• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆ మూవీ సెట్లో టార్చర్...

ఆ మూవీ సెట్లో టార్చర్ చూపించారు..నేను చేసిన తప్పు అదే - పూజిత పొన్నాడ!

| ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి’ సినిమా షూటింగ్ సమయంలో తాను తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నానని నటి పూజిత పొన్నాడ వెల్లడించారు. బలవంతంగా నటించమంటూ తనను టార్చర్ చేశారని ఏడేళ్ల తర్వాత ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అప్పట్లో ఇండస్ట్రీకి కొత్త కావడంతో ఎవరితోనూ ఈ విషయాన్ని చెప్పుకోలేకపోయానన్నారు. ‘రంగస్థలం’ షూటింగ్‌లో రామ్ చరణ్ పడిన కష్టాన్ని కూడా ఆమె గుర్తుచేసుకున్నారు.

By - Madhu Reddy
Update: 2026-11-17 11:15 GMT

ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నంకు చెందిన పూజిత పొన్నాడ ఇంజనీరింగ్ పూర్తి చేసి టాటా కన్సల్టెన్సీ లో ఉద్యోగం చేస్తున్న సమయంలోనే.. తనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవడానికి సినిమా రంగంలోకి అడుగు పెట్టింది. అలా తొలిసారి 2015లో 'ఉప్మా తినేసింది' అనే షార్ట్ ఫిల్మ్ తో కెరియర్ మొదలుపెట్టిన ఈమె.. 2016లో ఊపిరి చిత్రంలో గ్యాలరీ మేనేజర్ గా నటించి.. ఆ తర్వాత రంగస్థలం సినిమాలో ఆది పినిశెట్టి ప్రియురాలిగా పద్మ క్యారెక్టర్ తో ప్రేక్షకులను అలరించింది పూజిత. తర్వాత రాజుగాడు, బ్రాండ్ బాబు, హ్యాపీ వెడ్డింగ్, 7 , కల్కి వంటి చిత్రాలలో కీలక పాత్రలు పోషించిన పూజిత.. తొలిసారి హీరోయిన్ గా నటించిన చిత్రం వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి.. అదే నేను చేసిన తప్పు కూడా..

అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో తనకు టార్చర్ అంటే ఏంటో చూపించారు అంటూ దాదాపు ఏడేళ్ల తర్వాత తాను అనుభవించిన ఇబ్బందులను బయటపెట్టి అందరిని ఆశ్చర్యపరిచింది పూజిత పొన్నాడ. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.. గత కొంతకాలంగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ తన అందం, అభినయంతో ఆకట్టుకుంటున్న పూజిత పొన్నాడ ప్రస్తుతం ఎస్.ఆర్. కళ్యాణ మండపం ఫేమ్ శ్రీధర్ గాదే దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తోంది.

ఇందులో నర్తకి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమా హారర్ డ్రామాగా రూపొందుతోంది. ఇందులో సస్పెన్స్, ఎమోషన్స్ కీలకంగా ఉండనున్నాయి. పైగా కమిటీ కుర్రోళ్ళు సేమ్ ఈశ్వర్ రాచిరాజు ఇందులో హీరోగా నటిస్తున్నారు. నందు, లిఖిత తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రంతోపాటు మరొకవైపు తమిళ సినిమా భగవాన్ లో కూడా ఈమె నటిస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా ఒక వైపు వరుస చిత్రాలలో అవకాశాలు అందుకుంటున్న ఈమె.. మరొకవైపు పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చింది. లేటెస్ట్ ఇంటర్వ్యూ లో భాగంగా పూజిత పొన్నాడ మాట్లాడుతూ.." రంగస్థలం సినిమా తర్వాత హీరోయిన్ గా వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి సినిమాలో నాకు తొలిసారి అవకాశం లభించింది. అప్పటివరకు నేను పలు చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే నటించాను. కానీ ఈ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ అనడంతో చాలా ఎగ్జైట్ అయ్యాను.

నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి మంచి ప్లాట్ఫారం దొరికింది అనుకున్నాను. కానీ ఆ సినిమా షూటింగ్ సెట్లోకి అడుగుపెట్టాక తొలిసారి నా జీవితంలో వరస్ట్ సిచువేషన్ ని ఫేస్ చేశాను. ముఖ్యంగా ఈ విషయాన్ని నేను ఎప్పుడూ ఎక్కడ ఎవరితోనో చెప్పుకోలేదు. ఈ సినిమా షూటింగ్ సమయంలో నన్ను టార్చర్ చేశారు. బలవంతంగా నటించమని ఇబ్బంది పెట్టారు. నిజానికి నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటాను. కానీ ఈ సినిమా సమయంలో నేను చాలా ఇబ్బంది పడ్డాను.

ముఖ్యంగా నేను ఇండస్ట్రీలోకి అప్పుడే కొత్తగా వచ్చాను. ఇండస్ట్రీ గురించి ఏమీ తెలియదు. పైగా ఎవరు తెలియదు. నిజానికి నేను రంగస్థలం, మైత్రి మేకర్స్ వంటి మంచి టీమ్లతో పనిచేశాను. అందులో సుకుమార్ , రామ్ చరణ్ లతో పని చేయడం చాలా అద్భుతంగా అనిపించింది. నేను రంగస్థలం సినిమా కోసం ఏడు రోజులు మాత్రమే పని చేశాను. ఆ సినిమా షూటింగ్ కూడా రాత్రివేళలో జరిగింది. ముఖ్యంగా రామ్ చరణ్ కష్టం అప్పుడే నాకు అర్థమైంది. సాధారణంగా ఒక ఆర్టిస్ట్ అంటే నటిస్తారు.. డబ్బులు తీసుకొని వెళ్ళిపోతారు అనుకుంటారు. కానీ షూటింగ్ సెట్లో ప్రేక్షకుడిని మెప్పించడానికి ఆ ఆర్టిస్టు ఎంత కష్టపడతారో చాలామందికి తెలియదు" అంటూ తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి చెబుతూనే.. షూటింగ్ సెట్లో రామ్ చరణ్ కష్టాన్ని అభిమానులకు కళ్ళకు కట్టినట్లు చెప్పుకొచ్చింది పూజిత పొన్నాడ.

Tags:    
  • pujitaponnada 
  • whereisthevenkatalakshmi 
  • rangasthalam 
  • ramcharan 
  • tollywood 

Similar News

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

శ్రీలీల ఈసారి తెలుగు సినిమాల‌కు ఒకే చెబుతుందా?

2026-11-19 08:07 GMT

నితిన్ వర్సెస్ చైతూ.. అసలు ఫైట్ దర్శకులదే!

2026-11-19 08:07 GMT

Copyright @2026

Powered by Blink CMS