• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  జానీ మూవీ అందరికీ...

జానీ మూవీ అందరికీ నచ్చుతుంది కానీ ప్లాప్ అవ్వడానికి కారణం ఇదే...

| పవన్ కళ్యాణ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జానీ’ అప్పట్లో ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ‘ఖుషి’ తర్వాత వచ్చిన ఈ సినిమాలో పవన్ ఇమేజ్‌కు తగిన కమర్షియల్ అంశాలు లేకపోవడం, హీరో పాత్ర నిస్సహాయంగా కనిపించడం ప్రేక్షకులను నిరాశపరిచాయని విశ్లేషణలు ఉన్నాయి. అయితే డిఫరెంట్ మేకింగ్, దర్శకత్వంతో ఈ సినిమాకు ఇప్పుడు కల్ట్ ఫ్యాన్స్ ఏర్పడ్డారు.

By - Gopi Velupala
Update: 2026-11-17 10:13 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. ప్రస్తుతం ఆయన రాజకీయ రంగంలో బిజీగా ఉన్నప్పటికి ప్రతిసారి సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన కొన్ని సినిమాలకి కమిట్ అయ్యాడు. వాటిని తొందర్లోనే సెట్స్ మీదకి తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నాడు. ఇక పవన్ కళ్యాణ్ తన సొంత డైరెక్షన్ లో చేసిన 'జానీ' సినిమా ప్రేక్షకులను ఆశించిన మేరకు మెప్పించలేకపోయింది. దాంతో ఆయన మరోసారి డైరెక్షన్ చేసే సాహసం చేయలేదు...

జానీ లో ఏం మిస్ అయింది...

ఇప్పటికీ జానీ సినిమా చూసిన చాలామంది ప్రేక్షకులు సినిమా బాగుంటుంది కానీ అనుకున్న రేంజ్ లో సక్సెస్ ని సాధించలేదని కారణమేంటి అని చర్చిస్తుంటారు. నిజానికి జానీ సినిమా పవన్ కళ్యాణ్ కాకుండా వేరే హీరో చేసుంటే సినిమా సక్సెస్ అయ్యేది. ఎందుకంటే 'ఖుషి' సినిమాతో ఆల్ టైం సూపర్ హిట్ సాధించిన పవన్ కళ్యాణ్ ఆ వెంటనే జానీ సినిమాతో ప్రేక్షకులు ముందుకు రావడం ఆ సినిమా పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి తగ్గ కథ కాకపోవడంతో ప్రేక్షకులు నిరాశను వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ అంటే కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు, ప్రేక్షకుల హృదయాలను హత్తుకునే ఎమోషన్స్ ఉండాలి. జానీ సినిమాలో ఎమోషన్స్ ఉన్నప్పటికి పవన్ కళ్యాణ్ ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నట్టుగా మనకు కనిపిస్తాడు. అప్పట్లో ప్రేక్షకుల ఆలోచన మేరకు హీరో అంటే ఏదైనా చేసేయగలిగే కెపాసిటీ ఉన్న వ్యక్తిగా కనిపించాలి. అలా కాకుండా తన భార్యకి క్యాన్సర్ వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు ఫైట్ చేస్తూ డబ్బులను తీసుకొస్తూ ఉంటాడు తప్ప దానికి పర్మినెంట్ సొల్యూషన్ చూపించలేకపోతాడు.

మేకింగ్ కొత్తగా ఉంటుందా?

కమర్షియల్ హీరోకి ఉండే పూర్తి స్వేచ్ఛ ఈ సినిమాలో హీరోకి లేకుండా పోయింది. దానివల్ల సగటు ప్రేక్షకులతో పాటు అభిమానులను కూడా ఈ సినిమా మెప్పించలేకపోయింది. మొత్తానికైతే ఈ సినిమాకి ఇప్పుడు కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు... ఇప్పటికీ ఈ సినిమాని రిపీటెడ్ గా చూస్తున్న ప్రేక్షకులు ఈ మూవీ ఎలా ఫ్లాప్ అయింది అంటూ సోషల్ మీడియాలో కొన్ని కామెంట్లు చేస్తున్నారు... పవన్ కళ్యాణ్ డైరెక్షన్ కూడా ఈ సినిమాకి చాలా బాగా ప్లస్ అయింది. షాట్స్ చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేసుకున్నాడు. అక్కడక్కడ కొంచెం స్లో నేరేషన్ తో సాగినా కూడా సినిమా ఓవరాల్ గా ఒక సపరేట్ జోన్ లో ఉంటుందని అప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ వచ్చిన సినిమాలన్నింటికంటే ఈ సినిమా డిఫరెంట్ గా ఉంటుందని అందువల్లే ప్రేక్షకులకు నచ్చలేదని, ఇప్పుడు చూస్తే అది చాలా ఫ్రెష్ ఫీల్ ఇస్తుంది అంటూ కొంతమంది సినీ విమర్శకులు సైతం కామెంట్స్ చేస్తుండడం విశేషం...

Tags:    
  • pawankalyan 
  • johnnymovie 
  • pawankalyanmovies 
  • tollywood 

Similar News

పట్టుచీరలో సీతమ్మ ఎంత అందంగా ఉందో!

2026-11-17 10:21 GMT

కొత్త సమస్యలో చిక్కుకున్న జూనియర్ ఎన్టీఆర్..!

2026-11-17 10:20 GMT

నెపోటిజం విమర్శలపై అనన్య పాండే స్ట్రాంగ్ కౌంటర్!

2026-11-17 10:20 GMT

అప్ కమింగ్ హీరోలకు స్టోరీ సెలెక్షన్ తెలియడం లేదా?

2026-11-17 10:19 GMT

సాయిపల్లవి vs శ్రీలీల.. డ్యాన్స్‌లో ఎవరు ఇరగదీసారంటే..!

2026-11-17 10:12 GMT

పాత చింతకాయ కథలపై తాప్సీ పన్ను అసహనం!

2026-11-17 10:04 GMT

సాయి పల్లవి హెయిర్ కట్ వెనుక అసలు కథ.. అతని కోసమే అలా చేసిందంట..!

2026-11-17 10:04 GMT

స్టార్ హీరో ఆరేళ్ల రికార్డును.. ఏడాదికే దాటేసిన ఫోక్ సాంగ్..!

2026-11-17 10:03 GMT

'అవెంజర్స్' బుకింగ్స్ చూస్తే మన నిర్మాతలకు ఓ ప్రశ్న!

2026-11-17 10:02 GMT

తల్లిదండ్రుల బంధంపై శృతి హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-17 10:00 GMT

లుక్ టెస్ట్ - ఆడిష‌న్ లేకుండానే ఛాన్సిచ్చారు- రేణు దేశాయ్

2026-11-17 06:51 GMT

Copyright @2026

Powered by Blink CMS