"తెలుగు హీరోలు అందరూ అనీష్ వెనుక నిలబడడానికి కారణం అదే"
| కొత్త హీరో అనీష్ నటించిన ‘ఇట్లు అర్జున’ సినిమాకు టాలీవుడ్ అగ్ర హీరోలంతా మద్దతు ఇవ్వడానికి గల కారణాన్ని చిరంజీవి వెల్లడించారు. నాని పాట విడుదల చేయగా, ఎన్టీఆర్ మరో పాటను ప్రమోట్ చేశారు. రామ్ చరణ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఈ మద్దతు వెనుక నిర్మాత ఏఎంఆర్ మహేష్ రెడ్డి ఉన్నారని చిరంజీవి తెలిపారు. ఆయనకు సినిమాలపై ఉన్న ప్రేమ, అనీష్‌కు నటనపై ఉన్న ఆసక్తి, పట్టుదల చూసి హీరోలంతా ప్రోత్సహించేందుకు ముందుకొచ్చారని చెప్పారు.
సాధారణంగా కొత్త హీరోల సినిమాలకు ఇండస్ట్రీలోని పెద్ద స్టార్లు మద్దతు ఇవ్వడం చాలా అరుదుగా జరుగుతుంది. ఒకరిద్దరు స్టార్ హీరో సినిమా ప్రమోషన్లలో పాల్గొన్నా అది ఆశ్చర్యంగా కనిపిస్తుంది. అలాంటిది ఒక కొత్త హీరో సినిమా కోసం టాలీవుడ్‌కు చెందిన దాదాపు అందరు స్టార్ హీరో ఒక్కొక్కరుగా ముందుకు రావడం ఈమధ్య అందరిని ఆశ్చర్యపరిచింది. యువ నటుడు అనీష్ హీరోగా పరిచయమైన ఇట్లు అర్జున సినిమాకు మెగాస్టార్ చిరంజీవి నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు పలువురు ప్రముఖులు ప్రచారం చేయడం అందరికీ చాలా వింతగా అనిపించింది.
అసలు ఒక కొత్త హీరోకు ఇంతమంది స్టార్ హీరోలు ఎందుకు మద్దతు ఇచ్చారు? దీని వెనుక ఏదైనా ప్రత్యేకమైన కారణం ఉందా? అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో చాలాకాలంగా వినిపిస్తున్నాయి. తాజాగా ఈ ప్రశ్నలకు మెగాస్టార్ చిరంజీవి సమాధానం ఇచ్చారు. ఇట్లు అర్జున సక్సెస్ మీట్‌లో నాగార్జునతో పాటు చిత్రబృందం సమక్షంలో ఆయన ఈ విషయంపై ఆసక్తికరంగా మాట్లాడారు.
అనీష్‌కు లభించిన సపోర్ట్ చాలా గొప్పదని..తన కెరీర్ ప్రారంభంలో కానీ, నాగార్జున కెరీర్ ప్రారంభంలో కానీ.. ఇలాంటి స్థాయిలో ఇండస్ట్రీ నుంచి సహకారం లభించలేదని గుర్తుచేశారు. దాదాపు అందరు ప్రముఖ తెలుగు హీరోలు అనీష్ కోసం తమవంతుగా ముందుకు వచ్చారని చెప్పారు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా సినిమాకు ప్రచారం కల్పించారని వివరించారు.
“నాని ఒక పాటను విడుదల చేయగా, ఎన్టీఆర్ మరో పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. నాగార్జున ఈ ప్రాజెక్టుకు వెన్నుముకదా నిలిచారు. రామ్ చరణ్ ప్రీ రిలీజ్ వేడుకకు అటెండ్ అయ్యారు. విక్టరీ వెంకటేష్ కూడా తనవంతుగా సహకారం అందించారు. ఇలా టాలీవుడ్‌లోని హీరోలు అందరూ వచ్చారు,” అని తెలిపారు చిరంజీవి.
అయితే ఇలా అందరూ రావడానికి కారణం ఒకరు అని.. అతనే తమ మిత్రుడు, ప్రియ పాత్రుడు, దేవుడి భక్తుడు ఏఎంఆర్ మహేష్ రెడ్డి అని తెలిపారు. ఆయన మైనింగ్ డాన్ ఆయన సరే.. సినిమాల పైన ప్రేమతో శ్రీరామదాసు, షిర్డీ సాయి లాంటి సినిమాలు తీశారని చెప్పారు.
మహేష్ రెడ్డికి సినిమాలపై ఉన్న ఆసక్తి చిన్నప్పటి నుంచే అనీష్‌పై ప్రభావం చూపిందని చెప్పారు. “ఆయన నిర్మించిన సినిమాలను చూసిన అనీష్‌కు కూడా నటన, సినిమా రంగంపై ఆసక్తి పెరిగింది. తన మనసులోని కోరికను తల్లిదండ్రులకు చెప్పడంతో వారు ప్రోత్సహించారు. అలా అనీష్ నటుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. అతడిలో ఉన్న సినిమా పట్ల ఆసక్తి, పట్టుదల మమ్మల్ని కూడా ఆకట్టుకొని మేము సపోర్ట్ చేయడానికి వచ్చాము,” అని తెలిపారు చిరంజీవి.
ఇక 'ఇట్లు అర్జున' విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనను అందుకుంది. అయితే సినిమా విడుదలకు ముందే టాలీవుడ్ అగ్ర హీరోల ఈ సినిమాని బాగా ప్రమోట్ చేసారు ఈ క్రమంలో చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం మహిళలు అవుతున్నారు.