సూప‌ర్ స్టార్ తో ఛాన్స్ వ‌చ్చినా? అన్న‌తో క‌న్ప‌ర్మేష‌న్!

ఇండియన్ సినిమా హిస్టరీలో రికార్డులను తిరగరాసిన `జైలర్` చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన `జైలర్ 2` ఇటీవ‌లే విడుద‌లై వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తోంది.

Update: 2026-10-23 22:30 GMT

ఇండియన్ సినిమా హిస్టరీలో రికార్డులను తిరగరాసిన `జైలర్` చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన `జైలర్ 2` ఇటీవ‌లే విడుద‌లై వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తోంది. ఇలాంటి సినిమాలో నటించే అవకాశం రావడం ఏ నటికైనా అరుదైన మైలు రాయి అనడంలో సందేహం లేదు. సూపర్ స్టార్ రజనీకాంత్ కాంబినేషన్‌లో నటించే అద్భుతమైన అవకాశం తలుపు తట్టినా? కన్నడ నటి మేఘనా రాజ్ సర్జా మాత్రం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోకుండా తన కుటుంబంలో ఎంతో గౌరవించే పెద్ద దిక్కును సంప్రదించిన తీరు ఆక‌ట్టుకుంటుంది.

సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన ఈ సీక్వెల్‌లో పవర్‌ఫుల్ పాత్ర కోసం మేఘనా రాజ్‌ను మేకర్స్ సంప్ర దించినప్పుడు ఆమె ఎంతో సంతోషించారు. అయినా? దివంగత భర్త చిరంజీవి సర్జా కుటుంబానికి అత్యంత ఆప్తుడు, కన్నడ ఇండస్ట్రీలో అందరూ గౌరవంగా `శివణ్ణ` అని పిలుచుకునే హాట్రిక్ హీరో శివ రాజ్ కుమార్‌ను కలిసి ఈ ప్రాజెక్ట్ గురించి చర్చించారు. శివ రాజ్ కుమార్ అనుమతి .. ఆయన ఇచ్చిన ఆమోదంతోనే మేఘన ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

చిరంజీవి సర్జా అకాల మరణం తర్వాత మేఘనా రాజ్ జీవితంలో ఎదుర్కొన్న ఒడిదుడుకుల్లో శివ రాజ్ కుమార్ కుటుంబం ఓ పెద్ద దిక్కుగా నిలిచి సపోర్ట్ చేస్తూ వస్తోంది. `జైలర్` మొదటి భాగంలో శివ రాజ్ కుమార్ చేసిన `నరసింహ` పాత్ర ఏ స్థాయి సంచలనం సృష్టించిందో తెలిసిందే. రజనీకాంత్, శివ‌న్న‌ల‌ బంధం మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా కూడా శివరాజ్ కుమార్‌ను సొంత అన్నగా భావించే మేఘన ఈ పాత్ర ప్రాముఖ్యత .. సినిమా బ్యాక్‌డ్రాప్ గురించి ఆయనతో చర్చించి క్లారిటీ తీసుకున్నాకే తుది నిర్ణయానికి వచ్చారు.

ఈ పరిణామం వెనుక ఉన్న బంధం, బాధ్యత చిత్ర పరిశ్రమలో అందరినీ ఆకట్టుకుంటోంది. సాధారణంగా ఇన్ని భారీ కలెక్షన్ల రికార్డులున్న పాన్-ఇండియా ప్రాజెక్ట్ అనౌన్స్ కాగానే ఏ నటి అయినా వెంటనే సంతకం చేయడానికి ఆసక్తి చూపుతారు. కానీ మేఘనా రాజ్ జీవితంలో శివ రాజ్ కుమార్‌కు ఇస్తున్న ప్రాధాన్యతను, కుటుంబ అనుబంధాలకు ఆమె ఇచ్చే విలువను ఈ సంఘటన మరోసారి నిరూపించింది. మేఘన నిర్ణయాన్ని పూర్తిగా సమర్థించిన శివ‌న్న‌ ఆమెను ఆశీర్వదించి ముందుకు వెళ్లమని ధైర్యాన్ని ఇచ్చారు.

మొత్తానికి సూపర్‌స్టార్ చిత్రంలో ఛాన్స్ వచ్చినా సొంత `అన్న` లాంటి శివ రాజ్ కుమార్‌తో చర్చించి.. ఆయన కన్ఫర్మేషన్‌తో `జైలర్ 2`కి ఓకే చెప్పడం మేఘనా రాజ్ పద్ధతికి.. ఆ కుటుంబం మధ్య ఉన్న బలమైన బంధానికి నిదర్శనంగా నిలిచింది.

Tags:    

Similar News