• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సిద్దూ పదో సినిమా.....

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

| సిద్దూ జొన్నలగడ్డ పదో సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. సుకుమార్ దగ్గర పనిచేసిన మోహన్ బి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నయన్ సారిక హీరోయిన్‌గా నటిస్తుండగా, జి.వి. ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రేమకథ రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.

By - M Prashanth
Update: 2026-11-11 10:22 GMT

'డీజే టిల్లు', 'టిల్లు స్క్వేర్' సినిమాలతో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు సిద్దూ జొన్నలగడ్డ. ముఖ్యంగా ఆయన కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీకి స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. అయితే ఇప్పుడు తన పదో సినిమా కోసం మరో లవ్ స్టోరీని లైన్ లో పెట్టాడు. ఈసారి సుకుమార్ టీమ్ నుంచి వస్తున్న కొత్త దర్శకుడితో పనిచేయబోతున్నారు. బుధవారం హైదరాబాద్‌లో ఈ సినిమాను అధికారికంగా ప్రారంభించారు.




సుకుమార్ దగ్గర పనిచేసిన మోహన్ బి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సిద్దూ కోసం ఆయన ఒక రొమాంటిక్ ఎంటర్‌టైనర్ కథను సిద్ధం చేశారు. ఇప్పటివరకు చేసిన పాత్రలకు భిన్నంగా సిద్దూను చూపించబోతున్నట్లు చిత్రబృందం చెబుతోంది. అతని సరసన నయన్ సారిక హీరోయిన్‌గా నటిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ వర్క్స్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.




ఈ ప్రాజెక్ట్‌లో మరో విశేషం సంగీత దర్శకుడు జివి ప్రకాశ్ కుమార్. ప్రేమకథ కావడంతో పాటలకు కూడా మంచి ప్రాధాన్యం ఉండనుంది. సినిమాటోగ్రఫీ కోసం చంద్రు సెల్వరాజ్‌ను తీసుకున్నారు. సాహి సురేష్ ప్రొడక్షన్ డిజైన్ అందిస్తున్నారు. సిద్దూ గత సినిమాల్లో కామెడీకి ఎక్కువ చోటుండగా, ఈసారి రొమాన్స్‌కు ప్రాధాన్యం ఇచ్చేలా కథను రూపొందించారు.




ఇక సినిమా ప్రారంభోత్సవానికి టాలీవుడ్ నుంచి పలువురు దర్శకులు, నిర్మాతలు హాజరయ్యారు. సుకుమార్ కెమెరా స్విచాన్ చేయగా, అల్లు అరవింద్ క్లాప్ కొట్టారు. విశ్వప్రసాద్, బాపినీడు, బుచ్చిబాబు, చందు మొండేటి స్క్రిప్ట్ అందించారు. తొలి షాట్‌కు హరీశ్ శంకర్, నందినీ రెడ్డి దర్శకత్వం వహించారు. తబితా సుకుమార్ సమర్పణలో అన్మోల్ శర్మ, బన్నీ వాస్, అశోక్ బండ్రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.




మరోవైపు ఈ సినిమా కోసం విడుదల చేసిన థీమ్ పోస్టర్ కూడా ప్రేమకథకు తగ్గట్టుగా ఉంది. జలపాతం ముందు ఓ ఊయల, దాని చుట్టూ చెట్టు ఆకారంలో డిజైన్ కనిపిస్తోంది. ఎరుపు, పసుపు, నలుపు రంగుల వస్త్రాలతో పోస్టర్‌ను రూపొందించారు. హీరోహీరోయిన్లను చూపించకుండా కేవలం ఈ డిజైన్‌తోనే సినిమాను పరిచయం చేశారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. సిద్దూ కెరీర్‌లో పదో సినిమాగా వస్తున్న ఈ ప్రాజెక్ట్‌కు ఇంకా టైటిల్ ప్రకటించలేదు. త్వరలోనే టైటిల్ పై క్లారిటీ ఇవ్వనున్నారు.

Tags:    
  • siddhujonnalagadda 
  • nayansarika 
  • mohanb 
  • sukumarwritings 
  • bunnyvasworks 
  • gvprakashkumar 

Similar News

భార్యపై పెరిగే ప్రేమకు ట్యూన్ కడితే.. నితిన్ 'పిచ్చి ప్రేమలో'!

2026-11-13 13:51 GMT

'ఫ్యామిలీ స్టార్' దెబ్బ.. విజయ్‌తో దిల్ రాజు ఈసారి మరోలా!

2026-11-13 13:49 GMT

ట్రైల‌ర్ టాక్: 'రామాయ‌ణం' లాంటి ఆఫ్రిక‌న్ పురాణేతిహాస క‌థతో!

2026-11-13 13:30 GMT

100 అడుగుల క్రేన్ ప్రమాదం నుంచి కాపాడిన అదృశ్య హస్తం!

2026-11-13 12:30 GMT

సృజనాత్మక స్వేచ్ఛకు సంకెళ్లు!

2026-11-13 11:36 GMT

రాజమౌళి ఆలోచన సరైనదేనా?

2026-11-13 11:30 GMT

సాయిపల్లవి పాదాలకు నమస్కరించిన కోచ్!

2026-11-13 10:28 GMT

'సెల్ఫ్ రెస్పెక్ట్ ' పద్ధతిలో కావ్య- అనిరుధ్ పెళ్లి.. ఈ పద్ధతి ఎప్పుడు? ఎక్కడ? ఎలా ఆవిర్భవించిందంటే?

2026-11-13 10:27 GMT

రామాయణంలో అతనికి మాత్రమే భారీ ప్రశంసలు!

2026-11-13 10:26 GMT

పిల్లల కోసం టికెట్ రేట్లు తగ్గించారు

2026-11-13 10:24 GMT

అక్క‌డాయ‌న అందుకే మెగాస్టార్ అయ్యారు!

2026-11-13 10:19 GMT

ట్రైల‌ర్ టాక్: 'తుంబాడ్' స్టైల్ మేకింగ్ ఆర్ట్‌వ‌ర్క్‌తో ద‌డ పుట్టిస్తోంది!

2026-11-13 10:18 GMT

Copyright @2026

Powered by Blink CMS