• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నువ్వే నువ్వే నుంచి ఆదర్శ...

నువ్వే నువ్వే నుంచి ఆదర్శ కుటుంబం వరకు.. త్రివిక్రమ్‌లో ఈ మార్పేంటి?

| త్రివిక్రమ్ సినిమాల్లో సెకండ్ హీరోలు, హీరోయిన్ల పాత్రలకు తగిన ప్రాధాన్యం ఉండటం లేదనే చర్చ జరుగుతోంది. 'అల వైకుంఠపురములో'లో సుశాంత్, 'ఆదర్శ కుటుంబం'లో నారా రోహిత్ పాత్రలతో పాటు పార్వతి మెల్టన్ నుంచి నివేదా పేతురాజ్ వరకు రెండో హీరోయిన్ల పాత్రలపైనా ప్రశ్నలు వస్తున్నాయి. స్టార్ నటులను తీసుకున్నప్పుడు వారి పాత్రలకు కూడా బలమైన స్కోప్ ఇవ్వాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

By - Priya Chowdhary Nuthalapti
Update: 2026-11-12 08:18 GMT

త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలు అనగానే గుర్తొచ్చేది ఆయన రాసే మాటలు. ఒకప్పుడు ఆయన సినిమాల్లో హీరో పాత్రతో పాటు మిగతా క్యారెక్టర్లకు కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది. ముఖ్యంగా నువ్వే నువ్వే సినిమాలో సునీల్, ప్రకాష్ రాజ్ కార్యకర్తలు అప్పట్లో ఆయన ఎలా రాసుకున్నారో మన అందరికీ తెలిసిన విషయమే.

అప్పట్లో హీరో, హీరోయిన్స్ తో పాటు పక్కన క్యారెక్టర్ లను కూడా అంత పవర్ ఫుల్ గా రాసుకున్న ఈ దర్శకుడు…ఇప్పుడు మాత్రం పూర్తిగా విభిన్నంగా ప్రవర్తిస్తున్నారు. ఆయన ఇప్పుడు తీస్తున్న సినిమాలను.. గమనిస్తే ఒక విషయం మాత్రం పదేపదే కనిపిస్తుంది. కథలో సెకండ్ హీరోలు, సెకండ్ హీరోయిన్లను తీసుకుంటారు కానీ, సినిమా పూర్తయ్యేసరికి వారి పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం కనిపించడం లేదు. అసలు అలాంటి పాత్రలను ఎందుకు పెట్టారనే ప్రశ్న ప్రేక్షకుల్లోనే కాదు, సినిమా వర్గాల్లో కూడా వినిపిస్తున్నాయి.

అలా వైకుంఠపురములో.. సుశాంత్ పాత్ర కోసం అలాంటి హీరోని ఎందుకు తీసుకున్నారని అప్పట్లో చాలామందికి అనుమానం వచ్చింది. అదే పాత్రలో మరొక నటుడిని తీసుకున్నా కథలో పెద్దగా మార్పు ఉండేది కాదు.

ఇక ఇటీవల వచ్చిన ఆదర్శ కుటుంబంలో నారా రోహిత్ పాత్ర గురించి కూడా ఇలాంటి ప్రశ్నలే వచ్చాయి. నారా రోహిత్ లాంటి హీరోను తీసుకున్నప్పుడు ఆయన పాత్రకు తగిన ప్రాధాన్యం ఉంటుందని ప్రేక్షకులు ఆశిస్తారు. కానీ సినిమాలో మాత్రం ఆయన చాలా సాధారణమైన పాత్ర పోషించారు. పేరున్న హీరోలను తీసుకున్నప్పుడు అందుకు తగ్గ పాత్రలు కూడా త్రివిక్రమ్ రాసుకోవాలి. అలా కాకుండా కేవలం స్టార్స్ ఉండాలి అని.. చెప్పి చిన్న పాత్రలకు కూడా ఇలాంటి హీరోలను తీసుకుంటే బడ్జెట్ పెరగడం తప్ప ఇంకేమీ అవ్వదు.

