• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  3.5 కోట్ల లగ్జరీ కార్...

3.5 కోట్ల లగ్జరీ కార్ గిఫ్ట్ అందుకున్న క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్!

| 2016లో విడుదలై పరాజయం పాలైన ‘సనమ్ తేరి కసమ్’ రీ-రిలీజ్‌లో భారీ విజయం సాధించడంతో నిర్మాత దీపక్ ముకుత్ హీరో హర్షవర్ధన్ రాణేకు రూ.3.5 కోట్ల విలువైన ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఆక్టాను బహుమతిగా ఇచ్చారు. ఈ సందర్భంగా హర్షవర్ధన్ ‘సనమ్ తేరి కసమ్ 2’కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని నిర్మాతను సరదాగా కోరారు. దీంతో సీక్వెల్‌పై చర్చ మళ్లీ మొదలైంది.

By - Srikanth Kontham
Update: 2026-11-16 19:08 GMT

కొన్ని సినిమాలు విడుదలైన సమయంలో బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడతాయి. కానీ అవే సినిమాలు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో ఆ చిత్రాలకు దక్కే ఆదరణ అద్భుతంగా ఉంటుంది. అలా 2016లో విడుదలై బాక్సాఫీస్ వద్ద పరాజయం అయిన‌ రొమాంటిక్ లవ్ స్టోరీ `సనమ్ తేరి కసమ్`. హర్షవర్ధన్ రానే, మావ్రా హోకేన్ జంటగా నటించిన ఈ చిత్రం ఆ సమయంలో పెద్దగా కలెక్షన్లు సాధించలేదు. కానీ కొన్నేళ్ల తర్వాత ఓటీటీలు, సోషల్ మీడియాలో ఈ సినిమాకు యూత్‌లో కల్ట్ ఫాలోయింగ్ ద‌క్కింది.

ఈ నేపథ్యంలోనే మేకర్స్ ఈ సినిమాను గత ఏడాది ఫిబ్రవరిలో మరోసారి థియేటర్లలో రీ-రిలీజ్ చేశారు. ఎవరూ ఊహించని విధంగా రీ-రిలీజ్ బాక్సాఫీస్ వద్ద సంచ‌లనం సృష్టించింది. మొదటి రోజే 4 కోట్లకు పైగా వసూలు చేసిన సినిమా లాంగ్ ర‌న్ లో మంచి వ‌సూళ్ల‌ను సాధించి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. ఈ భారీ విజయంతో నిర్మాత దీపక్ ముకుత్ సంతోషం వ్యక్తం చేశారు.

రీ-రిలీజ్ సమయంలో సినిమాను ముందుండి ప్రమోట్ చేసిన హీరో హర్షవర్ధన్ రానేకు ఇచ్చిన మాట ప్రకారం దీపక్ ముకుత్ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. ఏకంగా 3.5 కోట్ల విలువైన సరికొత్త ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఆక్టా లగ్జరీ కార్‌ను హర్షవర్ధన్‌కు బహుమతిగా అందించారు. నిర్మాత స్వయంగా కారు తాళాలు అందిస్తున్న ఫోటోను హర్షవర్ధన్ తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

నిర్మాత ఇచ్చిన కాస్ట్లీ గిఫ్ట్‌కు ఆనందించిన హర్షవర్ధన్ రానే అదే పోస్ట్‌లో ఓ ఆసక్తికర రిక్వెస్ట్ పెట్టారు. `దీపక్ సర్.. నేను ఎంతో మంది ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం చూశాను. కానీ మీరిచ్చిన మాటకు కట్టుబడి ఉండే విధానం చాలా ప్రత్యేకమైనది. గత ఏడాది మీ ఆఫీస్ బయట అభిమానులతో కలిసి సినిమా రీ-రిలీజ్ కోసం ఎలా నిలబడ్డానో? వచ్చే నెల నా పుట్టినరోజున కూడా మీ ఇంటి ముందు అలాగే నిలబడతాను. అయితే ఈసారి నాకో కోరిక ఉంది. అదే `సనమ్ తేరి కసమ్ 2` సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వండి` అంటూ సరదాగా కోరారు.

దర్శకులు రాధిక రావు..వినయ్ సప్రూ తెరకెక్కించిన ఈ క్లాసిక్ లవ్ స్టోరీకి సీక్వెల్ వస్తే బాగుంటుందని చాలా కాలంగా అభిమానులు కోరుకుంటున్నారు. తాజాగా రీ-రిలీజ్ సక్సెస్.. నిర్మాత ఇచ్చిన భారీ లగ్జరీ గిఫ్ట్‌తో సీక్వెల్ వార్తలు మరింత జోరందుకున్నాయి. మరి హీరో అభ్యర్థనకు నిర్మాత దీపక్ ముకుత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అన్న‌ట్లు హ‌ర్ష‌వ‌ర్ద‌న్ రాణే బాలీవుడ్ స‌హా టాలీవుడ్ లో కూడా స‌హాయ న‌టుడిగా కొన్ని సినిమాలు చేసిన సంగ‌తి తెలిసిందే.

Tags:    
  • sanamterikasam 
  • harshvardhanrane 
  • sanamterikasam2 

Similar News

సాయి పల్లవి దగ్గర నాగవంశీ అడ్వాన్స్ డబ్బులు.. వెనక్కి ఇచ్చిన తీసుకోలేదంటూ కామెంట్స్..!

2026-11-16 19:12 GMT

విడిపోయినా వీడని బంధం.. స్టార్ క‌పుల్స్ ప‌రిణ‌తికి హ్యాట్సాఫ్‌

2026-11-16 19:12 GMT

నెల ముందే రెడీ అంటున్న సంక్రాంతి సినిమాలు

2026-11-16 19:08 GMT

బాలకృష్ణ 'దాదా' సందడి షురూ, బిజినెస్‌ అదుర్స్‌!

2026-11-16 19:07 GMT

రామాయణ చైనీస్ వర్షన్ రెడీ అవుతుందట!

2026-11-16 19:05 GMT

జుట్టు కట్ చేసుకున్న సాయి పల్లవి.. షాకైన మమ్మీ-డాడీ!

2026-11-16 19:04 GMT

అనీల్ రావిపూడి తో తార‌క్ ప్ర‌యోగం ఎలాంటిది!

2026-11-16 18:56 GMT

15 ఏళ్ల సంగీత ప్రయాణం పూర్తి.. ఎమోషనల్ అయిన అనిరుధ్!

2026-11-16 18:55 GMT

పెళ్లి గంటలో ముగించ‌క‌పోతే మంటపం నుంచి లేచిపోతా!

2026-11-16 18:30 GMT

టాలీవుడ్‌లో కొత్త హీరోయిన్ల ఎంట్రీ!

2026-11-16 17:30 GMT

సీనియర్ హీరోలు ఈ యంగ్ డైరెక్టర్స్ తో సినిమాలు చేయబోతున్నారా?

2026-11-16 16:30 GMT

Copyright @2026

Powered by Blink CMS