మహేష్ లైన్ లో సందీప్..బుచ్చిబాబు!
సూపర్ స్టార్ మహేష్ కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రాజమౌళి దర్శకత్వంలో 'వారణాసి' తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. గ్లోబల్ స్థాయిలో భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న సినిమాపై పాన్ ఇండియాలో భారీ అంచనాలు ఉన్నాయి.
సూపర్ స్టార్ మహేష్ కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రాజమౌళి దర్శకత్వంలో 'వారణాసి' తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. గ్లోబల్ స్థాయిలో భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న సినిమాపై పాన్ ఇండియాలో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే చిత్రీకరణ దాదాపు ముగింపు దశకు చేరుకుంది. ఇంకా 80 రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. అనంతరం మహేష్ 'వారణాసి'ని నుంచి రిలీవ్ అయిపోతారు. ఈ నేపథ్యంలో మహేష్ తదుపరి సినిమా ఏ డైరెక్టర్ తో చేస్తారు? అన్నది సర్వాత్రా ఆసక్తి నెలకొంది. రాజమౌళి ప్రాజెక్ట్ తర్వాత మహేష్ లైనప్ ఎలా ఉండబోతుందనే ఆసక్తి నటుడి అభిమానులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ నెలకొంది.
ఈ రేసులో ప్రముఖ దర్శకులు సందీప్ రెడ్డి వంగా, బుచ్చిబాబు సానా పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఇద్దరు టాప్ డైరెక్టర్లతో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం రావడంతో క్రేజీ కాంబినేషన్లపై ఇండస్ట్రీలో రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ట్రెండ్ సెట్టింగ్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న సందీప్ రెడ్డి వంగాతో మహేష్ తో సినిమా ఉండొచ్చనే వార్తలు సోషల్ మీడియాలో అవుతున్నాయి. `యానిమల్` వంటి సంచలన చిత్రం తర్వాత సందీప్ ప్రస్తుతం ప్రభాస్‌తో `స్పిరిట్` సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ ప్రాజెక్ట్ పూర్తయిన వెంటనే మహేష్ తో సినిమా చేసేందుకు ఆయన కథా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
ఇద్దరి కలయిక కుదిరితే బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయం. మరోవైపు `ఉప్పెన` చిత్రంతోనే జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన బుచ్చిబాబు సానా పేరు కూడా బలంగా వినిపిస్తోంది. ఇటీవలే రామ్ చరణ్ కు పెద్దితో పాన్ ఇండియా విజయాన్ని అందించిన నేపత్యంలో బుచ్చి పేరు పరిశ్రమలో మారు మ్రోగిపోతుంది. ఈ నేపథ్యంలో బుచ్చిబాబు తదుపరి మహేష్ కోసం సీరియస్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. మహేష్ కు సరిపోయే బలమైన కథను బుచ్చిబాబు సిద్ధం చేస్తున్నారని.. త్వరలోనే దీనికి సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
బుచ్చిబాబు రెండవ సినిమాతోనే ఏకంగా రామ్ చరణ్ నే డైరెక్ట్ చేసి మెప్పించిన నేపథ్యంలో మహేష్ ని ఒప్పించడం పెద్ద కష్టం కాదు. పైగా బుచ్చి బాబు కథల్లో మట్టివాసన ఉంటుంది. స్టోరీల పరంగా నేల విడిచి సాము చేయడు. తీసిన రెండు సినిమాలు కూడా మంచి ఫలితాలు సాధించాయి. ఈ నేపథ్యంలో మహేష్ బుచ్చి కి నో చెప్పడం అంత సులభం కాదు. మొత్తానికి `వారాణాసి` విడుదల తర్వాత మహేష్ ఏ దర్శకుడితో సెట్స్ పైకి వెళ్తారు అనేది ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. సందీప్ రెడ్డి వంగా -బుచ్చిబాబు సానా ఇద్దరూ రేసులో ఉండటంతో అభిమానులలో అంచనాలు తారాస్థాయికి చేరుతున్నాయి. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం లేకపోలేదు.