సెకండ్ హీరోయిన్ల విషయంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అఆ సినిమాలో అనుపమ పరమేశ్వర్ పాత్ర మినహా మిగతా త్రివిక్రమ్ సినిమాల్లో రెండో హీరోయిన్లు అసలు ఈమధ్య ఎందుకు ఉంటున్నారో కూడా అర్థం కాని పరిస్థితి ఏర్పడుతోంది. జల్సాలో పార్వతి మెల్టన్ నుంచి ఆదర్శ కుటుంబంలో.. నివేదా పేతురాజ్ వరకు.. అసలు త్రివిక్రమ్ సెకండ్ హీరోయిన్స్ ని ఎందుకు పెట్టుకున్నారో కూడా అర్థం కాదు.

ఇదిలా ఉంటే..రెండో హీరోయిన్ పాత్రల విషయంలో త్రివిక్రమ్ చెప్పే మాటలకు, తెరపై కనిపించే పాత్రలకు మధ్య వ్యత్యాసం ఉంటుందనే మరో ప్రచారం కూడా ఇండస్ట్రీలో వినిపిస్తోంది. కథ చెప్పేటప్పుడు పాత్రకు ఎంతో ప్రాధాన్యం ఉందని, పురాణాల ఉదాహరణలతో కూడా వివరించి నమ్మిస్తారని, కానీ షూటింగ్ సమయంలో మాత్రం పరిమితమైన సన్నివేశాలకే అవకాశం ఇస్తారనే టాక్ ఉంది.

ఇవన్నీ నిజమో కాదో పక్కన పెడితే.. త్రివిక్రమ్ సెకండ్ హీరోయిన్స్, హీరోల విషయంలో శ్రద్ధ తీసుకోకపోతే.. ముందు చెప్పినట్టు సినిమా బడ్జెట్ పెంచడానికి తప్ప.. ఆ పాత్రలు ఇక దేనికి పనికి రాకుండా అయిపోతాయి అనడం మాత్రం ఖాయం.

Tags:    
  • trivikram 
  • trivikrammovies 
  • adarshakutumbam 
  • nuvvenuvve 
  • tollywood 

Similar News

తండ్రి కట్ చేసిన సీన్‌ను దొంగచాటుగా కలిపిన హృతిక్!

2026-11-12 08:17 GMT

సూర్యతో నాకు పోలికేంటి? ఆయన లెజెండ్!

2026-11-12 08:16 GMT

వారి గురించి ఆలోచించడం సోనూ సూద్‌ గొప్పతనం..!

2026-11-12 08:16 GMT

'ఇడుపు కాయితం' టీజర్.. సీతా కళ్యాణంతో మొదలై విడాకుల దాకా..

2026-11-12 06:57 GMT

శేఖర్ మాస్టర్‌కు రోడ్డు ప్రమాదం.. తప్పిన పెద్ద ముప్పు!

2026-11-12 06:51 GMT

2024-26 మధ్య తెలుగులో వచ్చిన బెస్ట్ కంటెంట్ బేస్డ్ మూవీస్ ఇవేనా...

2026-11-12 06:06 GMT

టికెట్ రేట్లు పెరిగినా ప్రేక్షకులను రప్పించిన సినిమాలు.. పుష్ప 2 రికార్డు ప్రత్యేకం!

2026-11-12 05:55 GMT

అనిరుధ్ పెళ్లి వీడియోలపై వార్నింగ్.. ప్రైవసీకి భంగం కలిగిస్తే చర్యలు తప్పవా?

2026-11-12 05:55 GMT

టాక్సిక్ ఫ్లాప్‌పై కియారా కామెంట్స్.. కన్నడ ఇండస్ట్రీని తప్పుబట్టని హీరోయిన్!

2026-11-12 05:53 GMT

ఒకే ప్రేమ్ లో ర‌ణ‌వీర్..ర‌ణ‌బీర్..దీపిక‌..అలియా!

2026-11-12 05:50 GMT

పవన్ పిల్లలకు ఆ ఆస్తి.. ఎప్పుడిచ్చారంటే!

2026-11-12 04:22 GMT

Copyright @2026

Powered by Blink CMS