• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వివేక్‌ సాగర్‌కి జరిగిన...

వివేక్‌ సాగర్‌కి జరిగిన నష్టం ఇతర మ్యూజిక్‌ డైరెక్టర్స్‌కి పాఠం..!

| సంగీత దర్శకుడు వివేక్ సాగర్ హైదరాబాద్ చిక్కడపల్లిలో ఏర్పాటు చేసుకున్న స్టూడియో అగ్నిప్రమాదంలో పూర్తిగా ధ్వంసమైంది. ఇన్సూరెన్స్ లేకపోవడంతో నష్టపరిహారం కూడా అందలేదని తరుణ్ భాస్కర్ వెల్లడించాడు. ఈ కష్టంలోనూ వివేక్ సాగర్ ప్రతిభను నమ్ముకుని ‘ఈఎన్‌ఈ రిపీట్‌’కు సంగీతం అందించారని ప్రశంసించాడు. సినిమా నవంబర్ 19న విడుదల కానుంది.

By - Ramesh Palla
Update: 2026-11-11 16:37 GMT

పెళ్లి చూపులు సినిమాతో ఉత్తమ సంగీత దర్శకుడిగా ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్‌కి నామినేట్‌ అయిన సంగీత దర్శకుడు వివేక్‌ సాగర్‌ తాజాగా 'ఈఎన్‌ఈ రిపీట్‌' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. కెరీర్‌ ఆరంభం నుంచి చిన్న సినిమాలకు, మీడియం రేంజ్ సినిమాలకు సంగీతాన్ని అందిస్తూ మంచి పేరు దక్కించుకున్నాడు. తరుణ్‌ భాస్కర్‌ మొదటి నుంచి వివేక్ సాగర్‌ పై పూర్తి నమ్మకంతో తన సినిమాల మ్యూజిక్ బాధ్యత ను అప్పగిస్తూ వస్తున్నాడు. తాజా చిత్రానికి కూడా వివేక్ సాగర్‌తో వర్క్ చేయడం జరిగింది. తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వంలో రూపొందిన ఈఎన్‌ఈ రిపీట్‌ సినిమా విడుదలకు రెడీ అయింది. అతి త్వరలోనే విడుదల కాబోతున్న సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు మొదలు అయ్యాయి. తాజాగా సినిమా ప్రమోషనల్‌ ఈవెంట్‌ లో సంగీత దర్శకుడు వివేక్ సాగర్‌ గురించిన షాకింగ్‌ విషయాన్ని దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ చెప్పడం చర్చనీయాంశం అయింది.

తరుణ్‌ భాస్కర్‌ మాట్లాడుతూ...

ఈఎన్‌ఈ రిపీట్‌ సినిమా ప్రమోషనల్‌ కార్యక్రమంలో దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ మాట్లాడుతూ వివేక్‌ సాగర్‌ పై ప్రశంసలు కురిపించాడు. ఈ సందర్భంగా తరుణ్‌ భాస్కర్‌ మాట్లాడుతూ... వివేక్‌ సాగర్‌ తన కష్టం అంతా పెట్టి హైదరాబాద్‌ చిక్కడపల్లిలో స్టూడియో ఏర్పాటు చేసుకున్నాడు. ఆ స్టూడియోలో అగ్ని ప్రమాదం జరిగి మొత్తం నాశనం అయింది. కంప్యూటర్స్‌, సౌండ్‌ మిక్సింగ్‌ యూనిట్స్‌, రికార్డింగ్‌ సామాగ్రి ఇలా అన్నీ అగ్నికి ఆహుతి అయ్యాయి. అగ్ని ప్రమాదంతో ఏమీ లేని స్థితికి వివేక్‌ సాగర్‌ చేరుకున్నాడు. ఆ స్టూడియోకు ఇన్సూరెన్స్‌ కూడా లేకపోవడంతో వివేక్‌ సాగర్‌కి కనీసం ఒక్క రూపాయి కూడా రాలేదని తరుణ్‌ భాస్కర్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. అంతటి తీవ్ర బాధలో ఉన్న సమయంలోనే ఈఎన్‌ఈ రిపీట్‌ సినిమాకు సంగీతం చేయాలని సంప్రదించినట్లుగా కూడా తరుణ్‌ భాస్కర్‌ చెప్పుకొచ్చాడు.

సంగీత దర్శకుడు వివేక్ సాగర్‌ స్టూడియోలో అగ్ని ప్రమాదం...

