చై బ‌ర్త్ డేని సామ్ అలా జామ్ చేశార‌న్న‌మాట‌!

Update: 2020-11-24 03:30 GMT
ప్ర‌స్తుతం చై-సామ్ జంట మాల్దీవుల విహారంలో చిలౌట్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. చైత‌న్య‌ పుట్టినరోజు సందర్భంగా సమంతా రూత్ ప్రభు ఇంత గ్రాండ్ గా ప్లాన్ చేశార‌ట‌. జంట‌ల‌న్నీ మాల్దీవుల సెల‌బ్రేష‌న్ లో బిజీ బీజీ. కాజ‌ల్ - కిచ్లు జోడీ సెల‌బ్రేష‌న్ త‌ర్వాత చై-సామ్ జంట బీచ్ పార్టీ ప్ర‌ముఖంగా చ‌ర్చ‌కు వ‌చ్చింది.

నాగ చైతన్యకు సోమవారం నాటికి 34 ఏళ్లు. అత‌డి స్పెష‌ల్ డేని స‌తీమ‌ణి సమంతా రూత్ ప్రభు  గ్రాండ్ గా ప్లాన్ చేశారు. ఇప్పుడు వెకేషన్ డైరీ పేరుతో బీచ్ సెల‌బ్రేష‌న్ ఫోటోల‌ను అభిమానుల‌కు షేర్ చేశారు. దానితో పాటు చ‌క్క‌ని నోట్ రాశారు సామ్.  నాగ చైతన్య ప్రస్తుతం బస చేసిన‌ రిసార్ట్ ప‌రిస‌రాల్లో నడుస్తున్న ఫోటోని తాజాగా షేర్ చేశారు. ``చై మీ స్వీయ‌నిబంధనల ప్రకారం ఎల్లప్పుడూ జీవించండి.. మీ ఆనందాన్ని మాత్రమే నేను కోరుకుంటున్నాను`` అని సమంత రూత్ ప్రభు వ్యాఖ్య‌ను జోడించింది. సమంత స్కూబా డైవింగ్ ఫోటోలు ఇంత‌కుముందు వైర‌ల్ అయ్యాయి.

సమంతా రూత్ ప్రభు 2017 లో నాగ చైతన్యను వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ కలిసి  ఏ మాయ చేశావే-మనం- ఆటోనగర్ సూర్య- మ‌జిలీ చిత్రాల్లో న‌టించారు. ఏ మాయా చేసావ్ 2010 లో విడుదలైంది. సమంతా రూత్ ప్రభు తదుపరి తమిళ చిత్రం కాతువాకుల రందు కాదల్ లో కనిపించనున్నారు. ఆమె మనోజ్ బాజ్ పేయి తో క‌లిసి వెబ్-సిరీస్ `ది ఫ్యామిలీ మ్యాన్` రెండవ సీజన్ లో న‌టిస్తోంది. నాగ చైతన్య ప్ర‌స్తుతం `లవ్ స్టోరి` అనే చిత్రంలో న‌టిస్తున్నారు.
Tags:    

Similar News