• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వారి గురించి ఆలోచించడం...

వారి గురించి ఆలోచించడం సోనూ సూద్‌ గొప్పతనం..!

| కరోనా సమయంలో వలస కూలీలకు అండగా నిలిచి గుర్తింపు తెచ్చుకున్న సోనూసూద్‌ మరోసారి సేవా ఉద్యోగుల సమస్యపై స్పందించారు. ఎయిర్‌పోర్టులు, హోటళ్లలో గంటల తరబడి నిల్చుని పనిచేసే సిబ్బందికి మధ్యలో కూర్చుని విశ్రాంతి తీసుకునే అవకాశం కల్పించాలని సూచించారు. ఇందుకోసం పని ప్రదేశాల్లో ఎత్తైన కుర్చీలు లేదా స్టూల్స్ ఏర్పాటు చేయాలని సంస్థల యాజమాన్యాలను కోరారు.

By - Ramesh Palla
Update: 2026-11-12 08:16 GMT

కరోనా సమయం నుంచి సినీ నటుడు సోనూ సూద్‌ పేరు ఏదో ఒక విషయంలో, ఏదో ఒక సందర్భంగా మారు మ్రోగుతూనే ఉంది. సోనూ సూద్‌ ను రియల్‌ హీరో అంటూ చాలా మంది ఇప్పటికీ తమ గుండెల్లో పెట్టుకుని పూజిస్తూ ఉన్నారు. ఎంతో మంది స్టార్స్‌, సెలబ్రిటీలు, హీరోలు ఉన్నప్పటికీ ఈయన మాత్రమే బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తాడని చాలా మంది అభిమానులు అంటూ ఉంటారు. ఇండస్ట్రీకి వచ్చి సుదీర్ఘ కాలం అయినప్పటికీ కరోనా సమయంలో దాతృత్వం చాటుకోవడం వల్లే రియల్‌ హీరోగా గుర్తింపు సొంతం చేసుకున్నాడు. అంతకు ముందు వరకు కెరీర్‌ ఒక ఎత్తు అయితే, ఆ తర్వాత సోనూసూద్‌ కెరీర్ ఒక ఎత్తు అనడంలో సందేహం లేదు. రియల్‌ హీరో ఇమేజ్ రావడంతో సినిమాల్లోనూ సోనూ సూద్‌ హీరోగా నటిస్తూ ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నాలు చేస్తున్నాడు.

సోనూసూద్‌ రియల్‌ హీరో...

సోనూసూద్‌ కరోనా సమయంలో నిరాశ్రయులను, వలస కూలీలను ఆదుకోవడంతో ఆగి పోలేదు. ఎంతో మందికి ఆర్థిక సాయం చేయడంతో పాటు, ఎన్నో కుటుంబాల్లో వెలుగు నింపిన విషయం అందరికీ తెలిసిందే. తన చారిటబుల్ ట్రస్ట్‌ ద్వారా సోనూసూద్‌ చేస్తున్న మంచి పనుల గురించి ఎంత చెప్పినా తక్కువే. వ్యక్తిగానూ సోనూసూద్‌ ఎన్నో మంచి కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా గొప్పతనం చాటుకుంటూ ఉన్నాడు. తాజాగా సోనూసూద్‌ ఎవ్వరూ పట్టించుకోని, ఏ ఒక్కరూ గుర్తించని సర్వీస్‌ ఉద్యోగుల సమస్యలపై స్పందించాడు. ఎయిర్‌ పోర్ట్స్‌, హోటల్స్‌ లో పని చేసే సిబ్బంది రోజులో పది గంటలకు అంతకు మించి నిల్చుని ఉండాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా రిసెప్షన్‌లో ఉండేవారు, చెక్‌ఇన్‌ కౌంటర్లలో ఉద్యోగాలు నిర్వహించే వారు, కస్టమర్‌ సర్వీస్ విభాగాల్లో విధులు నిర్వహించే వారు రోజులో ఎక్కువ గంటలు నిల్చుని డ్యూటీ చేయాల్సి వస్తుంది.

సర్వీస్ ఉద్యోగుల గురించి సోనూసూద్‌...

ప్రతి రోజు ఎక్కువ గంటలు నిల్చోవడంతో వారి ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని సోనూసూద్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. ఎక్కువ సమయం షిప్ట్‌ ల్లో పని చేసే వారికి కచ్చితంగా యాజమాన్యం విశ్రాంతి ఇవ్వాల్సిన అవసరం ఉందని సోనూసూద్‌ అభిప్రాయం వ్యక్తం చేశాడు. పని ఒత్తిడి, రద్దీ సమయాల్లో వారికి కొన్ని నిమిషాలు అయినా కూర్చునే వెసులుబాటు అవసరం అని ఈ సందర్భంగా సోనూ సూద్‌ అన్నాడు. ఈ సమస్య పరిష్కారానికి పెద్దగా డబ్బు అవసరం లేదని, వారు పని మధ్యలో కూర్చునే విధంగా ఎత్తుగా ఉండే చైర్లను అందుబాటు ఉంచాల్సిన అవసరం ఉందన్నాడు. పని మధ్యలో చిన్న బ్రేక్ తీసుకోవడం వల్ల వారు మరింత ఉత్సాహంగా పనులు నిర్వహించేందుకు వీలుగా ఉంటుందని, ఎక్కువ సమయం నిల్చుని కాళ్ల నొప్పి, నడుము నొప్పితో బాధ పడాల్సిన పరిస్థితి ఉంటుందని సోనూసూద్‌ ఆవేదన వ్యక్తం చేశాడు.