అగ్ని ప్రమాదంతో మొత్తం కోల్పోయినా కూడా ఏమాత్రం కుంగిపోకుండా ఈ సినిమాకు వర్క్‌ చేసేందుకు రెడీ అయ్యాడు. కాలి పోయింది మ్యూజిక్‌ పరికరాలు, కంప్యూటర్స్ మాత్రమే అని, తన ప్రతిభ కాలిపోలేదని ధైర్యంతో ఈ సినిమాకు వర్క్ చేసినట్లుగా తరుణ్‌ భాస్కర్‌ అన్నాడు. కొత్త సంగీత దర్శకులు వివేక్‌ సాగర్‌ స్టూడియోకి జరిగిన అగ్ని ప్రమాదంను ఒక పాఠంగా తీసుకుని జాగ్రత్తగా ఉండాలని కూడా ఈ సందర్భంగా తరుణ్‌ భాస్కర్‌ సూచించాడు. తమ స్టూడియోలకు తప్పకుండా ఇన్యూరెన్స్‌ ను చేయడం ద్వారా అలాంటి ప్రమాదాలు జరిగిన సమయంలో కొంత అయినా ఉపశమనం కలుగుతుంది అన్నట్లుగా తరుణ్‌ భాస్కర్‌ కొత్త సంగీత దర్శకులకు సూచించాడు. భారీగా ఖర్చు చేసి నిర్మించుకున్న స్టూడియోలు కాలిపోవడం లేదా మరేమైనా ప్రమాదం జరిగితే ఆ సంగీత దర్శకుడి కెరీర్‌ మొత్తం పోయినట్లు అవుతుందని, అందుకే ఇన్సూరెన్స్ ముఖ్యం అని తరుణ్‌ భాస్కర్‌ సూచించాడు.

ఈఎన్‌ఈ రిపీట్‌ సినిమా రిలీజ్‌ డేట్‌...

ఇక ఈఎన్‌ఈ రిపీట్ సినిమా విషయానికి వస్తే సూపర్‌ హిట్ అయిన ఈ నగరానికి ఏమైంది సినిమా కు సీక్వెల్‌ అనే విషయం తెల్సిందే. ఈ సినిమాపై ఇప్పటికే యూత్‌ ఆడియన్స్ లో మంచి క్రేజ్ క్రియేట్‌ అయింది. మొదటి పార్ట్‌లో సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. మ్యూజిక్‌ పరంగా ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ సినిమా విషయంలోనూ అదే చర్చ జరుగుతోంది. అయితే కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా ఈ నగరానికి ఏమైంది సినిమాకు సంబంధించిన మ్యూజిక్‌ ను ఎక్కడ కూడా వాడటం లేదని, అంతా కొత్త మ్యూజిక్‌ ను ఈ సినిమా కు వాడబోతున్నట్లుగా కూడా దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా ఈ సినిమాకు ఈ నగరానికి ఏమైంది 2 అని కాకుండా ఈఎన్‌ఈ రిపీట్‌ అనే టైటిల్‌ తో ప్రచారం చేస్తున్నారు.ఈ సినిమా నవంబర్‌ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Tags:    
  • viveksagar 
  • tharunbhascker 
  • enerepeat 
  • enagaranikemaindi 

Similar News

ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లిగా సాయిప‌ల్ల‌విపై మ‌రో ప్ర‌యోగం!

2026-11-11 18:30 GMT

దేవరకొండ ఫ్యామిలీ.. ఒక్క సినిమా పడితే!

2026-11-11 16:39 GMT

స్టార్ జాతకాన్ని ముందే పసిగట్టిన త్రివిక్రమ్ శిష్యుడు

2026-11-11 16:38 GMT

6 రోజుల్లో 100 కోట్ల క్ల‌బ్.. సౌత్‌లో ఈ ఒక్క‌డికే

2026-11-11 16:37 GMT

అనిరుధ్ పెళ్లి సర్ ప్రైజ్.. ఇక సన్ పిక్చర్స్‌తో కొత్త ఎమోషన్

2026-11-11 16:33 GMT

కావ్య మార‌న్‌తో అనిరుధ్ పెళ్లి మొద‌టి ఫోటో

2026-11-11 14:00 GMT

డేంజర్ జోన్‌లో సీనియర్ హీరోయిన్ల‌ కెరీర్?

2026-11-11 13:30 GMT

స్టార్ డైరెక్ట‌ర్ ఇమేజ్ ని వాడుకోలేక‌పోతున్న ఫ్యామిలీ!

2026-11-11 12:30 GMT

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

2026-11-11 11:30 GMT

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

Copyright @2026

Powered by Blink CMS