• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సీఎం కొడుకు సందీప్ కిషన్...

సీఎం కొడుకు సందీప్ కిషన్ కు ఫ్యాన్ అయ్యాడట

| ఇప్పుడు అదే హీరోతో తన మొదటి సినిమాను తెరకెక్కించారు. దీంతో సిగ్మా విషయంలో ఇంట్రెస్టింగ్ ఫ్యాన్ కనెక్షన్ హాట్ టాపిక్‌ గా మారింది.

By - M Prashanth
Update: 2026-09-16 12:32 GMT

హీరో ఎవరైతే ఏంటి నచ్చితే ఫ్యాన్ అయిపోవాల్సిందే. ఇప్పుడు ఇదే ఫ్యానిజం ఓ సినిమాకు బేస్ అయింది! హీరో సందీప్ కిషన్ అంటే దర్శకుడు జేసన్ సంజయ్‌ కు చాలా ఇష్టం. ఏకంగా సందీప్ నటించిన మైఖేల్ సినిమా చూసిన తర్వాత ఆయనకు ఫ్యాన్‌ గా మారారట. ఇప్పుడు అదే హీరోతో తన మొదటి సినిమాను తెరకెక్కించారు. దీంతో సిగ్మా విషయంలో ఇంట్రెస్టింగ్ ఫ్యాన్ కనెక్షన్ హాట్ టాపిక్‌ గా మారింది.

కోలీవుడ్ స్టార్ హీరో, సీఎం విజయ్ కొడుకు జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న సినిమానే సిగ్మా. సందీప్ కిషన్ హీరోగా నటిస్తుండగా.. ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌ గా కనిపించనున్నారు. అడ్వెంచర్, ట్రెజర్ హంట్, యాక్షన్ ఎలిమెంట్స్ తో సినిమా రూపొందింది. తన మొదటి సినిమాతోనే పక్కా కమర్షియల్ మూవీ చేయాలని జేసన్ ఫిక్స్ అయినట్లు ఆయన కామెంట్స్ బట్టి తెలుస్తోంది.

సిగ్మా గురించి జేసన్ మాట్లాడుతూ, ఇదే తన ఫస్ట్ ఫిల్మ్ అని చెప్పారు. అక్టోబర్ 2న సినిమాను రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. సినిమా కోసం మరిన్ని ఈవెంట్స్ జరగనున్నాయని చెప్పారు. ముఖ్యంగా మూవీలో చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయని, అడ్వెంచర్, ట్రెజర్ ఎలిమెంట్స్ మెయిన్ గాా ఉంటాయని వెల్లడించారు. పక్కా కమర్షియల్ ఫిల్మ్‌ గా సిగ్మాను రూపొందించినట్లు తెలిపారు.

అయితే సినిమా విశేషాల కంటే, సందీప్ కిషన్ గురించి జేసన్ చేసిన కామెంట్సే ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తనకు ఊరు పేరు భైరవకోన అంటే ఇష్టమని జేసన్ చెప్పారు. సందీప్ కిషన్ నటించిన ఆ ఫాంటసీ, సస్పెన్స్ థ్రిల్లర్ తనకు నచ్చిన సినిమాల్లో ఒకటని తెలిపారు. కానీ మైఖేల్ సినిమా చూసిన తర్వాత మాత్రం సందీప్‌ పై తన అభిమానం పెరిగిందట. ఆ సినిమా తర్వాతే తాను సందీప్ కిషన్‌కు ఫ్యాన్‌ గా మారానని జేసన్ చెప్పడం ఆసక్తికరంగా మారింది.

