స్టార్ డైరెక్టర్ ఇమేజ్ ని వాడుకోలేకపోతున్న ఫ్యామిలీ!
| దర్శకుడు పూరి జగన్నాథ్ తన కుటుంబ సభ్యులకు సినీ అవకాశాలు కల్పించేందుకు ఆసక్తి చూపడం లేదనే చర్చ టాలీవుడ్‌లో జరుగుతోంది. సొంత టాలెంట్, కష్టంతోనే పరిశ్రమలో నిలదొక్కుకోవాలని ఆయన భావిస్తారని సమాచారం. అందుకే కుమారుడు ఆకాష్ పూరితో పాటు ఇతర కుటుంబ సభ్యులు కూడా సొంతంగా గుర్తింపు తెచ్చుకోవాలని పూరి కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.
టాలీవుడ్ లో పూరి జగన్నాథ్ అంటే ఓ బ్రాండ్. మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. ఎంతోమంది ఆర్టిస్టులకు, టెక్నీషియన్లకు లైఫ్ ఇచ్చిన క్రియేటివ్ డైరెక్టర్ ఆయన. అయితే పరిశ్రమలో అంతటి గుర్తింపు.. ఇమేజ్ ఉన్నా? పూరి సొంత కుటుంబ సభ్యులు మాత్రం ఆ క్రేజ్‌ను పూర్తి స్థాయిలో వాడుకోలేకపోతున్నారనే చర్చ ఫిల్మ్ నగర్ వర్గాల్లో తాజాగా చర్చకొచ్చింది. ఓ స్టార్ డైరెక్టర్ నీడలో ఉన్నా? ఆయన కుటుంబానికి చెందిన యంగ్ జనరేషన్ ఇప్పటికీ సరైన బ్రేక్ కోసం నిరీక్షించాల్సి వస్తోంది.
పూరి జగన్నాథ్‌కు ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. వారిలో ఉమాశంకర్ పెద్ద తమ్ముడు. ఇతను రాజకీయాల్లో ఉన్నారు. మరో తమ్మడు సాయిరాంశంకర్. ఇతడు హీరోగా కొన్ని సినిమాలు చేసారు. అయితే వారి కుటుంబాల్లో పరిశ్రమకు పనికొచ్చే నటులు, టాలెంట్ ఉన్న మగపిల్లలు ఉన్నారు. పూరి జగన్నాథ్ సొంత కుమారుడు ఆకాష్ పూరి కూడా `మెహబూబా`, `రొమాంటిక్` వంటి చిత్రాలతో తనదైన నటనతో ఆకట్టుకున్నారు. కానీ సాలిడ్ మాస్ సక్సెస్ కోసం ఇప్పటికీ శ్రమిస్తూనే ఉన్నాడు.
ఉమాశంకర్ కుమారులు కూడా గుడ్ లుక్స్, పర్సనాలిటీతో పరిశ్రమకు సరిపోయే అర్హతలు కలిగి ఉన్నా? వారు ఇంకా వెండితెరపై ప్రొఫెషనల్‌గా ఎంట్రీ ఇవ్వలేదు. పూరి లాంటి డైనమిక్ డైరెక్టర్ ఇంట్లో ఉన్నారు. ఆయన ఒక్క మాట చెబితే కాదనే వారు ఎవరు? లైఫ్ సెట్ అయిపోతుంది కదా అని బయట అనుకుంటారు. కానీ పూరి జగన్నాథ్ మాత్రం ఫ్యామిలీ మెంబర్స్‌కు లిఫ్ట్ ఇవ్వకపోవడం వెనుక బలమైన సిద్ధాంతం ఉంది.
ఏలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా పరిశ్రమలోకి వచ్చి స్టార్ డైరెక్టర్‌గా ఎదిగిన పూరి జగన్నాథ్ ఓ విషయాన్ని బలంగా నమ్ముతారు. పరిశ్రమలో ఎవరైనా సొంత ఫ్యాషన్, కష్టం, టాలెంట్‌తో మాత్రమే నిలబడాలి తప్ప.. రికమం డేషన్లతోనో? వారసత్వంతోనో? వచ్చే విజయాలు ఎక్కువ కాలం నిలవవన్నది పూరి సిద్ధాంతం. అందుకే కుమారుడికి .. కుటుంబ సభ్యులకు అవకాశం ఇచ్చినా? దాన్ని వారు సొంతంగా నిలబెట్టుకోవాలని భావిస్తారు తప్ప ప్రతిక్షణం వెనకుండి నడిపించేందుకు ఇష్టపడరు.
ఈ కారణంతోనే పూరి ఫ్యామిలీకి చెందిన యువ నటులు ఇండస్ట్రీలో లేరు. ఒకవేళ వారు సినిమాల్లోకి వస్తామన్నా? పూరి పరిశ్రమలో ఉండే పరిస్థితులన్నీ ముందుగానే చెబుతారు. వాటిని తట్టుకుని నిలబడి పోరాటం చేయగలిగే దమ్ము ఉంటేనే సినిమాల్లోకి రా? లేకపోతే వద్దు అని నిర్మొహ మాటంగా చెప్పేస్తారు. ఈ విషయాన్ని పూరి పలు ఇంటర్వ్యూల్లో కూడా చెప్పకనే చెప్పారు.