా ఏక్ పెగ్ లా’ పాటతో అలరించిన బాలయ్య, మరోసారి తన గాత్రంతో అభిమానులను సర్‌ప్రైజ్ చేయనున్నారు.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ ఇలాంటి దిగ్గజ నటీనటుల తరం తర్వాత అంతటి గుర్తింపు తెచ్చుకొని.. ఇండస్ట్రీకి నాలుగు దిగ్గజాలుగా నిలిచిన మరో తరం హీరోలలో బాలకృష్ణ కూడా ఒకరిగా పేరు సొంతం చేసుకున్నారు. 66 సంవత్సరాల వయసులో కూడా ఎలాంటి డూపు ఉపయోగించకుండా తనదైన యాక్షన్ పర్ఫామెన్స్ తో అదరగొట్టేస్తూ అందరిని అబ్బురపరుస్తున్నారు. అలాంటి బాలయ్య ఒకవైపు హీరోగా మరొకవైపు రాజకీయ నాయకులుగా కొనసాగడమే కాకుండా టాక్ షోలకు హోస్ట్ గా వ్యవహరించి.. తనదైన టాలెంట్ తో అందరినీ ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే.
ఇకపోతే బాలయ్యలో సింగర్ కూడా దాగి ఉన్నారనే విషయం గతంలోనే బయటపడింది. అయితే ఇప్పుడు మరోసారి పాట పాడి థియేటర్లలో అభిమానులకు మరో సర్ప్రైజ్ ఇవ్వనున్నారు బాలకృష్ణ. అసలు విషయంలోకి వెళ్తే ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న చిత్రం దాదా. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో బాలకృష్ణ స్పెషల్ సాంగ్ కి పాట పాడారు. తమన్ సంగీత దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ స్పెషల్ మాస్ సాంగులో బాలయ్య కొన్ని పంక్తులను స్వయంగా ఆలపించారు. ఈ పాట నవంబర్ 13 2026న విడుదల కాబోతోంది. ఏదేమైనా తమన్ మ్యూజిక్ కి, బాలయ్య గాత్రం వెండితెరపై మరో అద్భుతాన్ని సృష్టించబోతుందని ఆడియన్స్ కామెంట్లు చేస్తున్నారు.
ఇకపోతే బాలకృష్ణ 2017లో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన పైసా వసూల్ సినిమాలో మొదటిసారిగా పూర్తిస్థాయిలో "మామా ఏక్ పెగ్ లా" అనే పాట పాడారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ పాట పార్టీ సాంగ్ గా భారీ విజయం సంపాదించుకుంది. మొత్తానికైతే అప్పుడలా ఇప్పుడలా బాలయ్య తన గాత్రంతో ప్రేక్షకులకు అసలైన వినోదాన్ని పంచుతున్నారు అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి.
ఇకపోతే బాలకృష్ణ సినిమా పాటలే కాకుండా తాను హోస్ట్గా వ్యవహరించిన అన్ స్టాపబుల్ షోలో అలాగే ఇతర సినిమా వేడుకల వేదికలపై కూడా తన తండ్రి ఎన్టీఆర్ పాడిన పాత క్లాసిక్ గీతాలను, పద్యాలను కూడా ఎంతో ఉత్సాహంగా ఆలపిస్తున్న విషయం తెలిసిందే.
బాలకృష్ణ సినిమాల విషయానికొస్తే.. వీర సింహారెడ్డి సినిమాతో బ్లాక్ బాస్టర్ విజయం అందుకోవడంతో మరోసారి గోపీచంద్ మలినేనికి అవకాశం కల్పించారు బాలయ్య. అలా రెట్రో ముంబై నేపథ్యంలో సాగే ఈ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా ఈ ఏడాది డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. మంచు మనోజ్, సముద్రఖని, ఉపేంద్ర లిమాయే, అభిమన్యు సింగ్, మనీష్ వాద్వా, ఆర్. శరత్ కుమార్ లాంటి వాళ్ళు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు.