రాబోయే సినిమాల్లో.. ఈ బజ్ ఎందుకింత డిఫరెంట్?
తెలుగు సినిమా మార్కెట్‌లో ప్రతి సీజన్‌లోనూ భారీ సినిమాలు వస్తూనే ఉంటాయి. స్టార్ హీరోలు, భారీ బడ్జెట్లు, పెద్ద నిర్మాణ సంస్థలు.. ఇవన్నీ సినిమాపై మొదట్లో ఇంట్రెస్ట్ ను కలిగించడం మామూలే.
తెలుగు సినిమా మార్కెట్‌లో ప్రతి సీజన్‌లోనూ భారీ సినిమాలు వస్తూనే ఉంటాయి. స్టార్ హీరోలు, భారీ బడ్జెట్లు, పెద్ద నిర్మాణ సంస్థలు.. ఇవన్నీ సినిమాపై మొదట్లో ఇంట్రెస్ట్ ను కలిగించడం మామూలే. కానీ ప్రస్తుతం రాబోతున్న కొన్ని సినిమాల విషయంలో కనిపిస్తున్న బజ్ మాత్రం కాస్త భిన్నంగా ఉంది. కేవలం హీరో ఎవరు అనే ప్రశ్న దగ్గర ఆగకుండా.. ఈ కాంబినేషన్ ఏం చేయబోతోంది? కథ ఏ ప్రపంచంలోకి తీసుకెళ్తుంది? హీరో ఎలా కనిపించబోతున్నాడు? డైరెక్టర్ తన గత సినిమాలకు భిన్నంగా ఏం చూపించబోతున్నాడు? అనే ప్రశ్నలు ప్రేక్షకుల్లో కనిపిస్తున్నాయి. అదే ఈసారి అప్‌కమింగ్ సినిమాల క్యూరియాసిటీని ప్రత్యేకంగా మారుస్తోంది.
ఈ ట్రెండ్‌కు ది ప్యారడైజ్ ఒక ఎగ్జాంపుల్ గా నిలుస్తోంది. నాని- శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌కు దసరా తర్వాత వచ్చిన క్రేజ్ ఒక కారణమైతే, ఈసారి కనిపించబోయే డార్క్ వరల్డ్, ఇంటెన్స్ లుక్, యాక్షన్ బ్యాక్ డ్రాప్ మరో రీజన్. అయితే వీటన్నింటికంటే ఇంట్రెస్టింగ్ అంశం ట్రైలర్ విషయంలో తీసుకున్న డెసిషన్. సాధారణంగా రిలీజ్ కు ముందు కథపై ఒక క్లారిటీ ఇవ్వడానికి ట్రైలర్ ఉపయోగపడుతుంది. కానీ ట్రైలర్ లేకుండానే ది ప్యారడైజ్‌పై ఇంట్రెస్ట్ పెరగడం.. సినిమా గురించి ప్రేక్షకులకు ఇంకా తెలియని అంశాలే ఇప్పుడు దాని ప్రమోషన్‌లో భాగమవుతున్నాయని సూచిస్తోంది.
ఇదే విధంగా రణబాలి విషయంలో హీరోహీరోయిన్ కాంబినేషన్ ప్రధాన క్యూరియాసిటీ పాయింట్‌గా మారింది. విజయ్ దేవరకొండ- రష్మిక మందన్న జోడీకి ఇప్పటికే ఉన్న క్రేజ్‌కు తోడు, రాహుల్ సంకృత్యాన్ తెరకెక్కిస్తున్న పీరియడ్ యాక్షన్ నేపథ్యం కొత్త ప్రశ్నలను లేవనెత్తుతోంది. అంటే ఇక్కడ స్టార్ పవర్ కంటే కాంబినేషన్ ఏ కొత్త అనుభూతిని ఇస్తుందన్నదే డిస్కషన్ గా మారుతోంది. ప్రభాస్- హను రాఘవపూడి ఫౌజీ విషయంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ప్రభాస్ పాన్ ఇండియా ఇమేజ్, హను రాఘవపూడి ఎమోషనల్ ట్రీట్‌మెంట్ కలవడంతో సాధారణ యాక్షన్ సినిమా కంటే డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్ వస్తుందా అనే ఆసక్తి ఆడియన్స్ లో పెరుగుతోంది.
మరోవైపు విశ్వంభర, వృషకర్మ వంటి సినిమాలు జానర్ ఓరియెంటెడ్ క్యూరియాసిటీని పెంచుతున్నాయి. చిరంజీవి ఫాంటసీ ప్రపంచంలో కనిపించనుండటం, కార్తీక్ దండు విరూపాక్ష తర్వాత మిథికల్ అడ్వెంచర్ వైపు వెళ్లడం ఈ సినిమాలకు ప్రత్యేక గుర్తింపును తీసుకొస్తున్నాయి. అటు వెంకటేష్- త్రివిక్రమ్ కాంబినేషన్‌లోని ఆదర్శ కుటుంబం ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా, నాగార్జున కింగ్100 మాత్రం 100వ సినిమా అనే మైల్‌స్టోన్ కారణంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. విశ్వక్‌సేన్ ENE Repeat, రష్మిక మైసా, నిఖిల్ స్వయంభు కూడా హీరోల ఇమేజ్‌తో పాటు తమ కాన్సెప్ట్‌లు, జానర్‌లతో ఆసక్తిని పెంచుతున్నాయి.
అందుకే రాబోయే సినిమాల బజ్‌లో ఓ ప్రధాన మార్పు కనిపిస్తోంది. ఆడియన్స్ కు ఇప్పుడు స్టార్ ఎవరు అన్నది మాత్రమే ముఖ్యం కాదు. వాళ్లు ఏ డైరెక్టర్ తో చేతులు కలిపారు, ఎలాంటి కథను ఎంచుకున్నారు, కొత్తగా ఏ ప్రపంచాన్ని చూపించబోతున్నారు, ప్రమోషన్స్‌లో ఏం దాచిపెడుతున్నారనే అంశాలు కూడా అంతే కీలకంగా మారాయి. ఈ కారణంగానే ఈసారి రిలీజ్‌కు ముందే కొన్ని సినిమాల చుట్టూ ఏర్పడుతున్న డిస్కషన్.. సాధారణ హైప్ కంటే ఎక్కువ క్యూరియాసిటీగా కనిపిస్తోంది.