ఆ స్టార్ డైరెక్టర్ తో మూవీస్ చేయకపోయిన టాప్ హీరోలుగా ఎదిగిన నటులు వీళ్లే...
అయినప్పటికి వాళ్ళిద్దరు స్టార్ హీరోలుగా వెలుగొందుతున్నారు. వాళ్ళను మినహాయిస్తే ఇప్పుడున్న టైర్ వన్ హీరోలందరు రాజమౌళితో సినిమాలు చేసిన వారే కావడం విశేషం.
ఏ నటుడైన స్టార్ హీరో అవ్వాలి అంటే సక్సెస్ ఒక్కటే టార్గెట్ గా పెట్టుకొని ముందుకు సాగాలి. ఎన్ని విజయాలు అందుకుంటే వాళ్ళు అంత పెద్ద హీరోగా మారతారు. టాప్ పొజిషన్ ను ఆక్యుపై చేయాలి అంటే అంత ఆషామాషీ వ్యవహారమైతే కాదు. కానీ వాళ్ళు కమిటైన సబ్జెక్టుల దగ్గర నుంచి దర్శకుడు ఆ సినిమాని ఎలా తీస్తున్నాడు అనే విషయాల పట్ల కూడా హీరోలు కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి. దర్శకుడి నిర్ణయాల్లో వేలు పెట్టకుండా తను ఏం చేస్తున్నాడు తన ఒపీనియన్ ఏంటి ఎలా చేస్తే బాగుంటుంది అనే విషయాలపట్ల ఎప్పటికప్పుడు చర్చలు జరపాలి.
అలా అన్నిరకాలుగా ప్రేక్షకులను అలరించే సినిమాను తీసుకొచ్చినప్పుడు మాత్రమే ఒక హీరో సక్సెస్ ని సాధిస్తాడు. ఇక దానికి తోడుగా కొంతమంది హీరోలు స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేసి సక్సెస్ లను అందుకుంటే మరి కొంతమంది టాప్ డైరెక్టర్ల తో అవసరం లేకుండానే బ్లాక్ బస్టర్ లను అందుకొని టాప్ పొజిషన్ కి చేరుకున్నారు... పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లాంటి నటులు రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ తో సినిమాలు చేయలేదు. అయినప్పటికి వాళ్ళిద్దరు స్టార్ హీరోలుగా వెలుగొందుతున్నారు. వాళ్ళను మినహాయిస్తే ఇప్పుడున్న టైర్ వన్ హీరోలందరు రాజమౌళితో సినిమాలు చేసిన వారే కావడం విశేషం.
మహేష్ బాబు ప్రస్తుతం 'వారణాసి' సినిమాతో రాజమౌళితో జత కడుతున్నాడు కాబట్టి ఆయన కూడా రాజమౌళి హీరోగా మారిపోయాడు... రాజమౌళి కి ఉన్న క్రేజ్ కి అతనితో ఏ హీరో సినిమా చేసినా కూడా అది ఈజీగా ఇండస్ట్రీ హిట్ ను అందుకుంటుందని జనాలు అనుకుంటున్నారు. అయితే రాజమౌళి మాత్రం సినిమాలో కంటెంట్ ఉంటేనే మూవీ ఆడుతుంది. లేకపోతే ఆడదని ఆయన మొదటి నుంచి చెప్తూనే ఉన్నాడు. దానికి తగ్గట్టుగానే ఆయన కష్టపడతాడు.
ఇక 'బాహుబలి 2' సినిమాతో 1800 కోట్లకు పైన కలెక్షన్స్ ని రాబట్టిన రాజమౌళి ఆ తర్వాత చేసిన 'త్రిబుల్ ఆర్' మూవీ తో కేవలం 1300 కోట్లు మాత్రమే కొల్లగొట్టాడు. రాజమౌళి సినిమా అయితే దానిమీద హైప్ ఉంటుందేమో కానీ థియేటర్ కి వచ్చిన ప్రేక్షకుడిని సాటిస్ఫై చేయకపోతే ఆయన సినిమాలు కూడా ఇండస్ట్రీ హిట్లను నమోదు చేయవు. ఈ మాత్రం తేడా కొట్టిన ఆయన సినిమాలు కూడా ఫ్లాప్ అవుతాయి అనే విషయాన్ని ఆయన ఎప్పటికప్పుడు గుర్తుంచుకుంటాడు.
కాబట్టే ఆడియన్ కి ఏం కావాలి మనం ఎలాంటి సినిమా తీసి వాడి ముందు పెట్టాలి అనే దానిమీద ఎప్పటికప్పుడు కసరత్తులు చేస్తూ ఉంటాడు... మొత్తానికైతే పవన్ కళ్యాణ్ రాజమౌళితో సినిమా చేయాల్సి వచ్చినప్పటికి అది అనుకోని కారణాలవల్ల మిస్సైంది. ఇక ఆ తర్వాత రాజమౌళితో ఆయన ఇంకెప్పుడు జతకట్టలేదు. అయిన కూడా పవన్ కళ్యాణ్ టాప్ హీరోల లిస్టులో చేరిపోవడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. రాజమౌళి గతంలో అల్లు అర్జున్ సినిమా చేయడానికి ఒకటి రెండు సార్లు కసరత్తులు చేశాడు. కానీ అది వర్కౌట్ కాలేదు...