అస్సాంలో తెలుగు సినిమాలు!
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో పాన్-ఇండియా చిత్రాల హవా ఊపందుకున్న తరుణంలో ప్రాంతీయ చిత్రాల సరిహద్దులు వేగంగా చెరిగిపోతున్నాయి.
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో పాన్-ఇండియా చిత్రాల హవా ఊపందుకున్న తరుణంలో ప్రాంతీయ చిత్రాల సరిహద్దులు వేగంగా చెరిగిపోతున్నాయి. ఒకప్పుడు తెలుగు రాష్ట్రాలకే పరిమితమైన సినిమాలు ఇప్పుడు దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా విస్తరిస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర-ఈశాన్య రాష్ట్రాల్లో తెలుగు సినిమా ప్రదర్శన ఏ విధంగా ఉంది? అక్కడి ప్రేక్షకులు ఎలా స్పందిస్తున్నారు? అనే అంశంపై ట్రేడ్ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అస్సాం వంటి ఈశాన్య రాష్ట్రాల్లో తెలుగు సినిమాల విడుదల తీరు పూర్తిగా ఆ సినిమాకున్న క్రేజ్ .. మార్కెట్ స్థాయిపై ఆధారపడి ఉంటుంది.
రాజమౌళి వంటి దిగ్గజ దర్శకుల సినిమాలు, అల్లు అర్జున్, ప్రభాస్, రామ్ చరణ్ వంటి పాన్-ఇండియా స్టార్స్ నటించిన భారీ బడ్జెట్ చిత్రాలు మాత్రమే అస్సాంలోని ప్రధాన నగరాలైన గువహటి వంటి ప్రాంతాల్లో విడుదలవుతుంటాయి. అయితే చిన్న , మధ్యస్థాయి చిత్రాల ప్రదర్శన మాత్రం అక్కడ దాదాపు శూన్యమనే చెప్పాలి.
ఈ ప్రాంతంలో థియేట్రికల్ ప్రదర్శనలన్నీ ఎక్కువగా గువహటి లాంటి పెద్ద నగరాల్లోని కార్పొరేట్ మల్టీప్లెక్స్‌లకే పరిమితమైపోతున్నాయి. అస్సాంలోని చిన్న పట్టణాలలో .. సింగిల్ స్క్రీన్‌లలో తెలుగు సినిమాలకు థియేటర్లు దొరకడం చాలా కష్టం.
మల్టీప్లెక్స్‌లలో కూడా హిందీ డబ్బింగ్ వెర్షన్లు .. ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో కూడిన ఒరిజినల్ వెర్షన్లు మాత్రమే స్క్రీన్‌లను దక్కించుకుంటాయి. థియేట్రికల్ రిలీజ్‌లు పరిమితంగా ఉండటం వల్ల అస్సాంలో నివసించే తెలుగు వాలుసు.. స్థానిక సినిమా ప్రేమికులు డిజిటల్ మాధ్యమాలపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఓటీటీ వేదికలు అందుబాటులోకి రావడంతో థియేటర్లలో చూడలేని చిత్రాలను ప్రేక్షకులు నేరుగా ఇళ్లలోనే వీక్షించడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఇది సినిమా చేరువ అవ్వడానికి ప్రధాన మార్గంగా కనిపిస్తుంది.
ఇలాంటి సరికొత్త మార్కెట్లలో తెలుగు సినిమా బ్రాండ్ ఇమేజ్ క్రమంగా బలపడుతోంది. అస్సాం లాంటి భిన్నమైన సంస్కృతి కలిగిన ప్రాంతాల్లో కూడా తెలుగు హీరోల యాక్షన్ సీన్లు, భారీ సెట్టింగ్‌లు, సాంకేతిక విలువలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇది భవిష్యత్తులో మరింత విస్తృతమైన మార్కెట్‌కు పునాది వేస్తోందని చెప్పొచ్చు. అన్ని ప్రాంతాలకూ సినిమాను సమానంగా తీసుకువెళ్లే దిశగా నిర్మాతలు ప్లాన్ చేసుకుంటే ఈశాన్య రాష్ట్రాల్లో కూడా టాలీవుడ్ బాక్సాఫీస్ స్టామినా మరింత పెరుగుతుంది.
కేవలం పెద్ద నగరాలకే పరిమితం కాకుండా డిజిటల్ పంపిణీ విధానాలను మెరుగు పరచుకోవడం ద్వారా తెలుగు సినిమా పరిధులను మరింత సులభంగా విస్తరించుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అస్సాం వరదల్లో మునిగిన సంగతి తెలిసిందే. భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న విజువల్స్ చూస్తుంటే? కన్నీరు ఆగడం లేదు. ఇప్పటికే కొంత మంది సెలబ్రిటీలు ఆపన్న హస్తం అందిస్తున్నారు. తెలుగు హీరోలు సాయం కోసం అస్సాం బాధితులు ఎదురు చూస్తున్నారు.