బింజ్ లిస్ట్ రెడీ.. ఈ వారం OTTలో బెస్ట్ 3 సినిమాలు ఇవే..
అయితే ఇన్ని ఆప్షన్ల మధ్య ఏది చూడాలా అని కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే మీ కోసమే ఈ వారం ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడాల్సిన మోస్ట్ అవేటెడ్ బెస్ట్ 3 సినిమాల బింజ్ లిస్ట్ ఇక్కడ చూద్దాం..
ఈ వారాంతంలో డిజిటల్ ప్రియులకు అసలైన వినోదాల విందు సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జియో హాట్‌స్టార్ వంటి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో సెప్టెంబర్ 15 నుంచి 20 వరకు పదుల సంఖ్యలో కొత్త సినిమాలు, సిరీస్‌లు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. అయితే ఇన్ని ఆప్షన్ల మధ్య ఏది చూడాలా అని కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే మీ కోసమే ఈ వారం ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడాల్సిన మోస్ట్ అవేటెడ్ బెస్ట్ 3 సినిమాల బింజ్ లిస్ట్ ఇక్కడ చూద్దాం..
'ఇరుముడి' - నెట్‌ఫ్లిక్స్ ఈ వారం ఓటీటీలో సందడి చేయడానికి సిద్ధమైన మరో క్రేజీ అండ్ ఇంట్రెస్టింగ్ ఇండియన్ మల్టీలింగ్వల్ మూవీ 'ఇరుముడి'. సెప్టెంబర్ 18 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు హిందీ భాషల్లో కూడా ఈ చిత్రం నేరుగా డిజిటల్ ప్రేక్షకులను పలకరించనుంది. ఇక విభిన్నమైన కథాంశంతో వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది.
తొడక్కమ్ - జియో హాట్‌స్టార్ ఈ వారంలో అత్యంత ఆసక్తికరమైన రీజనల్ ప్రీమియర్లలో 'తొడక్కమ్' ఒకటి. మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్ కుమార్తె విస్మయ మోహన్‌లాల్ ఈ యాక్షన్-థ్రిల్లర్ సినిమాతోనే నటిగా ఎంట్రీ ఇస్తుండడం విశేషం. ఇక జూడ్ ఆంథోనీ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఒక యువతి చుట్టూ తిరుగుతుంది. ఇంటికి తిరిగివచ్చే క్రమంలో ఆమె అనూహ్యంగా మాయమవ్వడం, ఆ తర్వాత జరిగే సస్పెన్స్ సంఘటనలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. సెప్టెంబర్ 18 నుంచి జియో హాట్‌స్టార్‌లో తెలుగుతో పాటు మలయాళం, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది.
లస్ట్ స్టోరీస్ 3 - నెట్‌ఫ్లిక్స్ బోల్డ్ అండ్ విభిన్నమైన కాన్సెప్ట్‌లతో ఆడియన్స్‌ను ఆకట్టుకున్న పాపులర్ ఆంథాలజీ ఫ్రాంచైజ్ నుంచి వస్తున్న మూడో భాగం 'లస్ట్ స్టోరీస్ 3'. బాలీవుడ్ దిగ్గజ దర్శకులు విక్రమాదిత్య మొత్వానే, శకున్ బాత్రా, విశాల్ భరద్వాజ్, కిరణ్ రావులు నాలుగు విభిన్నమైన ప్రేమ, మోహం, మానవ సంబంధాల కోణాలను ఇందులో ఆవిష్కరించారు. విజయ్ వర్మ, రాధికా ఆప్టే, అదితి రావ్ హైదరీ వంటి నటీనటులు నటించిన ఈ మోస్ట్ అవేటెడ్ సిరీస్ సెప్టెంబర్ 18 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.
ఇతర సినిమాలు & సిరీస్‌లు:
ఈ వారం ఓటీటీలో మరికొన్ని ఆసక్తికరమైన సినిమాలు, సిరీస్‌లు కూడా అలరించబోతున్నాయి. ప్రైమ్ వీడియో రెంట్‌లో 'ది ఎండ్ ఆఫ్ ఓక్ స్ట్రీట్', 'ఫైండింగ్ ఎమిలీ', 'గేటర్ ఫేస్', ఇట్ ఎండ్స్, లయన్ ఫిస్ట్, 'నిమ్రోడ్స్', 'టోనీ', 'ది రైవల్స్ ఆఫ్ అమ్జియా కింగ్' అందుబాటులోకి రాగా, ప్రైమ్ వీడియోలో 'రీచర్' స్పిన్-ఆఫ్ సిరీస్ 'నీగ్లీ', తమిళ రొమాంటిక్ డ్రామా 'రామ్ అండ్ లీలా' స్ట్రీమ్ అవుతున్నాయి.
అలాగే నెట్‌ఫ్లిక్స్‌లో హారర్ డ్రామా సిన్నర్స్, మోన్‌స్టర్: ది లిజ్జీ బోర్డెన్ స్టోరీ, ది ఫిక్సర్స్, నాట్ ఎ స్ట్రేంజర్, ది స్కాండల్, స్ట్రేంజర్ థింగ్స్: టేల్స్ ఫ్రమ్ 85 సీజన్ 2, మోధ రాత్రి, స్టాప్! దట్! ట్రైన్!, బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ విడుదలకు సిద్ధమయ్యాయి. వీటితో పాటు జియో హాట్‌స్టార్‌లో హారర్ ఫిల్మ్ ,లీ క్రోనిన్స్ ది మమ్మీ, సన్ నెక్స్ట్‌లో తమిళ డ్రామా 'అంగీకారం', మరియు షడ్డర్ ప్లాట్‌ఫామ్‌లో 'గుడీ గుడీ' చిత్రాలు అలరించడానికి వస్తున్నాయి.
ఇక విభిన్నమైన జోనర్లు, వినోదాత్మక కథలతో ఈ వారం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు కళకళలాడుతున్నాయి. ప్రత్యేకించి 'తొడక్కమ్', 'లస్ట్ స్టోరీస్ 3', 'ఇరుముడి' వంటి చిత్రాలు ఓటీటీ ప్రియులకు సరికొత్త అనుభూతిని అందించడానికి సిద్ధమయ్యాయి. ఇక లేట్ చేయకుండా మీ ప్రాధాన్యతను బట్టి మీ ఫేవరెట్ మూవీని వాచ్‌లిస్ట్‌లో చేర్చుకుని ఈ వీకెండ్ బింజ్ వాచ్‌ను ఎంజాయ్ చేయండి.