ముఖ్యంగా ఆ సినిమాలో సందీప్ లుక్, యాక్షన్, స్క్రీన్ ప్రెజెన్స్ జేసన్‌ ను ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇక్కడే సిగ్మాపై ఇంట్రెస్ట్ పెరుగుతోంది. తనకు నచ్చిన హీరోను తన తొలి సినిమాకు ఎంచుకున్న జేసన్, ఆ హీరోతో ఎలాంటి కథ చేశారన్నది ఆసక్తికరంగా మారింది. ఫ్యాన్‌ గా మారిన హీరోనే తన డైరెక్షన్ డెబ్యూలో లీడ్‌ రోల్ లో పెట్టడం సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది.

అయితే సిగ్మా నార్మల్ స్టోరీ కాదు. నిధి అన్వేషణ చుట్టూ తిరిగే అడ్వెంచర్ ఎలిమెంట్స్ తోపాటు హైస్ట్, యాక్షన్ సీన్స్ కూడా సినిమాలో ఉండనున్నాయి. అంటే సందీప్ కిషన్‌ కు సరిపోయే యాక్షన్ టచ్‌ తో పాటు జేసన్ తనదైన స్టైల్‌ ను చూపించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. అలా ఫ్యాన్ నుంచి డైరెక్టర్‌ గా మారిన జేసన్.. తన ఫేవరెట్ హీరోతో చేసిన సినిమా ఎలా ఉండబోతుందన్నది అక్టోబర్ 2న సిగ్మా ప్రేక్షకుల ముందుకు వచ్చాక తెలియనుంది.


సందీప్ కిషన్ గారు నటించిన ‘ఊరు పేరు భైరవకోన’ సినిమా నాకు చాలా ఇష్టం. కానీ ఆయనకు నేను ఫ్యాన్ అయ్యింది మాత్రం ‘మైఖేల్’ సినిమా చూసిన తర్వాతే.

- #JasonSanjay#Sigma #SundeepKishan #FariaAbdullah #TeluguCinema #Tupaki

Follow👉@tupaki_official pic.twitter.com/iWB7HZCqbZ

— Tupaki (@tupaki_official) September 16, 2026


Tags:    
  • sundeepkishan 
  • jasonsanjay 
  • sigma 
  • fariaabdullah 
  • telugucinema 

Similar News

ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లిగా సాయిప‌ల్ల‌విపై మ‌రో ప్ర‌యోగం!

2026-11-11 18:30 GMT

టీటీడీ చైర్మ‌న్ రేసులో సినీ ప్ర‌ముఖులు.. !

2026-11-11 18:30 GMT

నువ్వు ఇండస్ట్రీని ఏలుతావు..యంగ్ హీరోపై అట్లీ మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

2026-11-11 17:30 GMT

దేవరకొండ ఫ్యామిలీ.. ఒక్క సినిమా పడితే!

2026-11-11 16:39 GMT

స్టార్ జాతకాన్ని ముందే పసిగట్టిన త్రివిక్రమ్ శిష్యుడు

2026-11-11 16:38 GMT

6 రోజుల్లో 100 కోట్ల క్ల‌బ్.. సౌత్‌లో ఈ ఒక్క‌డికే

2026-11-11 16:37 GMT

వివేక్‌ సాగర్‌కి జరిగిన నష్టం ఇతర మ్యూజిక్‌ డైరెక్టర్స్‌కి పాఠం..!

2026-11-11 16:37 GMT

అనిరుధ్ పెళ్లి సర్ ప్రైజ్.. ఇక సన్ పిక్చర్స్‌తో కొత్త ఎమోషన్

2026-11-11 16:33 GMT

కావ్య మార‌న్‌తో అనిరుధ్ పెళ్లి మొద‌టి ఫోటో

2026-11-11 14:00 GMT

డేంజర్ జోన్‌లో సీనియర్ హీరోయిన్ల‌ కెరీర్?

2026-11-11 13:30 GMT

స్టార్ డైరెక్ట‌ర్ ఇమేజ్ ని వాడుకోలేక‌పోతున్న ఫ్యామిలీ!

2026-11-11 12:30 GMT

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

2026-11-11 11:30 GMT

Copyright @2026

Powered by Blink CMS