దాదా వర్సెస్ కాకా..దబిడి దిబిడే!
| చిరంజీవి–బాబీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘కాకా’, బాలకృష్ణ–గోపీచంద్ మలినేని కాంబోలో వస్తున్న ‘దాదా’ సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ‘దాదా’లో నర్గీస్ ఫక్రీ కనిపించనుండగా, రితికా సింగ్ పేరు కూడా వినిపిస్తోంది. ‘కాకా’లో ఐటమ్ భామ ఎవరన్నది ఆసక్తికరంగా మారింది.
మెగాస్టార్ చిరంజీవి..నటసింహ బాలకృష్ణ ల మాస్ ఇమేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇద్దరి సినిమాలు పోటా పోటీగా ఒకేసారి రిలీజ్ అయినా? గ్యాప్ తో రిలీజ్ అయిన ఆ రెండు చిత్రాల మధ్య పోలికలు మాత్రం తెరపైకి వస్తుంటాయి. అదే మాస్ డైరెక్టర్లతో పనిచేస్తే ఆ పోలిక పీక్స్ లో ఉంటుంది. తాజాగా అలాంటి సన్ని వేశమే కనిపిస్తోంది. చిరంజీవి కథానాయకుడిగా బాబి దర్శకత్వంలో `కాకా` పక్కా మాస్ కమర్శియల్ ఎంటర్ టైనర్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇద్దరి కాంబినేషన్ లో గతంలో రిలీజ్ అయిన `వాల్తేరు వీరయ్య` తామెంత మాస్ అన్నది నిరూపించారు.
`కాకా` లో అంతకు మించిన మాస్ యాంగిల్ హైలైట్ కానుంది. అలాగే బాలయ్య హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో `దాదా` తెరకక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇద్దరు గతంలో మాస్ హిట్లు అందుకున్న ట్రాక్ రికార్డు ఉంది. ఈ నేపథ్యంలో `దాదా` లో మాస్ కోణం గత చిత్రాలను మించి ఉంటుందన్నది వాస్తవం. ఈ నేపథ్యంలో ఈ రెండు చిత్రాల మధ్య పోలికలకు తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా రెండు సినిమాల్లో ఐటం సాంగ్ లు హైలైట్ అవుతున్నాయి. `దాదా`లో బాలయ్య సరసన నర్గీస్ ఫక్రీ ఐటం పాటలో కనిపించనుంది.
ఐటం పాటల్లో స్పెషలిస్ట్ అయిన నర్గీస్ నే రంగంలోకి దించడంతో ఈ పాట రేంజ్ అంతకంతకు పెరుగుతుంది. ఆ పాటలో బాలయ్య స్టెప్ అందుకున్నారంటే? వేరే లెవల్లో ఉంటుంది. ఇక `దాదా` సినిమాలో రితికా సింగ్ ఐటం భామగా నటిస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో మరింత క్లారిటీ రావాలి. కానీ బాబి-చిరు సినిమాలో ఐటం సాంగ్ అంటే ఆ క్రేజ్ వేరుగా ఉంటుంది. ఐటం భామని పక్కన బెడితే ఆ పాటలో మెగాస్టార్ గ్రేస్ ఎలా ఉంటుందన్నది చెప్పాల్సిన పనిలేదు. అందుకు సరైన జోడీ కుదిరితే గనుక స్వీట్ కావాలా? హాట్ కావాలా? అన్న పాట రేంజ్ లో పేలుతుంది.
అలా ఈ రెండు చిత్రాల్లో ఐటం పాటలు అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇవ్వ నున్నాయి. `దాదా` చిత్రం డిసెంబర్ లోనే రిలీజ్ అవుతుంది. ఈ నేపథ్యంలో హడావుడి వచ్చే నెల నుంచి ప్రారంభమవుతుంది. ఆ ఊపు సంక్రాంతి వర కూ కొనసాగుతుంది. `కాకా` చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అప్పటి నుంచి చిరంజీవి మాస్ వైబ్ పీక్స్ లో ఉంటుంది.