• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఘనంగా మహేష్ బాబు...

ఘనంగా మహేష్ బాబు మేనల్లుడి ప్రీ వెడ్డింగ్.. స్పెషల్ పోస్ట్ పంచుకున్న నమృత!

| సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు సిద్ధార్థ్ గల్లా త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నారు. దక్షిణ కొరియాకు చెందిన హైయిన్ కిమ్‌ను ఇటలీలో వివాహం చేసుకోనున్నారు. ఈ ఏడాది జూలై 13న వీరి నిశ్చితార్థం జరగగా, తాజాగా నమ్రత శిరోద్కర్ ప్రీ వెడ్డింగ్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఘట్టమనేని కుటుంబ సభ్యులు వేడుకల్లో సందడి చేశారు.

By - Madhu Reddy
Update: 2026-11-12 11:00 GMT

సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు సిద్దార్థ్ గల్లా ఒక ఇంటి వారు కాబోతున్నారు. కొరియన్ అమ్మాయితో ఆయన ఏడడుగులు వేయనున్నారు. ఈ ఏడాది జూలై 13 వ తేదీన అంగరంగ వైభవంగా వీరి నిశ్చితార్థం జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను మహేష్ బాబు భార్య ప్రముఖ హీరోయిన్ నమ్రత శిరోద్కర్ షేర్ చేస్తూ స్పెషల్ పోస్ట్ పెట్టింది. కాబోయే నూతన వధూవరులకు శుభాకాంక్షలు కూడా తెలిపింది. అయితే ఇప్పుడు ఇటలీలో వీరి వివాహం ఘనంగా జరగనున్నట్లు నమ్రత మరో పోస్టును అభిమానులతో పంచుకుంది.

 

సిద్దార్థ్ గల్లా సౌత్ కొరియాకు చెందిన తన ప్రేయసి హైయిన్ కిమ్ ను వివాహం చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ జరపగా.. ఆ ఫోటోలను నమ్రత అభిమానులతో పంచుకున్నారు.. ఇకపోతే ఈ ప్రీ వెడ్డింగ్ కి సంబంధించిన ఫోటోలు.. సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఘట్టమనేని ఫ్యామిలీ సభ్యులు ఈ ప్రీ వేడుకల్లో సందడి చేశారు..




 


మహేష్ బాబు సోదరి పద్మావతి, బావ గల్లా జయదేవ్ కి ఇద్దరు కొడుకులు. వీరిలో పెద్దవాడు అశోక్ గల్లా కాగా ఇప్పటికే హీరోగా తెలుగులో సినిమాలు చేస్తున్నాడు. ఇక ప్రస్తుతం ఈయన నటించిన వీసా (వింటారా సరదాగా) అనే చిత్రంలో నటించారు. ఇక చిన్న కొడుకు సిద్ధార్థ్.. ప్రస్తుతం కుటుంబానికి సంబంధించిన బిజినెస్ వ్యాపారాలు చూసుకుంటున్నారు. అలాంటి ఈయన ఇప్పుడు కొరియన్ అమ్మాయిని వివాహం చేసుకోబోతున్నారు.. ఇకపోతే సిద్ధార్థ్ -హైయిన్ ఎప్పుడు ఎక్కడ ఎలా కలుసుకున్నారు? వీళ్ళ మధ్య ప్రేమ ఎలా మొదలైంది ? అనే విషయాలు మాత్రం ఇంకా గోప్యంగానే ఉన్నాయి. ఏది ఏమైనా మహేష్ బాబు మేనల్లుడు దేశాంతర వివాహం చేసుకోబోతుండడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.




 


మహేష్ బాబు విషయానికి వస్తే.. ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో వారణాసి సినిమా చేస్తున్నారు. గ్లోబల్ అడ్వెంచర్ మూవీ గా ప్రేక్షకుల ముందుకు వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుంది. ఏప్రిల్ ఏడవ తేదీన రిలీజ్ కాబోతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా నెలకొన్న విషయం తెలిసిందే . ఇందులో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తుండగా.. ప్రముఖ మలయాళ సినీ నటుడు పృథ్విరాజ్ సుకుమారన్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఇక ఈ నవంబర్లో ఈ సినిమా నుండి బిగ్ అప్ డేట్ ఇస్తామని ప్రకటించారు కానీ అది ఎప్పుడు అన్న విషయం ఇంకా స్పష్టత లేదు.




 


Tags:    
  • siddharthgalla 
  • maheshbabu 
  • namratashirodkar 
  • haeinkim 
  • ghattamanenifamily 

Similar News

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

శ్రీలీల ఈసారి తెలుగు సినిమాల‌కు ఒకే చెబుతుందా?

2026-11-19 08:07 GMT

నితిన్ వర్సెస్ చైతూ.. అసలు ఫైట్ దర్శకులదే!

2026-11-19 08:07 GMT

Copyright @2026

Powered by Blink CMS