• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో...

ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో మ‌ణిసార్ మ‌ళ్లీ రొమాంటిక్ ల‌వ్ స్టోరీ!

| మణిరత్నం దర్శకత్వంలో విజయ్ సేతుపతి, సాయి పల్లవి జంటగా నటిస్తున్న ‘ఇంజి వెల్లం’ పోస్టర్ ఆసక్తి పెంచుతోంది. ఇందులో ఇద్దరూ చిన్నపిల్లలకు తల్లిదండ్రులుగా కనిపించడం చర్చనీయాంశమైంది. ‘బొంబాయి’ తరహా ఫ్యామిలీ ఎమోషనల్ లవ్‌స్టోరీగా ఈ సినిమా ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

By - Srikanth Kontham
Update: 2026-11-12 17:59 GMT

చ‌ల‌న చిత్ర‌ పరిశ్రమలో ప్రేమకథలకు సరికొత్త అర్థం చెప్పిన దిగ్గజ దర్శకుడు మణిరత్నం మరోసారి తన మార్క్ ఎమోషనల్ అండ్ రొమాంటిక్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారు. `మౌన రాగం`, `సఖి` వంటి ఎప్పటికీ క్లాసిక్ ల‌వ్ స్టోరీల‌ను అందించిన మ‌ణిసార్ ఈసారి విజయ్ సేతుపతి - సాయి పల్లవి జంట‌గా `ఇంజి వెల్లం` అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పోస్టర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇందులో విజయ్ సేతుపతి- సాయి పల్లవి చిన్న పిల్లలతో కనిపించడం విశేషం.

 

ప్రేమ జంటగా కాకుండా తల్లి దండ్రులుగా క‌నిపించ‌డం సినిమాపై అంచనాలను పెంచుతుంది. మణిరత్నం సినిమాల్లో భిన్నమైన రిలేషన్‌షిప్ డైనమిక్స్ కనిపిస్తుంటాయి. ఈసారి కుటుంబ నేపథ్యంతో పాటు భార్యాభర్తల మధ్య సున్నితమైన భావోద్వేగాలను ఈ చిత్రం ద్వారా మ‌ణిసార్ వెండితెరపై ఆవిష్క‌రిస్తున్న‌ట్లు తెలు స్తోంది. అయితే ఆ ఇద్దరు పిల్లలు ఎవరనే దానిపై నెటిజన్లలో జోరుగా చర్చ సాగుతోంది.

అచ్చం మణిరత్నం గత చిత్రం `బొంబాయి`లో అరవింద్‌స్వామి- మధుబాల కవల పిల్లలకు తల్లిదండ్రులుగా కనిపించినట్లుగానే `ఇంజి వెల్లం`లో కూడా కవల పిల్లల తల్లిదండ్రులుగా నటిస్తున్నారా? లేక కథలో ఏదైనా కీలకమైన మలుపు ఉందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ బొంబాయి తరహాలోనే ఇది కూడా ఎమోషనల్ ఫ్యామిలీ లవ్‌స్టోరీ అయితే ఈ చిత్రం ప్రేక్షకులను కంటతడి పెట్టించడం ఖాయం.

ల‌వ్ స్టోరీ అయినా? త‌ల్లిదండ్ర‌లు-పిల్ల‌ల మ‌ధ్య అయినా ఎమోష‌న‌ల్ బాండింగ్ హైలైట్ చేయ‌డంలో మ‌ణిర‌త్నం మాస్ట‌ర్. అందులో మ‌ణిసార్ ని కొట్టే డైరెక్ట‌ర్ లేరు అన‌డంలో అతిశ‌యోక్తి లేదు. అత‌నికి రెహ‌మాన్ తోడైతే? ఇంకెలా ఉంటుందో చెప్పాల్సిన ప‌నిలేదు. ఇంజి వెల్లంకు కి కూడా రెహ‌మాన్ సంగీతం అందించ‌డంతో? సినిమాపై అంచనాలు తారా స్థాయికి చేరుతున్నాయి. ఇద్ద‌రి కాంబినేష‌న్ లో సినిమా అంటే? అది ప‌క్కా మ్యూజికల్ హిట్ అనే న‌మ్మ‌కం ప్రేక్ష‌కుల్లో బ‌లంగా ఉంటుంది.

విజయ్ సేతుపతి ఇంటెన్సిటీ- సాయి పల్లవి అభినయం కలగలిస్తే తెరపై మ్యాజిక్ ఏ స్థాయిలో ఉంటుందోఊహే అసాధ్యం. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన రొమాంటిక్ లవ్‌స్టోరీలో ఇద్ద‌రి కెమిస్ట్రీ సినిమాకే ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తుంద‌ని పోస్ట‌ర్ చెప్ప‌క‌నే చెబుతుంది. మ‌ణిర‌త్నం గ‌త సినిమా `థ‌గ్ లైఫ్` భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైనా ఆశించిన ఫ‌లితాన్నివ్వ‌ని సంగ‌తి తెలిసిందే. ఈ క‌థ మ‌ణి పాత సినిమా ఫార్మెట్ లో క‌నిపించ‌డం సినిమాకు క‌లిసి రాలేదు. ఈ నేప‌థ్యంలో ఇంజి వెల్లంతో మ‌ణిసార్ బౌన్స్ బ్యాక్ అవుతార‌ని అభిమానులు ఆశీస్తున్నారు.

Tags:    
  • maniratnam 
  • injivellam 
  • vijaysethupathi 
  • saipallavi 
  • arrahman 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS