అనిల్ రావిపూడికి ఉన్న టైమ్ మిగతా దర్శకులకు ఉండటం లేదా...
| దర్శకుడు అనిల్ రావిపూడి వరుసగా తొమ్మిది విజయాలతో దూసుకెళ్తున్నారు. ప్రతి ఏడాది సంక్రాంతికి ఒక సినిమాను విడుదల చేస్తూ, ఇతర కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నారు. ప్రస్తుతం పదో సినిమాతో మరో విజయాన్ని అందుకోవాలని చూస్తున్నారు. 2027 సంక్రాంతికి ఆయన సినిమా రానుండటంతో, మిగతా దర్శకులు కూడా అనిల్ రావిపూడి టైమ్ మేనేజ్‌మెంట్‌ను చూసి నేర్చుకోవాలంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి.
కమర్షియల్ సినిమాలను చేసి సక్సెస్ లను సాధించడం అంత ఆషామాషీ వ్యవహారమైతే కాదు. ఎప్పటికప్పుడు ప్రేక్షకుడి ఆలోచన ధోరణి మేరకు కమర్షియల్ సబ్జెక్టులను డిఫరెంట్ గా చెప్పే ప్రయత్నం చేయాలి. ఎక్కడ తడబడినా కూడా సినిమా ఫ్లాప్ అవుతుంది. తద్వారా దర్శకుడి ఆశలన్నీ కాలగర్భంలో కలిసిపోతాయి. కమర్షియల్ డైరెక్టర్ గా సూపర్ సక్సెస్ లను సాధిస్తున్న అనిల్ రావిపూడి వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇప్పటికే ఆయన వరుసగా తొమ్మిది విజయాలతో ప్రేక్షకులను మెప్పించాడు. ప్రస్తుతం పదో సినిమాతో గ్రాండ్ సక్సెస్ ని దక్కించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. 2027 సంక్రాంతి కి గ్రాండ్ విక్టరీ పక్కా అంటూ అతని అభిమానులు ఇప్పటికే సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు.
అనిల్ కి సంవత్సరానికో సినిమా ఎలా సాధ్య అవుతుంది...
అనిల్ రావిపూడి ప్రతి సంవత్సరం సంక్రాంతికి ఒక సినిమాని రిలీజ్ చేస్తున్నాడు. మిగతా దర్శకులు ఒక సినిమా కోసం రెండు మూడు సంవత్సరాల సమయాన్ని తీసుకుంటున్నారు. అయినప్పటికి అనుకున్న డేట్ కి మూవీని రిలీజ్ చేయలేక పోస్ట్ పోన్ చేస్తున్నారు. అనిల్ రావిపూడి సినిమాల స్పీడ్ ను చూసిన ప్రతి ఒక్కరు అనిల్ కి ఉన్న టైం మిగతా దర్శకులకు ఎందుకు ఉండటం లేదు. ఆయన కేవలం సినిమాలను మాత్రమే చేయడం లేదు. సమయం దొరికినప్పుడు ఈవెంట్లకి గెస్ట్ గా వచ్చి మూవీ టీమ్ ను ఎంకరేజ్ చేస్తున్నాడు. కొన్ని షోస్ కి జడ్జ్ గా కూడా వ్యవహరిస్తున్నాడు. ఆయన అవన్నీ చేస్తూనే సంవత్సరానికి ఒక సినిమాని రిలీజ్ చేయగలుగుతున్నాడు. మిగతా దర్శకులు ప్లానింగ్ లో ఎక్కడ లోపం జరుగుతుంది. ఎందుకని వాళ్ళు రెండు మూడు సంవత్సరాలలో కూడా సినిమాలను కంప్లీట్ చేయలేకపోతున్నారనే ధోరణిలో కొన్ని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇండస్ట్రీ బాగుపడుతుందా?
ప్రతి ఏటా ఎక్కువ సంఖ్యలో సినిమాలు రిలీజైతే ఇండస్ట్రీ బాగుంటుంది. అలాగే ఇండస్ట్రీలో మనీ కూడా ఎక్కువగా జెనరేట్ అవుతుంది. చాలామంది సినీ కార్మికులకు సైతం నిత్యం పని దొరుకుతుంది. కాబట్టి ప్రతి దర్శకుడు వీలైనంత వరకు తక్కువ సమయంలో సినిమాలను చేయడానికి ప్రయత్నిస్తే అందరికి అన్ని విధాలా బాగుంటుంది. కాబట్టి అనిల్ రావిపూడి ని చూసి మరి కొంతమంది దర్శకులు నేర్చుకోవాలని సోషల్ మీడియాలో చాలామంది కామెంట్స్ చేస్తున్నారు...