రాజమౌళి, సందీప్ రెడ్డి వంగ, సుకుమార్ సక్సెస్ అవ్వడం వల్లే బాలీవుడ్ దర్శకులు ఫెయిల్ అవుతున్నారా...
సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్లతో సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు ఆసక్తి చూపిస్తారు. ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది.
సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్లతో సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు ఆసక్తి చూపిస్తారు. ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీ టాప్ పొజిషన్లో కొనసాగేది. కానీ ఎప్పుడైతే బాహుబలి సినిమా వచ్చిందో అప్పటినుంచి పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ అవుతూ భారీ విజయాలను అందుకుంటున్నాయి. తద్వారా బాలీవుడ్ ప్రేక్షకులు సైతం సౌత్ సినిమాల మీద ముఖ్యంగా తెలుగు మూవీస్ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రాజమౌళి క్రియేట్ చేసిన పెను ప్రభంజనాన్ని మన దర్శకులు ఫాలో అవుతూ వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్లడం వల్లే తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు నెంబర్ వన్ పొజిషన్లో కొనసాగుతుంది. గతంలో బాలీవుడ్ డైరెక్టర్లు డిఫరెంట్ సబ్జెక్టులతో ప్రేక్షకుల ముందుకు వచ్చేవారు ఆ సినిమాలన్నీ సూపర్ సక్సెస్ అయ్యేవి. వాటిని మన దర్శకులు తెలుగులో రీమేక్ చేసి విజయాలను సాధించేవారు.
కానీ ఇప్పుడు బాలీవుడ్ డైరెక్టర్ల హవా తగ్గిపోయింది. రోహిత్ శెట్టి, రాజ్ కుమార్ హిరానీ, సంజయ్ లీలా బన్సాలీ లాంటి దర్శకులు సైతం పూర్తిగా డీలా పడిపోయారు. ఒకప్పుడు వాళ్ళ నుంచి సినిమాలు వస్తున్నాయంటే చాలు ప్రేక్షకుల్లో విపరీతమైన అటెన్షన్ క్రియేట్ అయ్యేది. తప్పకుండా వాళ్ళు సక్సెస్ ని సాధిస్తారనే కాన్ఫిడెంట్ ప్రేక్షకుడిలో బిల్డ్ అయ్యేది. కానీ ఇప్పుడు అవేవీ లేవు ప్రేక్షకులు సైతం తెలుగు సినిమా దర్శకులు చేసే సినిమాల మీదనే ఎక్కువ ఇంట్రెస్ట్ పెడుతున్నారు.
కారణం ఏంటంటే బాలీవుడ్ దర్శకులు చేసే సినిమాలు అక్కడి ప్రేక్షకులకు బోర్ కొట్టించాయి. దాంతో యాక్షన్ ఎమోషన్ ఎలివేషన్స్ తో కూడిన తెలుగు సినిమాలు వాళ్లకి బాగా నచ్చాయి. తద్వారా తెలుగు సినిమాలను ఎంకరేజ్ చేస్తున్నారు. రాజమౌళి, సందీప్ రెడ్డి వంగ, సుకుమార్ లాంటి దర్శకులు వరుస సక్సెస్ లను సాధించడం కూడా బాలీవుడ్ దర్శకుల పాలిట శాపంగా మారింది. మన సినిమాలకు అలవాటు పడిపోయిన అక్కడి జనం బాలీవుడ్ దర్శకులు చేసే సినిమాల పట్ల ఆసక్తిని చూపించడం లేదు. ఎందుకంటే వాళ్లు చేసే కథల్లో వైవిధ్యం లోపిస్తుంది. అలాగే దర్శకులు సైతం స్క్రీన్ ప్లే తో కూడా ప్రేక్షకులను ఏ రకంగానూ ఎగ్జైట్ చేయడం లేదనే విమర్శలను కూడా ఎదుర్కొంటున్నారు. ఇక ఆదిత్యధర్ చేసిన 'దురంధర్' సినిమా స్పై థ్రిల్లర్ కాబట్టి ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
దానికి తగ్గట్టుగానే ఆదిత్య ధర్ మేకింగ్ లో సైతం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా తీశాడు కాబట్టి ఆ మూవీ బాగా ఆడింది. నిజానికి ఈయన ఒక్కరిని మినహాయిస్తే మిగిలిన బాలీవుడ్ దర్శకులెవరు కూడా ఆశించిన మేరకు సినిమాలను చేయలేకపోతున్నారు. తద్వారా ఆ సినిమాలు ఇండస్ట్రీ రికార్డులను క్రియేట్ చేయడంలో వెనుకబడిపోతున్నాయి. మొత్తానికైతే బాలీవుడ్ ఇండస్ట్రీ తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చే పోటీని తట్టుకోలేక వెనుకబడి పోతున్నారనేది వాస్తవం... ఇక రాబోయే రోజుల్లో బాలీవుడ్ డైరెక్టర్లు మరోసారి వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటే తప్ప తెలుగు దర్శకులను ఎదురుకోవడం చాలావరకు కష్టతరమవుతుందనేది వాస్తవం...