• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అందానికి...

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

| రేణు దేశాయ్ కుమార్తె ఆద్య, మహేష్ బాబు కూతురు సితార, మీనా కుమార్తె నైనిక, రోజా కుమార్తె అన్షుమాలిక సోషల్ మీడియాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. తల్లుల పోలికలు, స్టైలిష్ లుక్స్‌తో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఇప్పటివరకు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకపోయినా, వీరి ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. భవిష్యత్తులో టాలీవుడ్‌లో అడుగుపెడతారా అన్న ఆసక్తి నెలకొంది.

By - Srikanth Kontham
Update: 2026-11-11 11:30 GMT

తెలుగు పరిశ్రమలో తల్లుల అందాన్ని- అభినయాన్ని పుణికిపుచ్చుకున్న స్టార్ కిడ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలు స్తున్నారు. ఒకప్పుడు అద్భుతమైన నటనతో, గ్లామర్‌తో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన అగ్ర నటీమణుల వారసులు ఇప్పుడు అచ్చం అలాగే రూపుదిద్దుకుని అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. వెండితెరపై అడుగు పెట్టక ముందే సోషల్ మీడియాలో గ్లామర్, స్టైల్‌తో ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకుంటున్నారు. ఈ తారల కుమార్తెలు భ‌విష్య‌త్ లో టాలీవుడ్‌లో సంచలనం సృష్టించడం ఖాయమనే సంకేతాలు ఇస్తున్నారు.

ఈ జాబితాలో ముందుగా వినిపించే పేర్లు రేణు దేశాయ్- ఆద్య, నమ్రతా శిరోద్కర్- సితార ఘట్టమనేని. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి రేణు దేశాయ్ కుమార్తె ఆద్య అచ్చం తల్లి పోలికలతో ఎంతో అందంగా, పద్ధతిగా కనిపిస్తుంది. సూపర్‌స్టార్ మహేష్ గారాల పట్టి సితార విషయానికి వస్తే చిన్న వయసులోనే మోడలింగ్‌లో రాణిస్తూ, సోషల్ మీడియాలో క్యూట్ అండ్ స్టైలిష్ లుక్స్‌తో ట్రెండ్ సెట్ చేస్తోంది. తల్లి నమ్రతలాగే అప్పట్లో అందాల రాణిగా మెప్పించిన లక్షణాలు సితారలో కనిపిస్తున్నాయి.

సీనియ‌ర్ న‌టి మీనా కుమార్తె నైనిక అందం గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఇప్పటికే విజయ్ తలపతి చిత్రంలో బాలనటిగా క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకున్న నైనిక పెద్దదై అచ్చం తల్లిలాగే క్యూట్ స్మైల్‌తో అందాల బొమ్మలా మెరుస్తోంది. మరోవైపు టాలీవుడ్ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజా కుమార్తె అన్షుమాలిక కూడా గ్లామర్ విషయంలో ఏమాత్రం తీసిపోదు. అచ్చం తల్లి పోలికలతో, స్టైలిష్ లుక్స్‌తో సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న అన్షుమాలిక అందం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

ఈ తారల‌ కుమార్తెలు అధికారికంగా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకపోయినా? వారి ఫొటోలు, సోషల్ మీడియా పోస్టులు మాత్రం నిత్యం నెట్టింట వైరల్ అవుతుంటాయి. తల్లిదండ్రుల పోలికలను పుణికిపుచ్చుకోవడమే కాదు. హైట్, పర్సనాలిటీ, ఆకర్షణీయమైన ముఖవర్చస్సుతో అచ్చం అందానికి ప్రతిరూపాలుగా హైలైట్ అవుతున్నారు. త్వరలోనే వీరంతా వెండితెరపై అడుగుపెట్టే అవకాశం ఉందని.. అనంత‌రం టాలీవుడ్‌లో సరికొత్త స్టార్ హీరోయిన్ల శకం మొదలవుతుందని అభిమానులు భావిస్తున్నారు.

తల్లుల గ్లామర్‌కు ఏమాత్రం తీసిపోని నేటితరపు తారల కుమార్తెలు సినిమాల్లోకి వస్తే ఏ రేంజ్‌లో క్రేజ్ సంపాదిం చుకుంటారో? చెప్పాల్సిన ప‌నిలేదు. అందం, అభినయం కలగలిసిన స్టార్ కిడ్స్ ఎంట్రీ కోసం టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భ‌విష్య‌త్ లో ఈ వారసురాళ్లు టాలీవుడ్‌లో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని తల్లుల బాటలోనే స్టార్ హీరోయిన్లుగా వెలిగిపోవాల‌ని ఆశీద్దాం.

Tags:    
  • tollywoodstarkids 
  • aadhya 
  • sitaraGhattamaneni 
  • nainika 
  • anshumalika 

Similar News

"తెలుగు హీరోలు అందరూ అనీష్ వెనుక నిలబడడానికి కారణం అదే"

2026-11-17 17:42 GMT

నా జీవితంలో క్లిష్టమైన రోజులవే.. సెకండ్ ప్రెగ్నెన్సీ పై ఉపాసన కామెంట్స్!

2026-11-17 17:39 GMT

సైఫ్ స్పెషల్ ఫ్యామిలీ ట్రిప్.. ప్రత్యేకత ఏంటంటే?

2026-11-17 17:33 GMT

వర్కౌట్స్ తో తెగ కష్టపడిపోతున్న రాశీ ఖన్నా.. వీడియో వైరల్!

2026-11-17 17:33 GMT

సాయి ప‌ల్ల‌వి కెరీర్ లో తొలి 1000 కోట్లు!

2026-11-17 12:46 GMT

32 దేశాల్లో సంచలనం సృష్టించిన రణవీర్ సింగ్ మూవీకి ఘోర అవమానం!

2026-11-17 12:46 GMT

దాదా వ‌ర్సెస్ కాకా..ద‌బిడి దిబిడే!

2026-11-17 12:45 GMT

ఆ మూవీ సెట్లో టార్చర్ చూపించారు..నేను చేసిన తప్పు అదే - పూజిత పొన్నాడ!

2026-11-17 11:15 GMT

చైతూ.. పుష్ప బ్రాండ్ కలిసొచ్చేనా?

2026-11-17 10:37 GMT

తప్పు ఎవరిదైనా శిక్ష ఆడదానికేనా.. సమంత సూటి ప్రశ్న?

2026-11-17 10:33 GMT

బిగ్ బాస్ బ్యూటీ.. బూతు పాటతో వార్నింగా?

2026-11-17 10:32 GMT

పట్టుచీరలో సీతమ్మ ఎంత అందంగా ఉందో!

2026-11-17 10:21 GMT

Copyright @2026

Powered by Blink CMS