• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  హైందవ 'ఎవరైనా' సాంగ్.....

హైందవ 'ఎవరైనా' సాంగ్.. బీచ్ లొకేషన్లో కూల్ కెమిస్ట్రీ

| బెల్లంకొండ సాయి శ్రీనివాస్, సంయుక్త జంటగా నటిస్తున్న ‘హైందవ’ నుంచి ‘ఎవరైనా’ ఫస్ట్ సింగిల్ విడుదలైంది. సామ్ సీఎస్ స్వరపరిచిన ఈ మెలోడీకి కపిల్ కపిలన్, శ్వేతా మోహన్ ఆలపించగా, కిట్టు విస్సాప్రగడ సాహిత్యం అందించారు. లుధీర్ బైరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మిస్టరీ థ్రిల్లర్ నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.

By - M Prashanth
Update: 2026-11-12 13:45 GMT

నార్మల్ గా మాస్, యాక్షన్ సినిమాలతో కనిపించే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈసారి విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. లుధీర్ బైరెడ్డి దర్శకత్వంలో ఆయన హీరోగా, సంయుక్త హీరోయిన్ గా తెరకెక్కుతున్న చిత్రం హైందవ. ఇప్పటికే విడుదలైన పోస్టర్లకు మంచి రెస్పాన్స్ రాగా, మిస్టరీ, డివోషనల్ అంశాలతో రూపొందుతున్న ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఎవరైనా అంటూ సాగే ఫస్ట్ సింగిల్ ను మేకర్స్ లేటెస్ట్ గా విడుదల చేశారు.

ప్రేమలో పడిన తర్వాత కలిగే మధురమైన భావాలను, ప్రియురాలి సాన్నిహిత్యాన్ని కోరుకునే తీరును ఈ పాటలో చక్కగా చూపించారు. ఎవరైనా నాలాగా నిన్ను చూశారా, ఎదలోన దాచారా అంటూ సాగే పల్లవి వినగానే హాయిగా అనిపిస్తోంది. దూరంగా ఉంటే మనసు కుదురుగా ఉండదని, ఒక్కటవుదాం మనమింకా అంటూ లిరిసిస్ట్ కిట్టు విస్సాప్రగడ రాసిన సాహిత్యం నేటి యువతకు త్వరగా కనెక్ట్ అయ్యేలా కుదిరింది.

సంగీత దర్శకుడు సామ్ సీఎస్ ఈ పాటకు చాలా ప్లెజెంట్ ట్యూన్ అందించారు. ఎక్కడా లౌడ్ బీట్స్ లేకుండా, వినసొంపైన మెలోడీతో పాట ఆద్యంతం సాఫీగా సాగిపోతుంది. సింగర్స్ కపిల్ కపిలన్, శ్వేత మోహన్ తమ గాత్రంతో పాటకు మంచి ఫీల్ తీసుకొచ్చారు. ఇద్దరి వాయిస్ లు ఒకదానికొకటి చక్కగా సింక్ అవ్వడంతో పాటు పాటలోని ఎమోషన్ ను బాగా ఎలివేట్ చేశాయి.

లిరికల్ వీడియోను తీర్చిదిద్దిన విధానం కూడా ఆకట్టుకునేలా ఉంది. సముద్ర తీరంలో పడవపై సాయి శ్రీనివాస్ లుక్, గ్లాస్ బ్రిడ్జ్ పై పసుపు రంగు డ్రెస్సులో సంయుక్త వేసిన స్టెప్పులు బాగున్నాయి. ముఖ్యంగా ఇద్దరూ కలిసి కాఫీ తాగుతూ కనిపించే సన్నివేశాల్లో వీరి కెమిస్ట్రీ చాలా నేచురల్ గా కుదిరింది. విజయ్ బిన్ని కొరియోగ్రఫీ, యానిమేషన్ విజువల్స్ తో మేకింగ్ షాట్స్ ను కలిపి చూపించిన తీరు ఫ్రెష్ గా ఉంది.

సినిమా కథ విషయానికి వస్తే, ఇందులో సాయి శ్రీనివాస్ దేవుడిని నమ్మని పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఒక పురాతన ఆలయంలో దేవతా విగ్రహాలు మాయమవడం, ఆ క్రమంలో జరిగే హత్య చుట్టూ కథ నడుస్తుంది. జేడీ చక్రవర్తి, మహేష్ మంజ్రేకర్, సౌరభ్ సచ్‌దేవా, శివాజీ రాజా, గెటప్ శ్రీను కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మూన్‌షైన్ పిక్చర్స్ బ్యానర్ పై మహేష్ చందు నిర్మిస్తున్న ఈ చిత్రానికి హరీష్ కన్నన్ సినిమాటోగ్రఫీ, కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ అందించారు. ఒక థ్రిల్లర్ కథలో ఇలాంటి కూల్ రొమాంటిక్ మెలోడీ ఉండటం సినిమాకు ప్లస్ అయ్యేలా కనిపిస్తోంది. విజువల్స్, సంగీతం రెండూ డీసెంట్ గా కుదరడంతో పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక ఈ సినిమా నవంబర్ 27న థియేటర్లలో విడుదల కానుంది. మరి ఈ ప్రయోగం బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

Full View
Tags:    
  • haindava 
  • bellamkondasaisreenivas 
  • samyuktha 
  • evarainasong 
  • samcs 

Similar News

ఐకాన్ స్టార్ కోసం గ్యాంగ్ స్ట‌ర్ టైటిల్!

2026-11-12 13:53 GMT

చిన్నతనంలోనే అమ్మానాన్న దూరమై ఇల్లు లేక బాధపడ్డాను!

2026-11-12 13:30 GMT

షారుక్ ఖాన్‌ ఒక్కో ఇల్లు రూ.50 కోట్లు.. అయినా కొనడానికి పోటీపడ్డ కుబేరులు!

2026-11-12 12:30 GMT

బయట 100 కెమెరాలు..లోపల వైట్ సోఫా రూల్!

2026-11-12 11:30 GMT

ఘనంగా మహేష్ బాబు మేనల్లుడి ప్రీ వెడ్డింగ్.. స్పెషల్ పోస్ట్ పంచుకున్న నమృత!

2026-11-12 11:00 GMT

‘వారణాసి’కి రామాయణం చేస్తున్న సాయం

2026-11-12 10:38 GMT

మామ్ గిల్ట్ అంటే ఏంటో అప్పుడే తెలిసింది!

2026-11-12 10:30 GMT

200 ఏళ్ల చరిత్ర కలిగిన ఆభరణాలు.. కరీనాకపూర్ కు వారసత్వంగా ఇంకేం లభించాయంటే?

2026-11-12 10:05 GMT

'వారణాసి'.. ఏడాదిగా ఒక్కటేనా..

2026-11-12 09:54 GMT

ఇన్‌ఫ్లుయెన్సర్స్ నిజంగా ఆ రేంజ్ లో సంపాదిస్తున్నారా?

2026-11-12 09:45 GMT

నువ్వే నువ్వే నుంచి ఆదర్శ కుటుంబం వరకు.. త్రివిక్రమ్‌లో ఈ మార్పేంటి?

2026-11-12 08:18 GMT

Copyright @2026

Powered by Blink CMS