వీడియో : జనాలు మరీ అంత పిచ్చోళ్ళుగా కనిపిస్తున్నారా?

'ధురంధర్‌' సూపర్‌ హిట్‌తో ఎక్కడ చూసినా ఆ సినిమా గురించిన ముచ్చట్లు వినిపిస్తున్నాయి.;

Update: 2026-04-23 11:07 GMT

'ధురంధర్‌' సూపర్‌ హిట్‌తో ఎక్కడ చూసినా ఆ సినిమా గురించిన ముచ్చట్లు వినిపిస్తున్నాయి. సినిమా ఏ స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకుందో అదే స్థాయిలో పాటలు సైతం భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. రెండు పార్ట్‌ల్లోనూ పాటలు చాట్‌ బస్టర్స్‌గా నిలిచాయి. ముఖ్యంగా ధురంధర్‌ 2 సినిమాలోని షరారత్‌ పాట ఓ రేంజ్‌లో సోషల్‌ మీడియాను షేక్ చేస్తున్న విషయం తెల్సిందే. ఈ మధ్య కాలంలో ఏ కార్యక్రమంలో అయినా షరారత్ పాటతో పాటు ధురంధర్‌ సినిమాలోని మరికొన్ని పాటలు కూడా వినిపిస్తున్నాయి. ఈ స్థాయిలో ధురంధర్‌ పాటలు విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఆ పాటలను పాడిన సింగర్‌ జాస్మిన్‌ సాండ్లస్‌ సైతం ఫేమస్‌ అయ్యింది. గతంలో ఈమెకు పెద్దగా పాపులారిటీ లేదు. కానీ ధురంధర్‌ సాంగ్స్ సింగర్‌ అనే ట్యాగ్‌ లైన్‌ లభించడంతో ఒక్కసారిగా పాపులారిటీని సొంతం చేసుకుంది.

ధురంధర్‌ సింగర్‌ వీడియో వైరల్‌...

సినిమాతో పాటు పాటలు సూపర్‌ హిట్‌ కావడంతో జాస్మిన్‌ సాండ్లాస్‌ ఓవర్‌ నైట్‌ స్టార్‌ సింగర్‌ అయ్యింది. ఆమె ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్‌ లైవ్‌ షో లు చేస్తూ, మ్యూజిక్‌ కన్సర్ట్‌లు చేస్తోంది. ప్రతి కన్సర్ట్‌లోనూ ధురంధర్‌ సాంగ్స్‌ను పాడటం ద్వారా ప్రేక్షకులను మరింతగా ఉర్రూతలూగిస్తూ ఉంది. సాధారణంగా సింగర్స్‌ తాము పాడిన పాటలను స్టేజ్‌ పై మళ్లీ పాడుతూ ప్రేక్షకులను రంజింపజేస్తారు. అయితే జాస్మాన్‌ మాత్రం తన పాటలను తాను స్టేజ్‌ పై లైవ్‌ పెర్ఫార్మెన్స్‌ ఇస్తానంటూ యాక్టింగ్‌ చేసింది. లైవ్‌ సింగింగ్‌ అని చెప్పి లైవ్‌ యాక్టింగ్‌ చేసింది. ప్రస్తుతం ఈ విషయమై సోషల్‌ మీడియాలో ఓ రేంజ్‌లో ట్రోల్స్‌ వస్తున్నాయి. జాస్మిన్‌ ను ఉద్దేశించి జనాలు ఓ రేంజ్‌లో కౌంటర్‌లు ఇస్తున్నారు. ముఖ్యంగా జనాలను మరీ అంత పిచ్చొల్లుగా అనుకుంటున్నావా అంటూ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఆమెను టార్గెట్‌ చేసి కామెంట్స్ చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు.

సింగర్ జాస్మిన్‌ సాండ్లాస్‌...

అహ్మదాబాద్‌లో జరిగిన లైవ్ కాన్సర్ట్‌లో సింగర్‌ జాస్మిన్‌ పాల్గొంది. అక్కడ అభిమానులను, ప్రేక్షకులను ఉత్సాహపరుస్తూ పాటలు పాడింది. ధురంధర్‌ పాట వచ్చినప్పుడు ఆమె చేసిన హంగామా వివాదాస్పదం అయ్యింది. బాటిల్‌ నీళ్లు తీసుకుని తలపై పోసుకుంటూ పాటకు లిప్‌ సింక్‌ చేస్తూ డాన్స్‌ రాకున్నా వేసేందుకు ప్రయత్నిస్తూ తెగ హడావిడి చేసింది. పాట బ్యాక్‌ గ్రౌండ్‌లో వస్తూ ఉంటే అప్పుడప్పుడు లిప్‌ సింక్ చేసింది. కొన్ని సార్లు ఆ లిప్‌ సింక్‌ సైతం కాలేదు. మొత్తానికి జాస్మిన్‌ ఆ పాటను లైవ్‌ లో పాడినట్లుగా కవర్‌ చేసింది. కానీ అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చూసినప్పుడు మాత్రం కచ్చితంగా జాస్మిన్‌ పాట పాడలేదు, కేవలం లిప్ సింక్ చేసేందుకు ప్రయత్నించింది. ఆ యాక్టింగ్‌ కూడా వర్కౌట్‌ కాలేదు అంటూ చాలా మంది ట్రోల్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో వీడియోలు షేర్‌ చేస్తున్నారు.

షరారత్‌, మై ఔర్‌ తూ పాటలు...

ధురంధర్‌ సినిమాలో షరారత్‌, మై ఔర్‌ తూ పాటలను పాడిన జాస్మిన్‌కి మంచి క్రేజ్‌ వచ్చింది. ఆమె తనకు ఉన్న మంచి పేరును ఇలా యాక్టింగ్‌ చేసి చెడగొట్టుకోవద్దు అంటూ పలువురు సూచిస్తున్నారు. ఇలాంటి లైవ్‌ యాక్టింగ్‌లను మానుకోవాలని, పాట పూర్తి స్థాయిలో వస్తే పాడలి తప్ప బ్యాక్‌ గ్రౌండ్‌ పాటలకు లిప్‌ సింక్‌ ఇచ్చే విధానం మార్చుకోవాలి అంటూ సూచిస్తున్నారు. జాస్మిన్‌ సాండ్లాస్‌ మాత్రమే కాకుండా ఇంతకు ముందు కూడా చాలా మంది సింగర్స్‌ ఇలాగే బుక్ అయ్యారు. తెలుగు సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోనూ ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఒక స్టార్‌ హీరో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోనూ ప్రముఖ గాయిని ఇలాగే లిప్ సింక్ చేసి లైవ్‌ చూసిన వారిని బురిడి కొట్టించే ప్రయత్నం చేసింది. చివరకు ఆమె లిప్‌ సింక్‌ చేసిందని తెలిసి అంతా విమర్శలు చేశారు.




Tags:    

Similar News