• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  Box Office >  రామాయణం బడ్జెట్‌లో 9...

రామాయణం బడ్జెట్‌లో 9 శాతంతో తెరకెక్కిన గాడ్జిల్లా మైనస్ జీరో దూకుడు!

| భారీ బడ్జెట్ కంటే కంటెంట్‌నే ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తుందని ‘రామాయణం’, ‘గాడ్జిల్లా మైనస్ జీరో’ వసూళ్లు నిరూపిస్తున్నాయి. రూ.1600 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ‘రామాయణం’ ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లు వసూలు చేయగా, కేవలం రూ.155 కోట్లతో రూపొందిన ‘గాడ్జిల్లా మైనస్ జీరో’ రూ.520 కోట్లు రాబట్టింది.

By - Srikanth Kontham
Update: 2026-11-09 06:05 GMT

క‌టౌట్ కాదు కంటెంట్ ఎంత బ‌లంగా ఉంద‌న్న‌దే ఏ సినిమాకైనా కీల‌కం. వంద‌ల కోట్ల బ‌డ్జెట్ పెట్టామ‌న్న‌ది మ్యాట‌ర్ కాదు. క‌థ‌లో ద‌మ్ము ఎంత ఉంద‌న్న‌కే కీల‌కం. థియేట‌ర్ల‌కు ఆడియ‌న్స్ ను ర‌ప్పించేది ఈ అంశాలే. బాక్సాఫీస్ వద్ద‌ క‌న‌క వ‌ర్షం కురిపించేది ఈ పాయింట్ మాత్ర‌మే. ఎన్ని థియేట‌ర్ల‌లో విడుద‌ల చేసామ‌న్న‌ది కీల‌క‌మే? కానీ అదే ప్రామాణికం అన్న‌ది అన్ని సంద‌ర్భాల్లో రుజువు అవ్వ‌దు. త‌క్కువ థియేట‌ర్ల‌లో రిలీజ్ అయినా? ప్రేక్ష‌కులు ఏ సినిమాకు క్యూ క‌డుతున్నారు? అన్న‌దే వ‌సూళ్ల‌కు కీల‌క‌మైన అంశం.

తాజాగా ఓ భార‌తీయ చిత్రం..మ‌రో విదేశీ చిత్రం మ‌ధ్య వ్య‌త్యాసం చూస్తే? ఈ విష‌యం క్లియ‌ర్ గా అర్ద‌మ‌వుతుంది. ర‌ణ‌బీర్ క‌పూర్, సాయ ఇప‌ల్ల‌వి జంట‌గా నితీశ్ తివారీ తెర‌కెక్కించిన రామాయణం మొద‌టి భాగం వ‌ర‌ల్డ్ వైడ్ గా ఎంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రిలీజ్ అయిందో తెలిసిందే. దాదాపు 1600 కోట్ల బ‌డ్జెట్ మొద‌టి భాగానికి కేటాయించారు. ఇంత బ‌డ్జెట్ పెట్టిన చిత్రం ఇండియాన్ బాక్సాఫీస్ వ‌ద్ద ఢోకా లేకుండా రాణిస్తుంది. కానీ విదేశీ మార్కెట్ వ‌ద్ద మాత్రం స్లోగానే క‌నిపిస్తోంది.

ఇప్ప‌టి వ‌ర‌కూ ఈ సినిమా వ‌రల్డ్ వైడ్ గా 500 కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. అత్య‌ధికంగా అమెరికాలో ఎక్కువ స్క్రీన్ల‌ను

ద‌క్కించుకుంది ఈ సినిమానే. అయినా? ఈ చిత్రం `గాడ్జిల్లా మైన‌స్ జీరో` త‌ర్వాత రెండ‌వ స్థానంలో క‌నిపిస్తుంది. `రామాయ‌ణం`తో పాటు ఈ జ‌పాన్ చిత్రం కూడా రిలీజ్ అయింది. ఈ సినిమా బ‌డ్జెట్ కేవ‌లం 155 కోట్లు . కానీ వ‌సూళ్లు చూస్తే? దిమ్మ‌తిరిగిపోతుంది. సైన్స్ ఫిక్ష‌న్ హార‌ర్ చిత్రంగా ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన గాడ్జిల్లా బాక్సాఫీస్ వ‌ద్ద ఇప్ప‌టి వ‌ర‌కూ ప్ర‌పంచ వ్యాప్తంగా 520 కోట్ల వ‌సూళ్ల‌ను సాధించింది.

వారాంతంలో ఉత్తర అమెరికాలో ఏకంగా 31.6 మిలియన్ డాలర్లు రాబట్టింది. దీంతో విశ్లేష‌కులు ఈ రెండు సినిమాల మ‌ధ్య బ‌డ్జెట్ పోలిక‌ల‌కు తెర‌పైకి తెస్తున్నారు. `రామాయ‌ణం` మొద‌టి భాగం బ‌డ్జెట్ లో కేవ‌లం 9 శాతం బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన `గాడ్జిల్లామైన‌స్ జీరో` వర‌ల్డ్ వైడ్ గా రామాయ‌ణానికి స‌మాన‌మైన వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. అయితే ఇంగ్లీష్ చిత్రాల‌కు విదేశాల్లో ఉండే క్రేజ్ వేరు. ఆ రకంగా చూస్తే? రామాయ‌ణం మొద‌టి భాగం ఒక్క భార‌త్ లోనే 300 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సాధించింది.

Tags:    
  • ramayana 
  • godzillaminuszero 
  • ranbirkapoor 
  • boxofficecollection 
  • filmbudget 

Similar News

'రామాయణం' బుకింగ్స్.. ఒక్క రోజులో 16 లక్షల టికెట్లు!

2026-11-10 06:39 GMT

దర్శకుడి నుంచి నిర్మాతగా.. వెంకీ కుడుముల సినీ ప్రయాణంలో ఆసక్తికర విషయాలు!

2026-11-10 06:13 GMT

సూర్య@650+కోట్లు... అరుదైన రికార్డ్

2026-11-10 04:36 GMT

పదేళ్ల రికార్డ్ బ్రేక్ అయ్యే టైం వచ్చిందా?

2026-11-10 04:35 GMT

డమ్మీ థియేటర్లు.. బల్క్ బుకింగ్స్

2026-11-09 12:56 GMT

రామాయణంపై ఈ తరం వింత ప్రశ్న..!

2026-11-09 04:58 GMT

సపోర్ట్ ఓకే.. కానీ ఆ ఒక్క విషయంలో జాగ్రత్త తీసుకుంటేనే..

2026-11-07 05:52 GMT

నాగ‌చైత‌న్య `వృషకర్మ`కు ఆ ఇద్ద‌రూ పోటీనా?

2026-11-07 04:06 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

సంక్రాంతి బాక్సాఫీస్ రేసు - 1000 కోట్ల బిజినెస్ అంచనా!

2026-11-05 07:21 GMT

Copyright @2026

Powered by Blink CMS