బాలీవుడ్, టాలీవుడ్ నెల్సన్ ఓటు ఎవరి వైపు...

సక్సెస్ ఫుల్ డైరెక్టర్లతో పనిచేయడానికి స్టార్ హీరోలు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు.

Update: 2026-10-23 16:30 GMT

సక్సెస్ ఫుల్ డైరెక్టర్లతో పనిచేయడానికి స్టార్ హీరోలు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. కారణమేంటంటే ఆ దర్శకులు చేసే సినిమాలకు ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ లభిస్తుంది. కాబట్టి ఆ క్రేజ్ ని వాడుకొని సక్సెస్ ను సాధించాలని స్టార్ హీరోలు భావిస్తుంటారు. ఇక ఈ క్రమంలోనే తమిళ్ సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా కెరియర్ ను మొదలుపెట్టిన 'నెల్సన్ దిలీప్ కుమార్' ప్రస్తుతం ఇండియా వైడ్ గా తన సత్తా చాటుతున్నాడు. జైలర్ మొదటి పార్ట్ తో ప్రేక్షకులను అలరించిన ఆయన రీసెంట్ గా రిలీజైన 'జైలర్ 2' తో మరోసారి తన సత్తా చాటుకున్నాడు.

బాలీవుడ్, టాలీవుడ్ ఎవరితో సినిమా

ప్రస్తుతం నెల్సన్ ముందు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి టాలీవుడ్ స్టార్ హీరో తో సినిమా చేస్తాడా? లేదంటే బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేయడానికి అక్కడున్న స్టార్ హీరోలతో జత కడతాడా? అనేది తెలియాల్సి ఉంది. 'జైలర్ 2' సినిమాలో క్యామియో రోల్ లో కనిపించిన హృతిక్ రోషన్ తో సినిమా చేయబోతున్నాడా అనే వార్తలు బాలీవుడ్ మీడియాలో వినిపిస్తున్నాయి. జైలర్ 2 మూవీ చేసేటప్పుడు హృతిక్ రోషన్, నెల్సన్ మధ్య మంచి ఫ్రెండ్షిప్ కుదిరిందట. దాంతో వీళ్ళిద్దరి కాంబోలో సినిమా రాబోతుదంటూ కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. వీళ్ళిద్దరు కలిసి సినిమా వస్తే ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసే సినిమా అవుతుందని ఇప్పటికే కొంతమంది సినీ విశ్లేషకులు సైతం వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు... టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయబోతున్నాడు అంటూ గతంలో కొన్ని వార్తలు వచ్చాయి. కానీ అవి కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు నెల్సన్ డైరెక్షన్లో నటించడానికి మరికొంతమంది టైర్ వన్ హీరోలు సైతం ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది.

నెల్సన్ చూపు ఎటువైపు ఉంది. బాలీవుడ్ హీరోలు తన మేకింగ్ కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతారని భావిస్తున్నాడా? లేదంటే టాలీవుడ్ హీరోల క్రేజ్ ను వాడుకొని సినిమా చేసి ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేస్తాడా? చూడాలి. 'జైలర్ 2' సినిమాకి మంచి రెస్పాన్స్ రావడంతో పాన్ ఇండియాలో ఈ సినిమా గొప్ప క్రేజ్ ను సంతరించుకుంటుంది. దానికి తోడుగా రజనీకాంత్ తో ఒక ఫైటింగ్ సన్నివేశం లేకుండా సినిమాలోని ఎమోషన్స్ ను, ఎలివేషన్స్ ను పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేసిన నెల్సన్ మీద ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ పెరిగిపోయింది. రజినీకాంత్ అభిమానులైతే ఈ సినిమాని రిపీటెడ్ గా చూస్తున్నారు. మొత్తానికైతే రజినీకాంత్ మరోసారి తన సత్తా చాటుకున్నాడనే చెప్పాలి. ఇక ఈ సినిమాతో సీనియర్ హీరోలందరికంటే రజనీకాంత్ ముందు వరుసలో దూసుకెళ్తున్నాడు. లాంగ్ రన్ లో ఈ మూవీ మరింత భారీ కలెక్షన్స్ ను వసూలు చేసే అవకాశం ఉంది...

Tags:    

Similar News