సౌత్ హీరోయిన్స్ పై దృష్టి పెడుతున్న బాలీవుడ్.. అసలు ఏమైందంటే?

సాధారణంగా ఒక సినిమాను తెరకెక్కించేటప్పుడు అందులో లీడింగ్ యాక్టర్స్ ను తీసుకోవడానికి చిత్ర బృందం ప్రయత్నిస్తుంది.;

Update: 2026-02-04 10:30 GMT

సాధారణంగా ఒక సినిమాను తెరకెక్కించేటప్పుడు అందులో లీడింగ్ యాక్టర్స్ ను తీసుకోవడానికి చిత్ర బృందం ప్రయత్నిస్తుంది..ముఖ్యంగా ఒక భాషలో సినిమా చేస్తున్నప్పుడు ఆయా భాషలలో భారీ పాపులారిటీ సంపాదించుకున్న హీరో హీరోయిన్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అయితే ఏమైందో తెలియదు కానీ గత కొంతకాలంగా బాలీవుడ్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్లుగా చలామణి అవుతున్న హీరోయిన్స్ ఈమధ్య కాలంలో బాక్సాఫీస్ వద్ద తమ నటనతో మెప్పించలేకపోతూ ఉండడం గమనార్హం . ఈ నేపథ్యంలోని ఇప్పుడు బాలీవుడ్ దృష్టి మొత్తం సౌత్ హీరోయిన్లపై పడటం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

సౌత్ హీరోయిన్స్ పై కన్నేసిన బాలీవుడ్..

ముఖ్యంగా బాలీవుడ్ సినీ పరిశ్రమలో భారీ ప్రాజెక్టుల కోసం సౌత్ హీరోయిన్స్ ని ఎంపిక చేసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఉదాహరణకు ఇండియన్ బాక్సాఫీస్ చరిత్రలోనే సుమారుగా 4000 వేల కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న హిందీ 'రామాయణం' సినిమాలో సౌత్ హీరోయిన్ అయిన లేడీ పవర్ స్టార్ సాయి పల్లవిని సీత పాత్ర కోసం ఎంపిక చేసుకున్నారు. దీనికి తోడు ఇటీవల స్పై థ్రిల్లర్ మూవీ 'ధురంధర్' లో కూడా సౌత్ బ్యూటీ సారా అర్జున్ ను హీరోయిన్గా ఎంపిక చేసుకున్నారు. ఈ సినిమా 1300 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేయడమే కాకుండా ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది.

దీనికి తోడు ఇప్పటికే బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ కురిపించిన ఛావా, యానిమల్ వంటి చిత్రాలలో కూడా సౌత్ హీరోయిన్ రష్మిక మందన్న నటించడం గమనార్హం. అయితే ఇప్పుడు మరోసారి బాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో సౌత్ హీరోయిన్లను పరిశీలిస్తూ ఉండడం సంచలనంగా మారింది. విషయంలోకి వెళ్తే.. గత ఏడాది డిసెంబర్ 5న ధురంధర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న రణవీర్ సింగ్ ఇప్పుడు తన తదుపరి ప్రాజెక్టు 'ప్రలే' కోసం సిద్ధమవుతున్నారు. ఇది కూడా భారీ బడ్జెట్ తో లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కబోతోంది

ముఖ్యంగా ఈ సినిమాలో మహిళా ప్రధాన పాత్ర చిత్రానికే హైలైట్ గా నిలవనుందని సమాచారం. అయితే ఇప్పుడు తాజాగా బాలీవుడ్ పరిశ్రమ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం..ఈ ప్రలే సినిమా కోసం కూడా ఇప్పుడు సౌత్ హీరోయిన్స్ ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే కాంతార చాప్టర్ 1 సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న రుక్మిణి వసంత్ తో పాటు భాగ్యశ్రీ బోర్సే పేర్లను పరిశీలిస్తున్నారట. ముఖ్యంగా ఈ ఇద్దరిలో ఎవరో ఒకరిని ఫైనల్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే రుక్మిణి వసంత్ ప్రస్తుతం ఎన్టీఆర్ , ప్రశాంత్ నీళ్ కాంబినేషన్లో వస్తున్న డ్రాగన్ సినిమాతో పాటూ కన్నడ హీరో యష్ నటిస్తున్న టాక్సిక్ సినిమాలో కూడా హీరోయిన్గా నటిస్తోంది.. అలా ఈమె వరుస సినిమాలతో బిజీగా ఉన్న నేపథ్యంలో తన డేట్స్ ను ప్రలే కోసం ఉపయోగిస్తుందా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది. మరోవైపు భాగ్యశ్రీ బోర్సే చివరిగా ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాతో ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు ఆమె ఖాతాలు మరో పెద్ద ప్రాజెక్టు అయితే ఏదీ కనిపించడం లేదు. అయితే మరి ఇద్దరిలో ఎవరిని ఎంపిక చేసుకుంటారు అన్నది మరికొద్ది రోజుల్లో తేలనుంది.

Tags:    

Similar News