• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  Box Office >  2027లో బ్లాస్టింగ్...

2027లో బ్లాస్టింగ్ మామూలుగా ఉండ‌దు!

| టాలీవుడ్‌కు 2027 కీలక ఏడాదిగా మారనుంది. ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్‌ల ‘డ్రాగన్’, ప్రభాస్ నటిస్తున్న ‘స్పిరిట్’, ‘ఫౌజీ’, రాజమౌళి – మహేష్ బాబు కాంబినేషన్‌లోని ‘వారణాసి’ వచ్చే ఏడాది విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఒకే ఏడాది ఇన్ని భారీ పాన్ ఇండియా చిత్రాలు బరిలోకి దిగడం టాలీవుడ్‌లో ఆసక్తి రేపుతోంది.

By - Srikanth Kontham
Update: 2026-11-12 15:30 GMT

టాలీవుడ్ నుంచి స‌రైన పాన్ ఇండియా హిట్ ప‌డి చాలా కాల‌మ‌వుతోంది.`పుష్ప 2` త‌ర్వాత వాతావ‌ర‌ణం అంతా ఒక్క‌సారిగా సైలెంట్ అయిపోయింది. ఈ ఏడాది పెద్ది రిలీజ్ అయినా? అది పాన్ ఇండియా హిట్ కాదు. రీజ‌న‌ల్మా ర్కెట్ కే ప‌రిమిత‌మైంది. శాండిల్ వుడ్ నుంచి `టాక్సిక్` రిలీజ్ అయినా? అది డిజాస్ట‌ర్ అయింది. ఇలా స‌రైన పాన్ ఇండియా విజ‌యం లేక సౌత్ ఇండ‌స్ట్రీ వెల వెల‌బోతుంది. ఆ ర‌కంగానే 2026 ఏడాదిని ముగించాల్సి వ‌స్తోంది. అయితే 2027లో మాత్రం బ్లాస్టింగ్ మామూలుగా ఉండ‌ద‌ని తెలుస్తోంది.

అగ్ర హీరోలంతా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రాలు వ‌చ్చే ఏడాది వరుసగా విడుద‌ల కానున్నాయి. `డ్రాగన్`, `స్పిరిట్`, `ఫౌజీ`, `వారణాసి` వంటి భారీ ప్రాజెక్టులు 2027 క్యాలెండర్‌ను హీటెక్కించ‌డం సంచలనంగా మారుతుంది. ఈ లైనప్‌లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న చిత్రం ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న‌ యాక్షన్ ఎంటర్‌టైనర్ `డ్రాగన్`. `కేజీఎఫ్`, `సలార్` చిత్రాలతో తనదైన మాస్ ఎలివేషన్స్ చూపించిన ప్రశాంత్ నీల్.. తారక్‌ను మునుపెన్నడూ చూడని పవర్‌ఫుల్ అవతార్‌లో చూపించబోతున్నారు.

మరోవైపు రెబల్ స్టార్ ప్రభాస్ న‌టిస్తోన్న రెండు భారీ పాన్-ఇండియా చిత్రాలు 2027లోనే బాక్సాఫీస్ ముందుకు రాబోతున్నాయి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న‌ పవర్‌ఫుల్ పోలీస్ డ్రామా `స్పిరిట్` .. హను రాఘవపూడి దర్శకత్వంలో పీరియాడిక్ వార్ డ్రామాగా తెరకెక్కుతోన్న `ఫౌజీ` చిత్రాలు ప్రభాస్ అభిమానులకు డబుల్ ధమాకా ఇవ్వనున్నాయి. ఇవ‌న్నీ ప‌క్క‌న బెడితే? ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ గా రాజ‌మౌళి-మ‌హేష్ ల `వార‌ణాసి` రిలీజ్ అవుతుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కుతోన్న గ్లోబల్ అడ్వెంచర్ ఎపిక్ 2027లోనే విడుద‌ల‌వుతుంది.

ఈ విజ‌యం టాలీవుడ్ స్థాయిని మరో మెట్టు పైకి తీసుకెళ్తుంద‌న‌డంలో సందేహం లేదు. వీటితో పాటు మరికొందరు అగ్ర హీరోల క్రేజీ ప్రాజెక్టులు కూడా ఇదే ఏడాది బరిలో నిలిచే అవకాశాలున్నాయి. అయితే ఒకే ఏడాది టాలీవుడ్ నుంచి టాప్ హీరోలు న‌టిస్తోన్న ఇన్ని పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ అవ్వ‌డం ఇదే తొలిసారి. పాన్ ఇండియా సినిమాలు మొద‌లైన త‌ర్వాత ఇంత పెద్ద ఎత్తున ఇన్ని సినిమాలు ఇప్ప‌టివ‌ర‌కూ రిలీజ్ అవ్వ‌లేదు. ఆ ర‌కంగా 2027 ఓ సంచ‌ల‌న‌మే అవుతుంది.

సాధారణంగా స్టార్ హీరోల భారీ చిత్రాల మధ్య మూడు నాలుగు నెలల గ్యాప్ ఉండేలా నిర్మాతలు రిలీజ్ ప్లాన్ చేస్తారు. కానీ 2027లో మాత్రం సీజన్లతో సంబంధం లేకుండా రెండు నెలలకోక‌ భారీ పాన్-ఇండియా సినిమా సందడి చేసే పరిస్థితి కనిపిస్తోంది. ఈ హంగామా టాలీవుడ్ కే ప‌రిమితం కాదు. నార్త్ బెల్ట్ స‌హా ఓవర్సీస్ మార్కెట్లలోనూ సంద‌డి త‌ప్ప‌దు.

Tags:    
  • tollywood 
  • dragon 
  • spirit 
  • fauzi 
  • varanasi 

Similar News

1000 కోట్ల క్లబ్.. హీరోగా ఒకటి.. విలన్‌గా మరొకటి

2026-11-13 06:47 GMT

'పుష్ప 2' రికార్డును బ్రేక్ చేయ‌లేక‌పోయిన రామాయ‌ణం-1

2026-11-13 02:45 GMT

బాహుబలి 2ను వెనక్కి నెట్టిన రామాయణం.. పుష్ప 2కు కూడా షాక్!

2026-11-12 14:30 GMT

2024-26 మధ్య తెలుగులో వచ్చిన బెస్ట్ కంటెంట్ బేస్డ్ మూవీస్ ఇవేనా...

2026-11-12 06:06 GMT

టికెట్ రేట్లు పెరిగినా ప్రేక్షకులను రప్పించిన సినిమాలు.. పుష్ప 2 రికార్డు ప్రత్యేకం!

2026-11-12 05:55 GMT

6 రోజుల్లో 100 కోట్ల క్ల‌బ్.. సౌత్‌లో ఈ ఒక్క‌డికే

2026-11-11 16:37 GMT

500 కోట్ల క్లబ్.. సౌత్ హీరోల్లో టాప్ ఎవరంటే!

2026-11-11 05:58 GMT

ఈ హీరోనే ఇప్పుడు బాలీవుడ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియ‌న్ సూప‌ర్‌స్టార్?

2026-11-11 03:58 GMT

మండే రోజు రామాయణం మంటలు

2026-11-10 14:11 GMT

'రామాయణం' బుకింగ్స్.. ఒక్క రోజులో 16 లక్షల టికెట్లు!

2026-11-10 06:39 GMT

దర్శకుడి నుంచి నిర్మాతగా.. వెంకీ కుడుముల సినీ ప్రయాణంలో ఆసక్తికర విషయాలు!

2026-11-10 06:13 GMT

Copyright @2026

Powered by Blink CMS