• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  భార్యపై పెరిగే ప్రేమకు...

భార్యపై పెరిగే ప్రేమకు ట్యూన్ కడితే.. నితిన్ 'పిచ్చి ప్రేమలో'!

| నాని సమర్పణలో నితిన్, ఆఫియా జంటగా నటిస్తున్న ‘అలియాస్ రుక్మిణి’ నుంచి ‘పిచ్చి ప్రేమలో’ అనే రెండో పాట విడుదలైంది. విజయ్ బుల్గానిన్ స్వరపరిచిన ఈ మెలోడీకి కార్తీక్ గాత్రం అందించారు. కృష్ణ కుమార్ సాహిత్యం, నితిన్-ఆఫియా సహజమైన కెమిస్ట్రీ ఆకట్టుకుంటున్నాయి. మురళీ కాంత్ దేవసోత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 4న విడుదల కానుంది.

By - M Prashanth
Update: 2026-11-13 13:51 GMT

సినిమాల్లో ప్రేమపాటలంటే కాలేజీ రోజులు లేదా పెళ్లికి ముందు జరిగే రొమాన్స్ చుట్టూనే తిరుగుతుంటాయి. కానీ పెళ్లయిన తర్వాత ఒక మధ్యతరగతి జంట మధ్య పెరిగే అనురాగాన్ని పాటగా మలచడం కాస్త కొత్తగా అనిపిస్తుంది. నాని సమర్పణలో నితిన్, ఆఫియా జంటగా నటిస్తున్న చిత్రం అలియాస్ రుక్మిణి. మురళీ కాంత్ దేవసోత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా పిచ్చి ప్రేమలో అంటూ సాగే సెకండ్ సింగిల్ లిరికల్ వీడియోను విడుదల చేశారు.




 


ఈ పాటలో భార్యపై భర్తకు ఉండే ఇష్టాన్ని రచయిత కృష్ణ కుమార్ చాలా సహజమైన పదాలతో రాశారు. 'పిచ్చి ప్రేమలో నన్నే ముంచుతావే ఓ వగలాడి.. చందమామలో మచ్చ కూడా లేదే ఓ ప్రియురాలా.. అంటూ సాగే పల్లవి వినగానే హాయిగా అనిపిస్తోంది. నువ్వు గాని దూరమైతే ఓ నిమిషం, పక్కనుంటేనే సంతోషం చెలియా అంటూ వచ్చే లైన్స్ ఎక్కడా రొటీన్ గా అనిపించకుండా నేటి తరం కపుల్స్ త్వరగా కనెక్ట్ అయ్యేలా కుదిరాయి.

సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్ ఈ పాటకు చాలా ప్లెజెంట్ ట్యూన్ అందించారు. ఎక్కడా లౌడ్ బీట్స్ లేకుండా ఫ్లూట్, గిటార్, లైట్ డ్రమ్స్ తో పాట సాఫీగా సాగిపోతుంది. ముఖ్యంగా మధ్యలో వచ్చే ఇంటర్ల్యూడ్స్ వినసొంపుగా ఉన్నాయి. సింగర్ కార్తీక్ తన గాత్రంతో పాటకు మంచి ఫ్రెష్ ఫీల్ తీసుకొచ్చారు. వింటున్న కొద్దీ ఆకట్టుకునే మెలోడీలా ఈ ట్రాక్ రూపొందింది.

లిరికల్ వీడియోలో నితిన్, ఆఫియా మధ్య కెమిస్ట్రీ నేచురల్ గా కుదిరింది. కృష్ణ పాత్రలో భార్యను అమితంగా ప్రేమించే మధ్యతరగతి భర్తగా నితిన్ సెటిల్డ్ గా కనిపించగా, రుక్మిణి పాత్రలో ఒదిగిపోయారు. వీరిద్దరి మధ్య వచ్చే చిన్న చిన్న సరదా సన్నివేశాలు, రోజువారీ జీవితంలోని మూమెంట్స్ కొత్తగా పెళ్లయిన జంటలకు బాగా నచ్చేలా ఉన్నాయి. సోషల్ మీడియా రీల్స్ కు కూడా ఈ పాట మంచి ఆప్షన్ గా మారే అవకాశం ఉంది.

నేచురల్ స్టార్ నాని సమర్పణలో వస్తుండటంతో మొదటి నుంచీ ఈ ప్రాజెక్ట్ పై ఆడియన్స్ లో డీసెంట్ బజ్ నెలకొంది. దీప్తి గంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రమోషన్లలో భాగంగా వదులుతున్న పాటలు సినిమాలోని కంటెంట్ ఏంటో క్లారిటీతో చెబుతున్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 4న థియేటర్లలో విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. ఇక ఎలాంటి హడావుడి లేకుండా ఒక స్వచ్ఛమైన మిడిల్ క్లాస్ ప్రేమకథను తెరపైకి తెస్తున్నట్లు ఈ పాట చూస్తే అర్థమవుతోంది. మరి డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అలియాస్ రుక్మిణి బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో క్లిక్కవుతుందో చూడాలి.



Full View


Tags:    
  • aliasrukmini 
  • nithiin 
  • aafiya 
  • picchipremalo 
  • vijaybulganin 

Similar News

'ఫ్యామిలీ స్టార్' దెబ్బ.. విజయ్‌తో దిల్ రాజు ఈసారి మరోలా!

2026-11-13 13:49 GMT

ట్రైల‌ర్ టాక్: 'రామాయ‌ణం' లాంటి ఆఫ్రిక‌న్ పురాణేతిహాస క‌థతో!

2026-11-13 13:30 GMT

100 అడుగుల క్రేన్ ప్రమాదం నుంచి కాపాడిన అదృశ్య హస్తం!

2026-11-13 12:30 GMT

సృజనాత్మక స్వేచ్ఛకు సంకెళ్లు!

2026-11-13 11:36 GMT

రాజమౌళి ఆలోచన సరైనదేనా?

2026-11-13 11:30 GMT

సాయిపల్లవి పాదాలకు నమస్కరించిన కోచ్!

2026-11-13 10:28 GMT

'సెల్ఫ్ రెస్పెక్ట్ ' పద్ధతిలో కావ్య- అనిరుధ్ పెళ్లి.. ఈ పద్ధతి ఎప్పుడు? ఎక్కడ? ఎలా ఆవిర్భవించిందంటే?

2026-11-13 10:27 GMT

రామాయణంలో అతనికి మాత్రమే భారీ ప్రశంసలు!

2026-11-13 10:26 GMT

పిల్లల కోసం టికెట్ రేట్లు తగ్గించారు

2026-11-13 10:24 GMT

అక్క‌డాయ‌న అందుకే మెగాస్టార్ అయ్యారు!

2026-11-13 10:19 GMT

ట్రైల‌ర్ టాక్: 'తుంబాడ్' స్టైల్ మేకింగ్ ఆర్ట్‌వ‌ర్క్‌తో ద‌డ పుట్టిస్తోంది!

2026-11-13 10:18 GMT

Copyright @2026

Powered by Blink CMS