• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'వార‌ణాసి' త‌ర్వాత మ‌హేష్...

'వార‌ణాసి' త‌ర్వాత మ‌హేష్ బాలీవుడ్ క్రేజ్!

| దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న అడ్వెంచర్ డ్రామా `వారణాసి`.

By - Srikanth Kontham
Update: 2026-09-17 15:30 GMT

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న అడ్వెంచర్ డ్రామా `వారణాసి`. ఈ భారీ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన తర్వాత బాలీవుడ్ లో మహేష్ క్రేజ్ ఊహించని రీతిలో కొత్త శిఖరాలను తాకడం ఖాయం. ఇప్పటి వరకు తెలుగు చిత్రసీమకే పరిమితమైన మహేష్ ఇమేజ్ పాన్-వరల్డ్ ప్రాజెక్ట్‌తో ఉత్తరాది మార్కెట్‌లో తిరుగులేని పాన్-ఇండియా సూపర్‌స్టార్‌గా అవతరించడానికి అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయి.

రాజమౌళి రూపొందించిన `బాహుబలి`, `ఆర్ఆర్ఆర్` చిత్రాలు హిందీ బెల్ట్‌లో ఎలాంటి విధ్వంసం సృష్టించాయో తెలిసిందే. దీంతో ప్ర‌భాస్, రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ లు పాన్ ఇండియాకి రీచ్ అచ్యారు. అలా జ‌క్క‌న్న‌ ప్రతి సినిమా కథానాయకుడి మార్కెట్‌ను పదిరెట్లు పెంచుతుంది. తాజాగా `వారణాసి` తో రాజమౌళి, మహేష్ లోని అసాధారణ నటన, స్క్రీన్ ప్రెజెన్స్, అడ్వెంచరస్ యాక్షన్ సీక్వెన్సులను ఉత్తరాది ప్రేక్షకులకు సరికొత్త కోణంలో పరిచయం చేయబోతున్నారు. రాజమౌళి అద్భుతమైన విజన్‌కు మహేష్ ఛార్మింగ్ పెర్ఫార్మెన్స్ తోడైతే బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు నమోదవడం ఖాయం.

మహేష్ కు హిందీ బెల్ట్‌లో ఇప్పటికే భారీ స్థాయిలో అభిమానులు ఉన్నారు. ఆయన నటించిన చిత్రాల హిందీ డబ్బింగ్ వెర్షన్లు యూట్యూబ్, టెలివిజన్‌లలో మిలియన్ల కొద్దీ వ్యూస్‌ సాధించి ఉత్తరాది ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యాయి. `వారణాసి` సక్సెస్‌తో ఆ క్రేజ్ నేరుగా థియేట్రికల్ మార్కెట్‌గా మారనుంది. మహేష్‌కున్న గ్లామర్, మాస్ , క్లాస్ ప్రేక్షకులను ఏకకాలంలో ఆకట్టుకునే ఇమేజ్ ఆయన్ని బాలీవుడ్ అగ్ర హీరోలతో సమానమైన స్థాయిలో కూర్చోబెడుతుంది.

`వారణాసి` విజయం తదనంతరం బాలీవుడ్‌లో మహేష్ బిజినెస్ పొటెన్షియల్ అమాంతం పెరుగుతుంది. ఉత్తరాది పంపిణీదారులు, మల్టీప్లెక్స్ చెయిన్స్ , మ‌హేష్‌ తదుపరి చిత్రాల హిందీ థియేట్రికల్ హక్కుల కోసం భారీ మొత్తాలు వెచ్చించేందుకు పోటీపడతారు. హిందీ బెల్ట్‌లో సునాయాసంగా వందల కోట్ల వసూళ్లను సాధించే సత్తా మ‌హేష్‌కు సొంతమవుతుంది. దీంతో బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థలు కూడా మహేష్‌తో నేరుగా హిందీ లేదా బహుభాషా చిత్రాలను నిర్మించడానికి క్యూ క‌ట్టే అవ‌కాశం ఉంది.

హిందీ విపణిలో మహేష్ క్రేజ్ పెరగడం కేవలం సినిమాలకే పరిమితం కాకుండా కార్పొరేట్ బ్రాండ్ ఎండోర్స్ మెంట్స్ రంగంలోనూ సంచలనం సృష్టిస్తుంది. భారతదేశపు అగ్రగామి నేషనల్, ఇంటర్నేషనల్ బ్రాండ్లకు మహేష్ ఫస్ట్ ఛాయిస్‌గా మారుతారు. ఇప్పటికే పలు ప్రముఖ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న మ‌హేష్ `వారణాసి` తర్వాత నేషనల్ లెవల్‌లో యాడ్స్ ప్రపంచాన్ని ఏలే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది ఉత్తరాది పాప్ కల్చర్‌లో మ‌హేష్‌ ముద్రను మరింత బలపరుస్తుంది.

ముగింపుగా చెప్పాలంటే `వారణాసి` మహేష్ కెరీర్‌లోనే కాదు. బాలీవుడ్‌లో ఆయన స్థానాన్ని పూర్తిగా మార్చేసే గేమ్ ఛేంజర్. ఉత్తరాది ప్రేక్షకులు కోరుకునే ఆకర్షణీయమైన రూపం, అద్భుతమైన నటన, భారీ యాక్షన్ ఎలిమెంట్స్ మహేష్ సొంతం కావడం వల్ల `వారణాసి` తర్వాత బాలీవుడ్‌లో తిరుగులేని పవర్ హౌస్‌గా నిలుస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రభాస్, ఎన్టీఆర్, బ‌న్నీ, రామ్ చరణ్ సరసన మహేష్ కూడా హిందీ బాక్సాఫీస్‌ను శాసించే స్థాయికి ఎదగడం ఖాయం.

Tags:    
  • maheshbabu 
  • varanasi 
  • ssrajamouli 
  • panindiamovie 
  • bollywood 

Similar News

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

గోవా నైట్‌లో దివి అందాల సందడి.. స్టైల్‌కు ఫ్యాన్స్ ఫిదా!

2026-11-03 09:35 GMT

200 కోట్ల స్కామ్ కేసు: మౌనం వీడిన నోరా ఫతేహి..నిందితురాలిని కాదు సాక్షినే!

2026-11-03 09:34 GMT

Copyright @2026

Powered by Blink CMS