చందు మొండేటి - అక్షయ్ కుమార్.. షూటింగ్ ఎప్పుడంటే?

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.;

Update: 2026-04-23 12:30 GMT

టాలీవుడ్ దర్శకులు ఇప్పుడు బాలీవుడ్ బడా స్టార్లను డైరెక్ట్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. ‘కార్తికేయ 2’ సినిమాతో ఉత్తరాది ప్రేక్షకులకు చేరువైన చందు మొండేటి, ఇప్పుడు తన తదుపరి చిత్రాన్ని మరింత భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. ఉజ్జయిని పుణ్యక్షేత్రం నేపథ్యంలో సాగే ఒక మిస్టరీ థ్రిల్లర్ కథతో ఆయన సిద్ధమయ్యారు. ఈ ప్రాజెక్ట్ గురించి సోషల్ మీడియాలో ఇప్పటికే రకరకాల వార్తలు వినిపిస్తుండగా, లేటెస్ట్ గా అందుతున్న ఎక్స్‌క్లూజివ్ సమాచారం ప్రకారం ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లేందుకు ముహూర్తం ఖరారు అవుతోంది.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కథకు అవసరమైన లొకేషన్ల వేటతో పాటు, టెక్నికల్ టీమ్ ఎంపికలో చందు బిజీగా ఉన్నారు. ఈ పనులన్నీ పూర్తయిన వెంటనే హీరోల కాల్ షీట్స్ ను బట్టి షూటింగ్ డేట్స్ ఫిక్స్ చేయనున్నారు. అక్షయ్ కుమార్, రానా దగ్గుబాటి తమ డేట్స్ అడ్జస్ట్ చేసిన వెంటనే ఈ భారీ హిస్టారికల్ థ్రిల్లర్ పట్టాలెక్కబోతోంది. సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం, వీలైనంత త్వరగా కెమెరా ముందుకు వెళ్లాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

కరణ్ జోహార్ కు చెందిన ధర్మా ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తుండటంతో ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదు. ఉజ్జయినిలోని చారిత్రక కట్టడాలు, అక్కడి రహస్యాల చుట్టూ తిరిగే ఈ కథ కోసం భారీ సెట్లను కూడా నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. అక్షయ్ కుమార్ కు ఇలాంటి అడ్వెంచర్ థ్రిల్లర్స్ కొత్తేమీ కాకపోయినా, చందు మొండేటి మార్క్ ట్రీట్‌మెంట్ ఎలా ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రానా పాత్ర కూడా సినిమాలో చాలా కీలకంగా ఉంటుందని సమాచారం.

సాధారణంగా చందు మొండేటి సినిమాల్లో ఫాంటసీ లాజిక్ కలిసిన ఒక కొత్త ప్రపంచం కనిపిస్తుంది. ‘కార్తికేయ 2’లో కృష్ణతత్వాన్ని చూపించిన ఆయన, ఈసారి ఉజ్జయిని నేపథ్యంలో ఎలాంటి మిస్టరీని రివీల్ చేస్తారోనని ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. బడ్జెట్ పరంగా కూడా ఇది చందు కెరీర్ లోనే బిగ్గెస్ట్ మూవీ కానుంది. పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం కోసం బాలీవుడ్ లోనూ గట్టిగానే ప్రమోషన్లు ప్లాన్ చేస్తున్నారు.

చందు మొండేటి ఈసారి ఒక పక్కా ప్లానింగ్ తో బరిలోకి దిగుతున్నారు. షూటింగ్ ప్రారంభానికి ముందే ప్రతి విషయాన్ని పక్కాగా సెట్ చేసుకుంటున్నారు. భారీ తారాగణం ఉండటంతో అందరి డేట్స్ ఒకేసారి కుదరడం ముఖ్యం కాబట్టి, ఆ దిశగానే కసరత్తులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌పై ఒక అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉంది.

Tags:    

Similar News