ఎయిర్‌ పోర్ట్‌, హోటల్స్ లో సర్వీస్ అందించే వారు...

సంస్థలు తమ వినియోగదారులకు బెస్ట్‌ సర్వీస్ ఇవ్వాలని, వారికి ఎలాంటి ఇబ్బంది కలుగకూడదని అనుకుంటాయి. కానీ అవే సంస్థల యాజమాన్యాలు ఆ సర్వీస్‌ ఇచ్చే ఉద్యోగులను మాత్రం పట్టించుకోవడం లేదు. మెరుగైన సేవలు అందించాలంటే మొదట ఆ సర్వీస్ అందించే వారు హెల్తీగా ఉండాల్సిన అవసరం ఉందని సోనూసూద్‌ అన్నాడు. అందుకే పని చేసే ప్రదేశంలోనే కొన్ని నిమిషాల రెస్ట్‌ కోసం ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందని, ఈ విషయాన్ని సంస్థలు పరిగణలోకి తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశాడు. ఒక స్టూల్‌ లేదా కుర్చీ వంటివి ఏర్పాటు చేస్తే వారు తమ పనులకు ఎలాంటి ఇబ్బంది లేకుండానే వారు అవసరం అయినప్పుడు విశ్రాంతి తీసుకుంటారని సోనూసూద్‌ అన్నాడు. వారు ఆరోగ్యంగా ఉండటంతో పాటు, తమ పనులను మరింత ఉత్తేజంగా చేయడం కోసం కచ్చితంగా రెస్ట్‌ అవసరం అని సోనూసూద్‌ పేర్కొన్నాడు. ఇప్పటి వరకు ఈ సర్వీస్‌ ఉద్యోగులకు సంబంధించిన సమస్యను ఏ ఒక్కరూ ప్రస్థావించలేదు. వారి కోసం సోనూసూద్‌ ఆలోచించడం గొప్ప విషయం. వారి గురించి ఇంతగా ఆలోచించిన సోనూసూద్‌ నిజంగా రియల్‌ హీరో అనడంలో సందేహం లేదు.

Tags:    
  • sonusood 
  • realhero 
  • serviceemployees 
  • airportstaff 

Similar News

టాలీవుడ్‌లో జాన్వీ కపూర్‌ కొత్త ఆఫర్ల పరిస్థితి ఏంటి?

2026-11-16 19:30 GMT

సాయి పల్లవి దగ్గర నాగవంశీ అడ్వాన్స్ డబ్బులు.. వెనక్కి ఇచ్చిన తీసుకోలేదంటూ కామెంట్స్..!

2026-11-16 19:12 GMT

విడిపోయినా వీడని బంధం.. స్టార్ క‌పుల్స్ ప‌రిణ‌తికి హ్యాట్సాఫ్‌

2026-11-16 19:12 GMT

నెల ముందే రెడీ అంటున్న సంక్రాంతి సినిమాలు

2026-11-16 19:08 GMT

3.5 కోట్ల లగ్జరీ కార్ గిఫ్ట్ అందుకున్న క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్!

2026-11-16 19:08 GMT

బాలకృష్ణ 'దాదా' సందడి షురూ, బిజినెస్‌ అదుర్స్‌!

2026-11-16 19:07 GMT

రామాయణ చైనీస్ వర్షన్ రెడీ అవుతుందట!

2026-11-16 19:05 GMT

జుట్టు కట్ చేసుకున్న సాయి పల్లవి.. షాకైన మమ్మీ-డాడీ!

2026-11-16 19:04 GMT

అనీల్ రావిపూడి తో తార‌క్ ప్ర‌యోగం ఎలాంటిది!

2026-11-16 18:56 GMT

15 ఏళ్ల సంగీత ప్రయాణం పూర్తి.. ఎమోషనల్ అయిన అనిరుధ్!

2026-11-16 18:55 GMT

పెళ్లి గంటలో ముగించ‌క‌పోతే మంటపం నుంచి లేచిపోతా!

2026-11-16 18:30 GMT

టాలీవుడ్‌లో కొత్త హీరోయిన్ల ఎంట్రీ!

2026-11-16 17:30 GMT

Copyright @2026

Powered by Blink CMS