• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  జుట్టు కట్ చేసుకున్న సాయి...

జుట్టు కట్ చేసుకున్న సాయి పల్లవి.. షాకైన మమ్మీ-డాడీ!

| ధనుష్, మమ్ముట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘ఓం’ సినిమా కోసం సాయి పల్లవి తన పొడవాటి జుట్టును కత్తిరించుకున్నారు. ఇందులో ఐపీఎస్ అధికారి నిత్యా రెడ్డి పాత్రలో కనిపించనున్నారు. ఈ విషయం ముందుగా చెప్పకపోవడంతో ఆమె తల్లి షాక్ అయ్యారని, తండ్రి కూడా విగ్గు అనుకున్నారని సాయి పల్లవి వెల్లడించారు. దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామిపై నమ్మకంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

By - Srikanth Kontham
Update: 2026-11-16 19:04 GMT

నేచురల్ బ్యూటీ సాయి పల్లవి అంటే? సొగ‌సైన‌ ఉంగరాల జుట్టు.. సహజమైన రూపం గుర్తుకొస్తాయి. గ్లామర్ పాత్రలకు దూరంగా కథకు ప్రాధాన్యత ఇచ్చే ప‌ల్ల‌వి పాత్ర కోసం ఎంతటి సాహసానికైనా సిద్ధపడతారు. తాజాగా రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో ధనుష్, మమ్ముట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ `ఓం` సినిమా కోసం సాయి పల్లవి ఏకంగా తన ప్రియమైన జుట్టును కత్తిరించుకున్నారు. ఈ చిత్రంలో నిత్యా రెడ్డి అనే పవర్‌ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్న అమ్మ‌డు లుక్ కోసం తీసుకున్న నిర్ణయం ఇంట్లో పెద్ద అలజడినే సృష్టించింద‌ని ఆలస్యంగా వెలుగులోకి వ‌చ్చింది.

ఈ విష‌యాన్ని సాయి పల్లవి స్వయంగా రివీల్ చేసారు. తాను జుట్టు క‌త్తిరించుకుంటున్నాను అనే విషయాన్ని ముందుగా తన తల్లికి చెప్పలేదని.. సడెన్‌గా కొత్త లుక్ చూసి తట్టుకోలేకపోయారని పల్లవి న‌వ్వేసారు. `నా జుట్టు కత్తిరించుకున్న విషయం తెలియగానే మా అమ్మ షాక్ అయ్యారు. ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెంటనే ఫోన్ కట్ చేశారు. ఆ తర్వాత మా నాన్న నాకు కాల్ చేసి.. అది విగ్గు కదా పల్లవి? అని అడిగారు. నిజంగానే కట్ చేయించు కున్నానని చెప్పడంతో ఆయనా షాక్ అయ్యారు. ఆ తర్వాత మా నాన్న అమ్మకు నచ్చజెప్పి నాతో మాట్లాడించడానికి చాలా సమయం పట్టింద`న్నారు.

పాత్ర కోసం రాజ్‌కుమార్ పెరియసామి స్క్రిప్ట్ చెప్పినప్పుడే ఈ రోల్‌కు ఎలా సెట్ అవుతానోనని సాయి పల్లవి ఆలోచించారట. అయితే దర్శకుడు ప్రముఖ ఐపీఎస్ ఆఫీసర్ మెరిన్ జోసెఫ్ ఫోటోను చూపించి ఆ తరహా లుక్ కావాలని అడిగారట. ఆమెకు షార్ట్ హెయిర్ ఉందని సాయి పల్లవి అనగానే.. `నువ్వు జుట్టు కత్తిరించుకుంటే ఆ పాత్రకు కావాల్సిన ఆటిట్యూడ్.. లుక్ సహజంగానే వచ్చేస్తాయి` అని దర్శకుడు అన్నారట. రాజ్‌కుమార్ పాత్రలను రాసే విధానం.. ఆయనపై ఉన్న నమ్మకంతో తనకు ఎంతో ఇష్టమైన జుట్టును కత్తిరించుకోవడానికి ఏమాత్రం కష్టమనిపించలేదని సాయి పల్లవి తెలిపారు.

`అమరన్` వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత రాజ్‌కుమార్ పెరియసామి సాయి పల్లవి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో `ఓం`పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో ధనుష్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్‌గా.. మమ్ముట్టి కీలక పాత్రలో క‌నిపించ‌నున్నారు. ఈ చిత్రంలో శ్రీలీల మరో హీరోయిన్‌గా మెరవనుంది. గత నెలలోనే విడుదల కావాల్సిన ఈ సినిమా రజనీకాంత్ `జైలర్ 2` కార‌ణంగా వాయిదా పడి ఎట్టకేలకు ఈ నెల 20న థియేటర్లలోకి వస్తోంది.

Tags:    
  • saipallavi 
  • dhanush 
  • ommovie 

Similar News

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

బన్నీతో సినిమా.. ఇంకెంత వెయిటింగ్!

2026-11-20 05:07 GMT

రావిపూడి సరే.. మరో డైరెక్టర్ ఎక్కడ వెంకీ?

2026-11-20 04:36 GMT

'కింగ్ 100' లో చైత‌న్య అతిథి పాత్ర‌లో న‌టిస్తున్నారా?

2026-11-20 04:36 GMT

2026లోనూ టాయిలెట్..బాత్రూమ్ గురించి మాట్లాడుకునే దుస్తుతి!

2026-11-20 04:36 GMT

100 కోట్ల హీరో + 100 కోట్ల డైరెక్టర్.. ఈసారి పెద్ద టార్గెట్టే!

2026-11-20 04:16 GMT

Bigg Boss Telugu 10: డిక్టేటర్ల ఈగో వార్తో పోటెత్తిన హౌజ్!

2026-11-20 03:46 GMT

యంగ్ హీరోలతో సుకుమార్.. లిస్టు పెరుగుతూనే ఉందిగా..

2026-11-19 22:30 GMT

'మనం' లాంటి కొత్త స్క్రిప్టు.. అంచ‌నాలు పెంచేసాడే!

2026-11-19 21:13 GMT

ర‌ష్మిక స్పీచ్ స‌రే.. ఆ మెడ‌లో కేజీ బంగారు క‌డియంపైనే క‌న్ను!

2026-11-19 21:12 GMT

Copyright @2026

Powered by Blink CMS